Showing posts with label tyagarajakritis-O. Show all posts
Showing posts with label tyagarajakritis-O. Show all posts

Saturday, November 17, 2012

O rAjIvAkSha

















rAgam : AraBi  
tALam : Adi
ArTisT : Sri.Malladi Brothers
pallavi:
O rAjIvAkSha OrajUpulujUcE vEra nEnIku vEra

anupallavi :
nEraninApai nEramuleMcitE
kArAdanibalkEvAru lEninannu

caraNam :
makkuvatOninnu mrokkinajanulaku
dikku nIvai atigrakkuna brOtuvani
ekkuvajanulayokka mATaluvini
cakkani SrIrAmadakkitigadarA

caraNam :
mitimIralEni prakRtilOnadagilinE
matihInuDai sannutisEyanIraka
batimAli nIvEgatiyani nera
nammitigAni ninu maracitinAsaMtatamu

caraNam :
mAvara suguNa umAvarasannuta
dEvara dayacEsi brOvagarAdA
pAvanaBaktajanAvana mahAnu
BAva tyAgarAjaBAvita iMkanannu


రాగం : ఆరభి  
తాళం : ఆది

పల్లవి:
ఓ రాజీవాక్ష ఓరజూపులుజూచే వేర నేనీకు వేర

అనుపల్లవి :
నేరనినాపై నేరములెంచితే
కారాదనిబల్కేవారు లేనినన్ను

చరణం :
మక్కువతోనిన్ను మ్రొక్కినజనులకు
దిక్కు నీవై అతిగ్రక్కున బ్రోతువని
ఎక్కువజనులయొక్క మాటలువిని
చక్కని శ్రీరామదక్కితిగదరా

చరణం :
మితిమీరలేని ప్రకృతిలోనదగిలినే
మతిహీనుడై సన్నుతిసేయనీరక
బతిమాలి నీవేగతియని నెర
నమ్మితిగాని నిను మరచితినాసంతతము

చరణం :
మావర సుగుణ ఉమావరసన్నుత
దేవర దయచేసి బ్రోవగరాదా
పావనభక్తజనావన మహాను
భావ త్యాగరాజభావిత ఇంకనన్ను

Friday, December 23, 2011

OracUpu cUcEdi















rAgam: kannaDagaula
tALam : dESAdi

pallavi:
OracUpu cUcEdi nyAyamA O raGUttamA nIvaMTivAniki
anupallavi:
nIrajAksha munu nIdAsulaku nIkETivAvulu telpavE

caraNam:

mAnamiMcukaina nIku dOcalEkapOyina vainamEmi puNyarUpamA
dInarakshakA SritamAnavasaM tAna gAnalOla tyAgarAjanuta

రాగం: కన్నడగౌల
తాళం : దేశాది
పల్లవి:
ఓరచూపు చూచేది న్యాయమా ఓ రఘూత్తమా నీవంటివానికి
అనుపల్లవి:
నీరజాక్ష మును నీదాసులకు నీకేటివావులు తెల్పవే
చరణం:
మానమించుకైన నీకు దోచలేకపోయిన వైనమేమి పుణ్యరూపమా
దీనరక్షకా శ్రితమానవసం తాన గానలోల త్యాగరాజనుత


Monday, November 7, 2011

O ranga SAyi



 rAgam : kAmbhOji
ArTisT: Smt . MS Subbalakshmi garu

pallavi:
O ranga SAyi pilicitE
Oyanucu rA rAdA

anupallavi:
sAranga dharuDu jUci kailAsAdhipuDu kA lEdA ( O ranga )

caraNam :
bhUlOka vaikuMThamidi yani
nI lOna nIvEyuppongi
SrI lOluDai yuMTE mA
cinta tIrEdennaDO
mElOrva lEni janulalO nE
migula nogili divya rUpamunu
mutyAla sarula yuramunu kAna
vacciti tyAgarAja hRd-bhUshaNa ( O ranga)


రాగం : కాంభోజి
పల్లవి:
ఓ రంగ శాయి పిలిచితే 
ఓయనుచు రా రాదా

అనుపల్లవి:
సారంగ ధరుడు జూచి కైలాసాధిపుడు కా లేదా ( ఓ రంగ )

చరణం :
భూలోక వైకుంఠమిది యని 
నీ లోన నీవేయుప్పొంగి
శ్రీ లోలుడై యుంటే మా
చింత తీరేదెన్నడో
మేలోర్వ లేని జనులలో నే
మిగుల నొగిలి దివ్య రూపమును
ముత్యాల సరుల యురమును కాన
వచ్చితి త్యాగరాజ హృద్-భూషణ ( ఓ రంగ)