Saturday, March 2, 2013

darini telusukoMTi























rAgam : SuddhasAvEri
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi :
darini telusukoMTi tripurasuMdari ninnE SaraNaMTi

anupallavi :
marunijanakuDaina mAdaSaratha kumAruni sOdari dayApari mOkSha

caraNam :
aMbatrijagadISvarI muKajita vidhu
biMba yAdipuramuna nelakonna kana
kAmbari namminavArini kaBIShTa varaMbulosagu dInarakShaki
aMbujaBava puruhUta sanaMdana tuMburu nAradAdulaMdaru nIdu pa
daMbunukOri sadAnityAnaMdaM budhilO nOlalADucuMDE

caraNam :
mahadaiSvaryamosagi toli karma gahanamunu goTTi brOcu talli
guhagaja muKajanani yaruNapaMkE ruhanayana yOgi hRtsadana
tuhinAcala tanaya nI cakkani mahimAtiSayammula cEtanu yI
mahimalO munigaNamulu prakRti virahitulai nityAnaMdulaina

caraNam :
rAjitamaNigaNa  BUShaNi madagaja  rAjagamana lOkaSaMkari danuja
rAjaguruni vAsarasEva tanakE janmaPalamO kanugoMTini
A janmamu peddalu sadAmadilO nI japamE muktimArgamanukona
rAja SEKaruDagu SrI tyAgarAja manOhari gauri parAtpari


రాగం : శుద్ధసావేరి
తాళం : ఆది

పల్లవి :
దరిని తెలుసుకొంటి త్రిపురసుందరి నిన్నే శరణంటి

అనుపల్లవి :
మరునిజనకుడైన మాదశరథ కుమారుని సోదరి దయాపరి మోక్ష

చరణం :
అంబత్రిజగదీశ్వరీ ముఖజిత విధు
బింబ యాదిపురమున నెలకొన్న కన
కాంబరి నమ్మినవారిని కభీష్ట వరంబులొసగు దీనరక్షకి
అంబుజభవ పురుహూత సనందన తుంబురు నారదాదులందరు నీదు ప
దంబునుకోరి సదానిత్యానందం బుధిలో నోలలాడుచుండే

చరణం :
మహదైశ్వర్యమొసగి తొలి కర్మ గహనమును గొట్టి బ్రోచు తల్లి
గుహగజ ముఖజనని యరుణపంకే రుహనయన యోగి హృత్సదన
తుహినాచల తనయ నీ చక్కని మహిమాతిశయమ్ముల చేతను యీ
మహిమలో మునిగణములు ప్రకృతి విరహితులై నిత్యానందులైన

చరణం :
రాజితమణిగణ  భూషణి మదగజ  రాజగమన లోకశంకరి దనుజ
రాజగురుని వాసరసేవ తనకే జన్మఫలమో కనుగొంటిని
ఆ జన్మము పెద్దలు సదామదిలో నీ జపమే ముక్తిమార్గమనుకొన
రాజ శేఖరుడగు శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి పరాత్పరి




No comments:

Post a Comment