Showing posts with label tyagarajakritis-a. Show all posts
Showing posts with label tyagarajakritis-a. Show all posts

Saturday, November 17, 2012

anyAyamu


















rAgam : kApi
tALam : Adi

pallavi:
anyAyamu sEyakurA rAma
anyunigA cUDakurA nAyeDa

anupallavi:
ennO tappulugalavArini rA
janya nIvu brOcinAvu ganukanu

caraNam :
jaDa BaratuDu jiMka SiSuvu netti baDalaka dIrcagalEdA
kaDalini munigina noka kUrmamu kApADagalEDA

caraNam :
puDamini pAMDava drOhini dharmaputruDu brOvagalEdA
naDimi prAyamuna tyAgarAjanuta
nApUrvaju bAdha dIrpalEnani

రాగం : కాపి
తాళం : ఆది

పల్లవి:
అన్యాయము సేయకురా రామ
అన్యునిగా చూడకురా నాయెడ

అనుపల్లవి:
ఎన్నో తప్పులుగలవారిని రా
జన్య నీవు బ్రోచినావు గనుకను

చరణం :
జడ భరతుడు జింక శిశువు నెత్తి బడలక దీర్చగలేదా
కడలిని మునిగిన నొక కూర్మము కాపాడగలేడా

చరణం :
పుడమిని పాండవ ద్రోహిని ధర్మపుత్రుడు బ్రోవగలేదా
నడిమి ప్రాయమున త్యాగరాజనుత
నాపూర్వజు బాధ దీర్పలేనని



Sunday, June 17, 2012

aTla palukuduvu














rAgam: aTHANa
ArTisT: Smt Mambalam sisters
pallavi:
aTla palukuduvu iTla palukuduvu
anduEmi sEtu rAmA nIvaTla

anupallavi:
toTlanarbhakula nUtuvu mari tOcinaTlu gilluduvu SrI rAma nIvaTla

caraNam:
jIvula Sikshimcaga nErtuvu ciranjIvuluga jEya
nErtuvurA bhAvamerigi  brOtuvu sadbhakta
bhAgadhEya SrI tyAgarAja vinuta (aTla)

రాగం: అఠాణ 

పల్లవి:
అట్ల పలుకుదువు ఇట్ల పలుకుదువు  
అందుఏమి సేతు రామా నీవట్ల 

అనుపల్లవి:
తొట్లనర్భకుల నూతువు మరి తోచినట్లు గిల్లుదువు శ్రీ రామ నీవట్ల 

చరణం:  
జీవుల శిక్షించగ నేర్తువు చిరంజీవులుగ జేయ 
నేర్తువురా భావమెరిగి  బ్రోతువు సద్భక్త   
భాగధేయ శ్రీ త్యాగరాజ వినుత (అట్ల) 

Monday, December 26, 2011

Baktuni cAritramu



















rAgam : bEgaDa
tALam : Adi
pallavi:
Baktuni cAritramu vinavE sItArAmA
anupallavi:
AsaktilEka tAgOrucu jIvanmuktuDai AnaMdamunoMdu
caraNam1:
japatapamulu tAjEsiti nanarAdu adigAka mari | kapaTAtmuDu manamai balkarAdu
upama tanaku lEka yuMDavalenani | Ura yUra tirugagarAdu
capalacittuDai Alu sutulapai | sAreku Brama kArAdanE hari ||
caraNam2:
BavaviBavamu nijamani yeMcagarAdu adigAka mari |
Siva mAdhava BEdamu jEyagarAdu |
BuvanamaMdu tAnE yOgyuDanani | bomki poTTasAkagarAdu
pavanAtmaja dhRtamau sItApati | pAdamulanu yEmararAdanu hari ||
caraNam3:
rAjasa tAmasa guNamulu gArAdu adigAkanu avyAjamunanu rAlEdanaga rAdu
rAjayOgamArgamu nI cittamu | rAjUcuTa viDuvagarAdu rAjaSiKAmaNiyaina
tyAgarAja saKuni maruvarAdanE hari ||


రాగం : బేగడ
తాళం : ఆది
పల్లవి:
భక్తుని చారిత్రము వినవే సీతారామా
అనుపల్లవి:
ఆసక్తిలేక తాగోరుచు జీవన్ముక్తుడై ఆనందమునొందు
చరణం1:
జపతపములు తాజేసితి ననరాదు అదిగాక మరి | కపటాత్ముడు మనమై బల్కరాదు
ఉపమ తనకు లేక యుండవలెనని | ఊర యూర తిరుగగరాదు
చపలచిత్తుడై ఆలు సుతులపై | సారెకు భ్రమ కారాదనే హరి ||
చరణం2:
భవవిభవము నిజమని యెంచగరాదు అదిగాక మరి |
శివ మాధవ భేదము జేయగరాదు |
భువనమందు తానే యోగ్యుడనని | బొంకి పొట్టసాకగరాదు
పవనాత్మజ ధృతమౌ సీతాపతి | పాదములను యేమరరాదను హరి ||
చరణం3:
రాజస తామస గుణములు గారాదు అదిగాకను అవ్యాజమునను రాలేదనగ రాదు
రాజయోగమార్గము నీ చిత్తము | రాజూచుట విడువగరాదు రాజశిఖామణియైన
త్యాగరాజ సఖుని మరువరాదనే హరి ||