Sunday, February 24, 2013

koluvaiyunnADE


















rAgam : dEvagAMdhAri
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
koluvaiyunnADE kOdaMDapANi

anupallavi :
salalitamatulai sAreku SIlulai
valacucu kOri vacci sEviMpaga

caraNam :
janakaja BaratAdulatO maMci naivEdyaMbula
canuvuna vEDuka nAragiMci merapukOTlagEru
kanaka paTamu sommulanu dhariMci vEdOktamulaina
sanaka vacanamulacE tOShiMci Sritula pOShiMci

caraNam :
varavagu vAsanalu parimaLiMpa sannidhilO velugucu
suravArasatulu bAga naTiMpa adigAka parA
SaranArada munulella nutiMpa eMteMtO nenaruna
surapati vAgISulu sEviMpa mEnu pulakariMpa

caraNam :
uDurAjamuKuDu SEShaSayyapaini celaMgaga gani
puDami kumAri suguMdhamu pUya namminavAralakE
kaDagaMTini kOrina varamIya  tyAgarAju nenaruga
aDugaDuguku maDupula naMdIya SrIrAmayya


రాగం : దేవగాంధారి
తాళం : ఆది

పల్లవి:
కొలువైయున్నాడే కోదండపాణి

అనుపల్లవి :
సలలితమతులై సారెకు శీలులై
వలచుచు కోరి వచ్చి సేవింపగ

చరణం :
జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబుల
చనువున వేడుక నారగించి మెరపుకోట్లగేరు
కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తములైన
సనక వచనములచే తోషించి శ్రితుల పోషించి

చరణం :
వరవగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు
సురవారసతులు బాగ నటింప అదిగాక పరా
శరనారద మునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకరింప

చరణం :
ఉడురాజముఖుడు శేషశయ్యపైని చెలంగగ గని
పుడమి కుమారి సుగుంధము పూయ నమ్మినవారలకే
కడగంటిని కోరిన వరమీయ  త్యాగరాజు నెనరుగ
అడుగడుగుకు మడుపుల నందీయ శ్రీరామయ్య

No comments:

Post a Comment