Thursday, December 22, 2011

E pApamu



















rAgam :aThANa
tALam : tripuTa tALam
pallavi:
E pApamu cEsitirA rAma nI
kEpATaina dayarAdu nE ||nE||
anupallavi:
nI pAdamulanu gana mo~raliDitE
nI pATuna vini vinanaTluMDuTaku nE ||nE||
caraNam1:
nAtha rUpuDavani vininE SrInAtha ninnu nammitini
nAdApuramuna nuMDiyu nannAdariMcaka yUrakuMDuTaku nE ||nE||
caraNam2:
eMdukanucu sairiMtura rAma muMdu venuka tOcadurA
muMdara nilaci balukura nAyamdu nIku Ivaraku marapura
caraNam3:
gAraviMpa dayarAdA pAlu gAru mOmujUparAdA
UrakuMDuTa mariyAdA nAdUra delpuvArevvaru lErA
caraNam4:
kannavArini vEDinAnA nA yanna ninnADu konnAnA
ninnu namminavADanu gAnA muni sannuta kapaTamulanni nAtOnA
caraNam5:
vinavayya inakuladhanamA rAmA ninunammi iMka duritamA
Buvanamuna nIkidi GanamA nI manasiTuvaMTi danucunu delupamA
caraNam6:
sadayuDai iMka parAkA nA hRdayadAsuDu nIvEgAka
idi buddhiyanucu delpalEka nADu modalugAnu yurakunnAvugAka
caraNam7:
rAjaSEKara sannutAMga tyAgarAja hRdabja suBRMga
rAjita karuNApAMga ratirAja janaka pApadhvAMta pataMga



రాగం :అఠాణ
తాళం : త్రిపుట తాళం
పల్లవి:
ఏ పాపము చేసితిరా రామ నీ
కేపాటైన దయరాదు నే ||నే||
అనుపల్లవి:
నీ పాద;ములను గన మొఱలిడితే
నీ పాటున విని విననట్లుండుటకు నే ||నే||
చరణం1:
నాథ రూపుడవని వినినే శ్రీనాథ నిన్ను నమ్మితిని
నాదాపురమున నుండియు నన్నాదరించక యూరకుండుటకు నే ||నే||
చరణం2:
ఎందుకనుచు సైరింతుర రామ ముందు వెనుక తోచదురా
ముందర నిలచి బలుకుర నాయందు నీకు ఈవరకు మరపుర
చరణం3:
గారవింప దయరాదా పాలు గారు మోముజూపరాదా
ఊరకుండుట మరియాదా నాదూర దెల్పువారెవ్వరు లేరా
చరణం4:
కన్నవారిని వేడినానా నా యన్న నిన్నాడు కొన్నానా
నిన్ను నమ్మినవాడను గానా ముని సన్నుత కపటములన్ని నాతోనా
చరణం5:
వినవయ్య ఇనకులధనమా రామా నినునమ్మి ఇంక దురితమా
భువనమున నీకిది ఘనమా నీ మనసిటువంటి దనుచును దెలుపమా
చరణం6:
సదయుడై ఇంక పరాకా నా హృదయదాసుడు నీవేగాక
ఇది బుద్ధియనుచు దెల్పలేక నాడు మొదలుగాను యురకున్నావుగాక
చరణం7:
రాజశేఖర సన్నుతాంగ త్యాగరాజ హృదబ్జ సుభృంగ
రాజిత కరుణాపాంగ రతిరాజ జనక పాపధ్వాంత పతంగ

No comments:

Post a Comment