Tuesday, May 22, 2012

mIvallaguNa















rAgam : kApi
ArTisT : Smt.MS.subbalakhsmi gAru

pallavi:
mI valla guNa dOshamEmi SrI rAma

anupallavi:
nAvallanE kAni naLina daLa nayana

caraNam1:
bangAru bAguga padivanne gAkumTE
angalArcucu battunADukOnEla

caraNam2:
tana tanaya prasava vEdanakOrva lEkumTE
anayayallunipai ahankAra paDanEla

caraNam3:
E janmamuna pAtramerigi dAnambika
pUjimcina maraci vElpulanADukOnEla

caraNam4:
nA manasu nA prEma nannalaya jEsina
rAjillu SrI tyAgarAja nuta caraNa


రాగం : కాపి

పల్లవి:
మీ వల్ల గుణ దోషమేమి శ్రీ రామ

అనుపల్లవి:
నావల్లనే కాని నళిన దళ నయన

చరణం1:
బంగారు బాగుగ పదివన్నె గాకుంటే
అంగలార్చుచు బత్తునాడుకోనేల

చరణం2:
తన తనయ ప్రసవ వేదనకోర్వ లేకుంటే
అనయయల్లునిపై అహంకార పడనేల

చరణం3:
ఏ జన్మమున పాత్రమెరిగి దానంబిక
పూజించిన మరచి వేల్పులనాడుకోనేల

చరణం4:
నా మనసు నా ప్రేమ నన్నలయ జేసిన
రాజిల్లు శ్రీ త్యాగరాజ నుత చరణ

mitri bhAgyamE














rAgam : kharahArapriya

ArTisT : SrI rAghavAchAri gAru & SEshAchAri gAru

pallavi:
mitri bhAgyamE bhAgyamu manasA saumitri

anupallavi:
citra ratnamaya SEsha talpamandu
sItA patini uniciyUcu saumitri

caraNam1:
bAguga vinta rAgamulanAlApamu
sEyaga mEnu pulakarincaga
tyAgarAja nutuDagu SrI rAmuni
tatvArthamunu pogaDi jUcu saumitri


రాగం : ఖరహారప్రియ

ఆర్టిస్ట్ : శ్రీ రాఘవాచారి గారు  & శేషాచారి గారు

పల్లవి:
మిత్రి భాగ్యమే భాగ్యము మనసా సౌమిత్రి

అనుపల్లవి:
చిత్ర రత్నమయ శేష తల్పమందు
సీతా పతిని ఉనిచియూచు సౌమిత్రి

చరణం1:
బాగుగ వింత రాగములనాలాపము
సేయగ మేను పులకరించగ
త్యాగరాజ నుతుడగు శ్రీ రాముని
తత్వార్థమును పొగడి జూచు సౌమిత్రి

ninnADa nEla



rAgam : kAnaDa

pallavi:
ninnADa nEla nIrajAksha

anupallavi:
kannavAri paini kAka sEyanEla

caraNam1:
karmamunaku taginaTlu kAryamulu naDucunu
dharmamunaku taginaTlu daivamu brOcunu

caraNam2:
cittamunaku taginaTlu siddhiyu kalgunu
vittamunaku taginaTlu vEDuka naDucunu

caraNam3:
satya rUpa ninnu sannuti jEsi
tatvamu telisina tyAgarAjuniki


రాగం : కానడ

పల్లవి:
నిన్నాడ నేల నీరజాక్ష

అనుపల్లవి:
కన్నవారి పైని కాక సేయనేల 

చరణం1:
కర్మమునకు తగినట్లు కార్యములు నడుచును 
ధర్మమునకు తగినట్లు దైవము బ్రోచును 

చరణం2:
చిత్తమునకు తగినట్లు సిద్ధియు కల్గును 
విత్తమునకు తగినట్లు వేడుక నడుచును 

చరణం3:
సత్య రూప నిన్ను సన్నుతి జేసి
తత్వము తెలిసిన త్యాగరాజునికి