చరణం :
మహదైశ్వర్యమొసగి తొలి కర్మ గహనమును గొట్టి బ్రోచు తల్లి
గుహగజ ముఖజనని యరుణపంకే రుహనయన యోగి హృత్సదన
తుహినాచల తనయ నీ చక్కని మహిమాతిశయమ్ముల చేతను యీ
మహిమలో మునిగణములు ప్రకృతి విరహితులై నిత్యానందులైన
చరణం :
రాజితమణిగణ భూషణి మదగజ రాజగమన లోకశంకరి దనుజ
రాజగురుని వాసరసేవ తనకే జన్మఫలమో కనుగొంటిని
ఆ జన్మము పెద్దలు సదామదిలో నీ జపమే ముక్తిమార్గమనుకొన
రాజ శేఖరుడగు శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి పరాత్పరి
అనుపల్లవి :
అవనిలోనార్షేయ పౌరుషేయం
మంది చోద్యమెరుగ లేనయ్య ఎవరి
చరణం :
భక్త పరాధీనుడనుచు
పరమ భాగవతుల
వ్యక్త రూపుడై పలికిన ముచ్చట
యుక్తమనుచునుణ్టి
శక్తి గల మహా దేవుడు నీవని
సంతోషముననుణ్టి
సత్త చిత్తుడగు త్యాగరాజ నుత
సత్య సంధుడనుకొంటినిలలో