Monday, November 28, 2011

nAmorAlakimpa


rAgam : dEvagAndhAri
tALam : rUpakam
ArTisT : SrI.MallAdi brothers
pallavi:
nA morAlakimpavEmi SrIrAma

anupallavi:
nI mahimalu vini vininEneMtO ne~ranammiti (SaraNamTi)

caraNam:
oka vanacaruDalanADu sahOdaru bAdhalu tALaka
mo~raliDa brOcitivi tanaku sugrIvamugAdA

caraNam:
oka niSicaruDanna mATalOrvaka SaraNanagA
SukavacanamulO nA dupalukulanni viBIshaNamA

caraNam :
pUsaluguccina yaTuvale pUni BajiMcaga
Asalugala tyAgarAju dAsuDanucu delisi


రాగం : దేవగాంధారి
తాళం : రూపకం

పల్లవి:
నా మొరాలకింపవేమి శ్రీరామ

అనుపల్లవి:
నీ మహిమలు విని వినినేనెంతో నెఱనమ్మితి (శరణంటిని)

చరణం:
ఒక వనచరుడలనాడు సహోదరు బాధలు తాళక
మొఱలిడ బ్రోచితివి తనకు సుగ్రీవముగాదా

చరణం:
ఒక నిశిచరుడన్న మాటలోర్వక శరణనగా
శుకవచనములో నా దుపలుకులన్ని విభీషణమా

చరణం :
పూసలుగుచ్చిన యటువలె పూని భజించగ
ఆసలుగల త్యాగరాజు దాసుడనుచు దెలిసి

EmicEsitE

















rAgam: tODi
tALam : Adi
ArTisT: SrI.bAlamuraLi kRshNa

pallavi:
Emi cEsitE nEmi SrIrAma
svAmi karuNa lEnivArilalO

anupallavi:
kAmamOha dAsulai SrI rAmuni
kaTTu teliyalEni vArilalO

caraNam :
savamu cEsitEnEmi kalimiki
putrOtsavamu kalgitE nEmi BuvilO
nanya bIja janitunikoni yEmi
Sivakara SrIrAmuni dayalEni vArilalO

caraNam:
mEDa gaTTitEnEmi aMduna IMdar jODugaTTitEnEmi
cEDiyalanu meppiMca delisitEnEmi
IDulEni rAmuni dayalEnivArE

caraNam :
immu galigitEnEmi illAliki sommubeTTitEnEmi
kamma viltukELini telisiyEmi
tammikaMTi vAni karuNalEni vArilalO

caraNam:
rAjyamElitEnEmi bahujanulalO bUjyulaitEnEmi
AjyapravAhamutO nannamiDitEnEmi
pUjyuDaina rAmuni dayalEni vArilalO


రాగం: తోడి
తాళం : ఆది

పల్లవి:
ఏమి చేసితే నేమి శ్రీరామ
స్వామి కరుణ లేనివారిలలో

అనుపల్లవి:
కామమోహ దాసులై శ్రీ రాముని
కట్టు తెలియలేని వారిలలో

చరణం :
సవము చేసితేనేమి కలిమికి
పుత్రోత్సవము కల్గితే నేమి భువిలో
నన్య బీజ జనితునికొని యేమి
శివకర శ్రీరాముని దయలేని వారిలలో

చరణం:
మేడ గట్టితేనేమి అందున ఈందర్ జోడుగట్టితేనేమి
చేడియలను మెప్పించ దెలిసితేనేమి
ఈడులేని రాముని దయలేనివారే

చరణం :
ఇమ్ము గలిగితేనేమి ఇల్లాలికి సొమ్ముబెట్టితేనేమి
కమ్మ విల్తుకేళిని తెలిసియేమి
తమ్మికంటి వాని కరుణలేని వారిలలో

చరణం:
రాజ్యమేలితేనేమి బహుజనులలో బూజ్యులైతేనేమి
ఆజ్యప్రవాహముతో నన్నమిడితేనేమి
పూజ్యుడైన రాముని దయలేని వారిలలో

sompaina


rAgam: Ahiri
tALam : Adi
ArTisT: Smt.PriyA sisters

pallavi:
callarE SrI rAmacaMdrunipaina pUla

caraNam:
soMpaina manasutO iMpaina baMgAru
gaMpalatO maMci caMpakamulanu

caraNam :
pAmaramulu mAni nEmamutO
rAmAmanOharunipaina tAmarapUla

caraNam:
I jagatini dEva pUjArhamau pUla
rAjillumElaina jAjisumamula decci

caraNam:
amitaparAkrama dyumaNikulArNava
vimalacaMdrunipai hRtkumudasumamula

caraNam:
ennarAni janana maraNamulu lEkuMDa
manasAra tyAgarAjanutunipai


రాగం: ఆహిరి
తాళం : ఆది

పల్లవి:
చల్లరే శ్రీ రామచంద్రునిపైన పూల
చరణం:
సొంపైన మనసుతో ఇంపైన బంగారు
గంపలతో మంచి చంపకములను
చరణం :
పామరములు మాని నేమముతో
రామామనోహరునిపైన తామరపూల
చరణం:
ఈ జగతిని దేవ పూజార్హమౌ పూల
రాజిల్లుమేలైన జాజిసుమముల దెచ్చి
చరణం:
అమితపరాక్రమ ద్యుమణికులార్ణవ
విమలచంద్రునిపై హృత్కుముదసుమముల
చరణం:
ఎన్నరాని జనన మరణములు లేకుండ
మనసార త్యాగరాజనుతునిపై

padavinI



rAgam: sALangaBairavi
tALam : Adi
ArTisT: SrI.MallAdi brothers

pallavi:
padavi nI sadBaktiyu kalguTE

anupallavi:
cadivi vEdaSAstrOpanishattula
satta teliyalEnidi padavA

caraNam 1:
dhanadAna sutAgAra saMpadalu
dharaNISula celimoka padavA
rAgalOBayuta yaj~nAdulacE
BOgamu labbuTa yadi padavA

caraNam 2:
japatapAdi yaNimAdi siddhulacE
jagamula nEcuTa yadi padavA

caraNam 3:
tyAgarAjanutuDau SrIrAmuni
tattvamu teliyani doka padavA


రాగం: సాళంగభైరవి
తాళం : ఆది

పల్లవి:
పదవి నీ సద్భక్తియు కల్గుటే

అనుపల్లవి:
చదివి వేదశాస్త్రోపనిషత్తుల
సత్త తెలియలేనిది పదవా

చరణం 1:
ధనదాన సుతాగార సంపదలు
ధరణీశుల చెలిమొక పదవా
రాగలోభయుత యజ్ఞాదులచే
భోగము లబ్బుట యది పదవా

చరణం 2:
జపతపాది యణిమాది సిద్ధులచే
జగముల నేచుట యది పదవా

చరణం 3:
త్యాగరాజనుతుడౌ శ్రీరాముని
తత్త్వము తెలియని దొక పదవా

tanayuni



rAgam: Bairavi
tALam : Adi

ArTisT: SrI.MallAdi brothers

pallavi:
tanayuni brOva janani occunO
tallivadda bAluDu bOnO

anupallavi:
inakulOttamA yI rahasyamunu
yerigiMpumu mOmunu ganipiMpumu

caraNam:
vatsamu veMTa dhEnuvu canunO
vAridamulugani pairulu canunO
matsyakaMTiki viTuDu veDalunO
mahini tyAgarAja vinuta rammu delpumu


రాగం: భైరవి
తాళం : ఆది

పల్లవి:
తనయుని బ్రోవ జనని ఒచ్చునో
తల్లివద్ద బాలుడు బోనో
అనుపల్లవి:
ఇనకులోత్తమా యీ రహస్యమును
యెరిగింపుము మోమును గనిపింపుము
చరణం:
వత్సము వెంట ధేనువు చనునో
వారిదములుగని పైరులు చనునో
మత్స్యకంటికి విటుడు వెడలునో
మహిని త్యాగరాజ వినుత రమ్ము దెల్పుము


suguNamulE


rAgam: cakravAkam
tALam : rUpakam
ArTisT: Smt.gAyatrI girIsh
pallavi:
suguNamulE ceppukomTi sundara raGurAma
anupallavi:
vagale~ruMgalEka iTu vattu vanucu durASacE
caraNam:
snAnAdi sukarmaMbulu dAnAdhyAnaMbu le~ruga
SrI nAyaka kshamiyiMpumu SrI tyAgarAja vinuta

రాగం: చక్రవాకం
తాళం : రూపకం
పల్లవి:
సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ
అనుపల్లవి:
వగలెఱుంగలేక ఇటు వత్తు వనుచు దురాశచే
చరణం:
స్నానాది సుకర్మంబులు దానాధ్యానంబు లెఱుగ
శ్రీ నాయక క్షమియింపుము శ్రీ త్యాగరాజ వినుత

Saturday, November 26, 2011

karuNaElAganTE



rAgam:varALi

pallavi:
karuNa ElAgaMTE nI vidhamE kaLyANa suMdararAma 

anupallavi :
paramAtmuDu jIvAtmuDu yokaDai
paragucuMDu Bakta parAdhInuni

caraNam :
anRtaM bADaDu alpula vEDaDu
sunRpula goluvaDu sUryuni maruvaDu

caraNam :
mAMsamu muTTaDu madhuvunu trAgaDu
parahiMsala jEyaDu yerukanu maravaDu

caraNam :
vaMcana sEyaDu varulatO boMkaDu
caMcala cituDai sauKyamu viDuvaDu

caraNam:
sAkShiyani delasi yaMdu  lakshyamu viDuvaDu
kaMjAkshuni tyAgarAja rakshakuDainavAni


రాగం:వరాళి
పల్లవి:
కరుణ ఏలాగంటే నీ విధమే కళ్యాణ సుందరరామ 
అనుపల్లవి :
పరమాత్ముడు జీవాత్ముడు యొకడై
పరగుచుండు భక్త పరాధీనుని
చరణం :
అనృతం బాడడు అల్పుల వేడడు
సునృపుల గొలువడు సూర్యుని మరువడు
చరణం :
మాంసము ముట్టడు మధువును త్రాగడు
పరహింసల జేయడు యెరుకను మరవడు
చరణం :
వంచన సేయడు వరులతో బొంకడు
చంచల చితుడై సౌఖ్యము విడువడు
చరణం:
సాక్షియని దెలసి యందు  లక్ష్యము విడువడు
కంజాక్షుని త్యాగరాజ రక్షకుడైనవాని

Wednesday, November 16, 2011

pUlapAnpu


rAgam: Ahiri

ArTisT: Smt.Sowmya

pallavi:
pUlapAn&pu mIda bAga pUrNa pavvaLiMcu     

anupallavi:
nIlamEGaSyAmaharE nirupama rAmayya malle

caraNam1:
madhuraSarkara nAnubAlu ma~ri yAragiMci
vidhumuKa kammani viDemuvEsi nanu gaTAkShiMci

caraNam2:
parimaLagaMdhaMbu mEna bAgugAnu bUsi 
me~rayaga sumahAramulanu meDaniniMDanu vEsi

caraNam3:
AgamOktamainaSayya naMgIkariMci
tyAgarAja kRtamullela tathyamani saMtOShiMci  


రాగం: ఆహిరి
పల్లవి:
పూలపాన్పు మీద బాగ పూర్ణ పవ్వళించు  
 
అనుపల్లవి:
నీలమేఘశ్యామహరే నిరుపమ రామయ్య మల్లె

చరణం1:
మధురశర్కర నానుబాలు మఱి యారగించి
విధుముఖ కమ్మని విడెమువేసి నను గటాక్షించి

చరణం2:
పరిమళగంధంబు మేన బాగుగాను బూసి 
మెఱయగ సుమహారములను మెడనినిండను వేసి

చరణం3:
ఆగమోక్తమైనశయ్య నంగీకరించి
త్యాగరాజ కృతముల్లెల తథ్యమని సంతోషించి   

nApAli


rAgam: SankarAbharaNaM/navarOju
tALam : Adi

ArTisT : Smt.Sowmya

pallavi:
nA pAli SrIrAma BUpAlaka stOma
kApADu samayamu nI pAdamulIra

caraNam1:
Bali Bali Baktula pUjaPalamu nIvanukoMTi
naLinalOcana nIku nalugu beTTErA

caraNam2:
kOTi manmadhulaina sATigA nI sogasu
nATi yunnadi madini mETi SrIrAma

caraNam3:
toli pUja PalamEmo kalige nI padasEva
naluvakainanu ninnu deliyaga taramA

caraNam4:
patita pAvana nIvu pAliMcakuMTEnu
gati mAkevaru mammugrakkuna brOvu

caraNam5:
kOri nI padasEva sAreku sEyanu dalaci
mAramaNa nAlOnE marulu konnAnu

caraNam6:
nirupEdakabbina nidhirIti dorikitivi
vara tyAgarAjuniki varada mrokkEra 


రాగం: శంకరాభరణం/నవరోజు
తాళం : ఆది
పల్లవి:
నా పాలి శ్రీరామ భూపాలక స్తోమ
కాపాడు సమయము నీ పాదములీర
చరణం1:
భలి భలి భక్తుల పూజఫలము నీవనుకొంటి
నళినలోచన నీకు నలుగు బెట్టేరా
చరణం2:
కోటి మన్మధులైన సాటిగా నీ సొగసు
నాటి యున్నది మదిని మేటి శ్రీరామ
చరణం3:
తొలి పూజ ఫలమేమొ కలిగె నీ పదసేవ
నలువకైనను నిన్ను దెలియగ తరమా
చరణం4:
పతిత పావన నీవు పాలించకుంటేను
గతి మాకెవరు మమ్ముగ్రక్కున బ్రోవు
చరణం5:
కోరి నీ పదసేవ సారెకు సేయను దలచి
మారమణ నాలోనే మరులు కొన్నాను
చరణం6:
నిరుపేదకబ్బిన నిధిరీతి దొరికితివి
వర త్యాగరాజునికి వరద మ్రొక్కేర 

manasA



rAgam: malayamArutaM
pallavi:
manasA eTulOrtunE nA manavini cEkonavE O

anupallavi:
dinakara kula BUshaNuni dInuDavai Bajana jEsi
dinamu gaDupumanina nIvu vinavadEla guNavihIna

caraNam:
kalilO rAjasa tAmasa guNamulu galavAri celimi
kalisi melisi ti~rugucu ma~ri kAlamu gaDapakanE
sulaBamugA gaDatEranu sUcanalanu deliyajEyu
ilanu tyAgarAju mATa vinavadEla guNavihIna


రాగం: మలయమారుతం
పల్లవి:
మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ

అనుపల్లవి:
దినకర కుల భూషణుని దీనుడవై భజన జేసి
దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవిహీన

చరణం:
కలిలో రాజస తామస గుణములు గలవారి చెలిమి
కలిసి మెలిసి తిఱుగుచు మఱి కాలము గడపకనే
సులభముగా గడతేరను సూచనలను దెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన

Tuesday, November 15, 2011

brOvabhAramA


rAgam : bahudAri 
ArTisT: Sri Malladi brothers

pallavi:
brOva BAramA raGurAmA Buvanamella nIvai nannokani 

anupallavi:
SrI vAsudEva aMDakOTlu kukShini uMcukOlEdA nannu

caraNam:
kalaSAMbudhilO dayatO namarulaki yadi gAka gOpikalakai
koMDanetta lEdA karuNAkara tyAgarAjuni


రాగం : బహుదారి
పల్లవి:
బ్రోవ భారమా రఘురామా భువనమెల్ల నీవై నన్నొకని 

అనుపల్లవి:
శ్రీ వాసుదేవ అండకోట్లు కుక్షిని ఉంచుకోలేదా నన్ను

చరణం:
కలశాంబుధిలో దయతో నమరులకి యది గాక గోపికలకై
కొండనెత్త లేదా కరుణాకర త్యాగరాజుని


nanupAlimpa


rAgam : mOhana
ArTisT : Smt.Priya sisters

pallavi :
nanu pAlimpa naDaci vaccitivO nA prANanAtha

anupallavi:
vanaja nayana mOmunu jUcuTE
jIvanamani nenaruna manasu marmamu delisi

caraNam :
kAvu kAvu maninE morabeTTagA
karugadEmi madi kamalalOcani
nIvu brOvakunna evaru brOturu
sadA varaMbosagu tyAgarAjanutE


రాగం : మోహన
పల్లవి :
నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాథ

అనుపల్లవి:
వనజ నయన మోమును జూచుటే
జీవనమని నెనరున మనసు మర్మము దెలిసి

చరణం :
కావు కావు మనినే మొరబెట్టగా
కరుగదేమి మది కమలలోచని
నీవు బ్రోవకున్న ఎవరు బ్రోతురు
సదా వరంబొసగు త్యాగరాజనుతే

rAgaratnamAlikacE


rAgam: rItigowLa

ArTisT : Smt.Priya Sisters

pallavi:
rAga ratna mAlikacE raMjillunaTa hariSata

anupallavi:
bAgasEvimci sakala BAgyamaMdu dAmurAre

caraNam :
naigama ShaT SAstrapurANAgamArtha sahitamaTa
yOgivarulu AnaMdamu noMdE sanmArgamaTa
BAgavatOttamulukUDi pADE kIrtanamulaTa
tyAgarAjukaDatEra tArakamani cEsina Sata



రాగం: రీతిగౌళ
పల్లవి:
రాగ రత్న మాలికచే రంజిల్లునట హరిశత

అనుపల్లవి:
బాగసేవించి సకల భాగ్యమందు దామురారె

చరణం :
నైగమ షట్ శాస్త్రపురాణాగమార్థ సహితమట
యోగివరులు ఆనందము నొందే సన్మార్గమట
భాగవతోత్తములుకూడి పాడే కీర్తనములట
త్యాగరాజుకడతేర తారకమని చేసిన శత

nArAyaNahari


rAgam : yaman kaLyANi 
ArTisT : Smt.NityasrI mahadEvan
pallavi:
nArAyaNa hari nArAyaNa hari
nArAyaNa hari nArAyaNa hari

caraNam 1:
naSvaram aina dhanASvamulanu nE
viSvasiMca bhUjESvara hari hari nArAyana

caraNaM2:
kOTISula kani sATi lEni palku
bOTinosagi mummATiki vEDanu nArAyaNa

caraNaM3:
ASa piSAcAvESamu kalugu
dhanESula kAceDu dESamu nElanu (nArAyaNa)

caraNaM4:
nAlOnE nI cElO cikkiti
nI lObhamu viDuvavElO teliyadu (nArAyaNa)

caraNaM5:
bhUlOkamulO mElOrvaru vidhi
vrAlO nIdau jalO teliyadu (nArAyaNa)

caraNaM6:
dUreDu panulaku dUredaru kaDa
tEreDu  panulanu tErE manasuku (nArAyaNa)

caraNam7:
toli tA jEsIna phalamE kaladani
ilanencani martyula celimi yenduku (nArAyaNa)

caraNam8:
dUshaNa hara para dUshaNa jana gaNa
bhIshaNa suguNa vibhIshaNa sannuta (nArAyaNa)

caraNaM9:
nOreppuDu nI pErE palukani
vErE yevarunnArE rAghava (nArAyaNa)

caraNam10:
mitra kulESa carita rasika jana


రాగం : యమన్ కళ్యాణి


పల్లవి:
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నారాయణ హరి

చరణం 1:
నశ్వరమైన ధనాశ్వములను నే
విశ్వసించ భూజేశ్వర హరి హరి నారాయన

చరణం2:
కోటీశుల కని సాటి లేని పల్కు
బోటినొసగి ముమ్మాటికి వేడను నారాయణ

చరణం3:
ఆశ పిశాచావేశము కలుగు
ధనేశుల కాచెడు దేశము నేలను (నారాయణ)

చరణం4:
నాలోనే నీ చేలో చిక్కితి
నీ లోభము విడువవేలో తెలియదు (నారాయణ)

చరణం5:
భూలోకములో మేలోర్వరు విధి
వ్రాలో నీదౌ జలో తెలియదు (నారాయణ)

చరణం6:
దూరెడు పనులకు దూరెదరు కడ
తేరెడు పనులను తేరే మనసుకు (నారాయణ)

చరణం7:
తొలి తా జేసీన ఫలమే కలదని
ఇలనెంచని మర్త్యుల చెలిమి యెందుకు (నారాయణ)

చరణం8:
దూషణ హర పర దూషణ జన గణ
భీషణ సుగుణ విభీషణ సన్నుత (నారాయణ)

చరణం9:
నోరెప్పుడు నీ పేరే పలుకని
వేరే యెవరున్నారే రాఘవ (నారాయణ)

చరణం10:
మిత్ర కులేశ చరిత రసిక జన

Saturday, November 12, 2011

varanArada


rAgam: vijayaSrI
tALam: Adi
pallavi:
vara nArada nArAyaNa
smaraNAnaMdAnu Bavamukala

anupallavi :
SaradiMduni BApaGanAnaGa sAramugAnu brOvumika

caraNam :
sakala lOkamulaku sadguru vanucu sadA nEnataDanucu hariyu
prakaTaMbuga kIrti nosaMgenE BAvuka tyAgarAjanuta

రాగం: విజయశ్రీ
తాళం: ఆది
పల్లవి:
వర నారద నారాయణ
స్మరణానందాను భవముకల

అనుపల్లవి :
శరదిందునిభాపఘనానఘ సారముగాను బ్రోవుమిక

చరణం :
సకల లోకములకు సద్గురు వనుచు సదా నేనతడనుచు హరియు
ప్రకటంబుగ కీర్తి నొసంగెనే భావుక త్యాగరాజనుత

calamElarA


rAgam : mArgahindOLam
ArTisT: priyA sisters
pallavi:
calamElarA sAkEta rAma

anupallavi:
valaci Bakti mArgamutOnu ninnu
varNiMcucunna nApai

caraNaM :
eMdubOdu nEnEmi sEyudunu
eccOTa nE mora beTTudunu
daMDanalatO poddupOvalenA
tALagajAlarA tyAgarAja nuta

రాగం : మార్గహిందోళం
పల్లవి:
చలమేలరా సాకేత రామ

అనుపల్లవి:
వలచి భక్తి మార్గముతోను నిన్ను
వర్ణించుచున్న నాపై

చరణం :
ఎందుబోదు నేనేమి సేయుదును
ఎచ్చోట నే మొర బెట్టుదును
దండనలతో పొద్దుపోవలెనా
తాళగజాలరా త్యాగరాజ నుత

Friday, November 11, 2011

nenaruMcinAnu



rAgam : mALavi
tALam : Adi
ArTisT: priyA sisTers

pallavi:
nenaruMcinAnu anniTiki nidAsuDani nEnu nIdupai

anupallavi:
GanAGa jImUtASukha jaladhigaMBIra nIpAdamulapai

caraNaM:
kalilO mATalu nErcukoni kAMtalanu tanayula brOcuTaku
SilAtmuDai paluka nEranura SrI tyAgarAjApta nIyeDa


రాగం : మాళవి
తాళం : ఆది
ఆర్టిస్ట్: ప్రియా సిస్టెర్స్

పల్లవి:
నెనరుంచినాను అన్నిటికి నిదాసుడని నేను నీదుపై

అనుపల్లవి:
ఘనాఘ జీమూతాశుఖ జలధిగంభీర నీపాదములపై

చరణం:
కలిలో మాటలు నేర్చుకొని కాంతలను తనయుల బ్రోచుటకు
శిలాత్ముడై పలుక నేరనుర శ్రీ త్యాగరాజాప్త నీయెడ

bhuvini


rAgam : SrIranjani
tALam : dEshAdi
ArTisT: priyA sisTers

pallavi:
bhuvini dAsuDanE pErAsacE
bonkulADitinA budhamanOhara

anupallavi:
avivEka mAnavula gOri kOri
aDDudrOva trokkitinA brOvavE

caraNaM:
cAla saukhyamO kashTamO
nEnu jAlijEnditinA sarivArilO
pAlamuncinA nITamuncinA
pAdamulE gati tyAgarAjanuta


రాగం : శ్రీరంజని
తాళం : దేషాది
ఆర్టిస్ట్: ప్రియా సిస్టెర్స్

పల్లవి:
భువిని దాసుడనే పేరాసచే
బొంకులాడితినా బుధమనోహర

అనుపల్లవి:
అవివేక మానవుల గోరి కోరి
అడ్డుద్రోవ త్రొక్కితినా బ్రోవవే

చరణం:
చాల సౌఖ్యమో కష్టమో
నేను జాలిజేందితినా సరివారిలో
పాలముంచినా నీటముంచినా
పాదములే గతి త్యాగరాజనుత

dASarathI

 
rAgam: tODi
ArTisT : Smt. MS Subbalakshmi garu
pallavi:
dASarathI nI ruNamudIrpa nA
taramA parama pAvana nAma

anupallavi:
ASadIra dUradESamulanu pra
kASiMpajEsina rasika SirOmaNi

caraNaM
BaktilEni kavijAla varENyulu
BAvameruga lErani kalalOjani
Buktimukti kalgunani kIrtanamula
bOdhiMcina tyAgarAja karAcita


రాగం: తోడి

పల్లవి:
దాశరథీ నీ రుణముదీర్ప నా
తరమా పరమ పావన నామ

అనుపల్లవి:
ఆశదీర దూరదేశములను ప్ర
కాశింపజేసిన రసిక శిరోమణి

చరణం
భక్తిలేని కవిజాల వరేణ్యులు
భావమెరుగ లేరని కలలోజని
భుక్తిముక్తి కల్గునని కీర్తనముల
బోధించిన త్యాగరాజ కరాచిత

Monday, November 7, 2011

ennALLUrakE



rAgam : SubhapaMtuvarALi
pallavi:
ennALLUrakE yuMduvO jUtAmu
evvaraDigEvAru lEdA SrIrAma

caraNam:
konnALLu  sAkEtapuramEla lEdA
kOrika munulaku konasAgalEdA

caraNam :
sati mATala nAlakiMci
sadBaktakOTula saMrakshiMcaga lEdA

caraNam :
matimaMtula brOcE matamu  mAdanalEdA
satatamu SrI tyAgarAju nammagalEdA


రాగం : శుభపంతువరాళి
పల్లవి:
ఎన్నాళ్ళూరకే యుందువో జూతాము
ఎవ్వరడిగేవారు లేదా శ్రీరామ

చరణం:
కొన్నాళ్ళు సాకేతపురమేల లేదా
కోరిక మునులకు కొనసాగలేదా

చరణం :
సతి మాటల నాలకించి
సద్భక్తకోటుల సంరక్షించగ లేదా

చరణం :
మతిమంతుల బ్రోచే మతము  మాదనలేదా
సతతము శ్రీ త్యాగరాజు నమ్మగలేదా

kaligiyuntE



rAgam : kIravANi
pallavi:
kaligiyuMTEkadA kalgunu kAmita  PaladAyaka

anupallavi:
kalini iMgitame~rugaka ninnADukoMTi
calamucEyaka nAtalanu cakkanivrAta

caraNam :
BAgavatA grEsarulaku nArada
prahlAda parASara rAmadAsAdulu
bAguga SrIraGurAmuni padamula
BaktijEsinarIti tyagarAjunikipuDu 


రాగం : కీరవాణి 
పల్లవి:
కలిగియుంటేకదా కల్గును కామిత  ఫలదాయక

అనుపల్లవి:
కలిని ఇంగితమెఱుగక నిన్నాడుకొంటి
చలముచేయక నాతలను చక్కనివ్రాత

చరణం :
భాగవతా గ్రేసరులకు నారద
ప్రహ్లాద పరాశర రామదాసాదులు
బాగుగ శ్రీరఘురాముని పదముల 
భక్తిజేసినరీతి త్యగరాజునికిపుడు 

O ranga SAyi



 rAgam : kAmbhOji
ArTisT: Smt . MS Subbalakshmi garu

pallavi:
O ranga SAyi pilicitE
Oyanucu rA rAdA

anupallavi:
sAranga dharuDu jUci kailAsAdhipuDu kA lEdA ( O ranga )

caraNam :
bhUlOka vaikuMThamidi yani
nI lOna nIvEyuppongi
SrI lOluDai yuMTE mA
cinta tIrEdennaDO
mElOrva lEni janulalO nE
migula nogili divya rUpamunu
mutyAla sarula yuramunu kAna
vacciti tyAgarAja hRd-bhUshaNa ( O ranga)


రాగం : కాంభోజి
పల్లవి:
ఓ రంగ శాయి పిలిచితే 
ఓయనుచు రా రాదా

అనుపల్లవి:
సారంగ ధరుడు జూచి కైలాసాధిపుడు కా లేదా ( ఓ రంగ )

చరణం :
భూలోక వైకుంఠమిది యని 
నీ లోన నీవేయుప్పొంగి
శ్రీ లోలుడై యుంటే మా
చింత తీరేదెన్నడో
మేలోర్వ లేని జనులలో నే
మిగుల నొగిలి దివ్య రూపమును
ముత్యాల సరుల యురమును కాన
వచ్చితి త్యాగరాజ హృద్-భూషణ ( ఓ రంగ) 

mApAlavelasi



rAgam : asAvEri
ArTisT : Smt.rAjigOpAlakrishnan

pallavi :
mA pAlavelasi  ika  mammu brOvaga rAdA SrIrAmacandra

anupallavi :
nI pAdamula bhakti niMDAra gAniMci  
kApADu Sakti nI karamuna nuMDaga

caraNam1:

pApa saMhAra nA paritApamulanu tunuma nEpATirA
karuNa payOnidhivaina SrIpati vidhRta  cApa bANa I
pApamati narulApadalanu nEnE pani jUtunu
ApadbAndhava kApADa nIkI parAkEla mA

caraNam2:
dIna rakshaka bhaktAdIna sAkEta nagarISa nAmadi
padarina sujana mAnAbhimAna pAlana samAna rahita
rOsana nIdu dAsAnu dAsuDanu dAnavAntaka
mudAna nArada sugANa lOla darikAna santatamu 

caraNam 3:
nAgAdhipa vinuta nAgAri ratha ninu vinA gati ne~ruga
nAgarAja hRt-sAgarAbja bhava sAgarAntaka
surAgha hara  kanakAga dhIra sura nAga gamana
SaraNAgatApta SrI tyAgarAjanuta  mA

రాగం : అసావేరి 
పల్లవి :
మా పాలవెలసి  ఇక  మమ్ము బ్రోవగ రాదా శ్రీరామచంద్ర

అనుపల్లవి :
నీ పాదముల భక్తి నిండార గానించి   
కాపాడు శక్తి నీ కరమున నుండగ 

చరణం1:

పాప సంహార నా పరితాపములను తునుమ నేపాటిరా
కరుణ పయోనిధివైన శ్రీపతి విధృత  చాప బాణ ఈ
పాపమతి నరులాపదలను నేనే పని జూతును 
ఆపద్బాంధవ కాపాడ నీకీ పరాకేల మా

చరణం2:
దీన రక్షక భక్తాదీన సాకేత నగరీశ నామది
పదరిన సుజన మానాభిమాన పాలన సమాన రహిత
రోసన నీదు దాసాను దాసుడను దానవాంతక
ముదాన నారద సుగాణ లోల దరికాన సంతతము  

చరణం 3:
నాగాధిప వినుత నాగారి రథ నిను వినా గతి నెఱుగ
నాగరాజ హృత్-సాగరాబ్జ భవ సాగరాంతక
సురాఘ హర  కనకాగ ధీర సుర నాగ గమన
శరణాగతాప్త శ్రీ త్యాగరాజనుత  మా 

Saturday, November 5, 2011

dhanasuta


rAgam : kamalAmanOhari

pallavi:

dhana suta taruNi parijana saukhyamu dabbararA rAmA

anupallavi:

anayamu bettapu debbalabbaga ara nimiShamu gAka

caraNam1:
iccina dhanamulu vaccEdAka ciccuvEre lEdu

caraNam2:
muccu koDuku pancI yamTE taMDriki munigina
du:khamura

caraNam3:
kulasati parula jUcinO yani kOpamu galgunurA

caraNam4:
rAjasannuti sEyaka tyAgarAja nutuni delisi bratukaga



రాగం : కమలామనోహరి

పల్లవి:

ధన సుత తరుణి పరిజన సౌఖ్యము దబ్బరరా రామా

అనుపల్లవి:

అనయము బెత్తపు దెబ్బలబ్బగ అర నిమిషము గాక

చరణం1:
ఇచ్చిన ధనములు వచ్చేదాక చిచ్చువేరె లేదు

చరణం2:
ముచ్చు కొడుకు పంచీ యంటే తండ్రికి మునిగిన
దు:ఖముర

చరణం3:
కులసతి పరుల జూచినో యని కోపము గల్గునురా

చరణం4:
రాజసన్నుతి సేయక త్యాగరాజ నుతుని దెలిసి బ్రతుకగ





unDiyEmi


rAgam : yadukulakAmbhOji

pallavi:

unDi Emi urvi bhAramugA

anupallavi:

unDi Emi urvi bhAramugA
kOdanDapANini kanulaniMDa cUDani vAru

caraNam1:

manasuna nitya nUtanamaina
sogasunu mari mari ganalEka

caraNam2:
nenaruna tyAgarAjanutuni pogaDaka
kanarAnidi kanucu vinarAnidi vinucu


రాగం : యదుకులకాంభోజి

పల్లవి:

ఉండి ఏమి ఉర్వి భారముగా

అనుపల్లవి:

ఉండి ఏమి ఉర్వి భారముగా
కోదండపాణిని కనులనిండ చూడని వారు

చరణం1:

మనసున నిత్య నూతనమైన
సొగసును మరి మరి గనలేక

చరణం2:
నెనరున త్యాగరాజనుతుని పొగడక
కనరానిది కనుచు వినరానిది వినుచు

lAliyUgavayya


rAgam : kEdAragaula
ArTisT - guru nEdunUri kRshNamUrti

pallavi :
lAli yUgavayyA nApAli daivamA rAmA

anupallavi:
mAlimi gala sIta tOnu maMcamunanu pavvaLiMci

caraNam1:
SrI kOSala puranivAsa jIva dEva cidvilAsa |
pAkAri prakASa padmanABa darahAsa

caraNam2:
sura BAmalu prEmamIra sogasugAnu pADaga
suratanu suma varshamulu suraluku kuriya jEyaga

caraNam3:
pAlu venna paramAnnamu bAguga nIvAragiMci
bAluDaina tyAgarAju BAshanamula nAlakimci


రాగం : కేదారగౌల

పల్లవి :
లాలి యూగవయ్యా నాపాలి దైవమా రామా

అనుపల్లవి:
మాలిమి గల సీత తోను మంచమునను పవ్వళించి

చరణం1:
శ్రీ కోశల పురనివాస జీవ దేవ చిద్విలాస |
పాకారి ప్రకాశ పద్మనాభ దరహాస

చరణం2:
సుర భామలు ప్రేమమీర సొగసుగాను పాడగ
సురతను సుమ వర్షములు సురలుకు కురియ జేయగ 

చరణం3:
పాలు వెన్న పరమాన్నము బాగుగ నీవారగించి 
బాలుడైన త్యాగరాజు భాషనముల నాలకించి

harihariyanukOvE


 rAgam : pantuvarALi
ArTisT : guru nEdunUri krishNamUrti gAru    
pallavi:
hari hari yanukOvE nIhRdayArtulella tolagajEyu trOvE

caraNam1:
pantamulIdEru I jaga-maMta SrIhari yanucunu palumAru

caraNam2:
BEdamu tOcadurA sadguru pAdamaMdu buddhi kudura jEsukOrA

caraNam3:
rAjamArgamurA tyAga -rAju pUjimcE bratuku trOva

రాగం : పంతువరాళి
ఆర్టిస్ : గురు నేదునూరి క్రిష్ణమూర్తి గారు    
పల్లవి:
హరి హరి యనుకోవే నీహృదయార్తులెల్ల తొలగజేయు త్రోవే

చరణం 1:
పంతములీదేరు ఈ జగ-మంత శ్రీహరి యనుచును పలుమారు

చరణం 2:
భేదము తోచదురా సద్గురు పాదమందు బుద్ధి కుదుర జేసుకోరా

చరణం 3:
రాజమార్గమురా త్యాగ -రాజు పూజించే బ్రతుకు త్రోవ

Friday, November 4, 2011

nAdatanumaniSam


rAgam : cittaranjani
pallavi:
nAda tanumaniSam Sankaram
namAmi mE manasA SirasA

anupallavi:
mOdakara nigamOttama sAma
vEda sAram vAram vAram

caraNam:
sadyOjAtAdi panca vaktraja
sa-ri-ga-ma-pa-da-ni vara sapta svara
vidyA lOlam vidaLita kAlam
vimala hRdaya tyAgarAja pAlam



రాగం : చిత్తరంజని
పల్లవి:
నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా

అనుపల్లవి:
మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం

చరణం:
సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ద-ని వర సప్త స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం

imtakannAndamEmi



rAgam : biLahari
ArTisT : Sri BAlamuraLi kRshNa 
pallavi:
imta kanna nAnanda mEmi O rAma rAma

anupallavi:
santa janulakella sammatiyai yuMDu kAni

caraNam1:
ADucu nAdamuna pADucu eduTa rA
vEDucu manasuna kUDiyyuMDu cAlu

caraNam2:
SrIhari kIrtanacE dEhAdi indriya
samUhamula maraci sOham ainadE cAlu

caraNam3:
nI japamula vELanI jagamulu nIvai
rAjillunayya tyAgarAja nuta carita



రాగం : బిళహరి
పల్లవి:
ఇంత కన్న నానంద మేమి ఓ రామ రామ

అనుపల్లవి:
సంత జనులకెల్ల సమ్మతియై యుండు కాని

చరణం1:
ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా
వేడుచు మనసున కూడియ్యుండు చాలు

చరణం2:
శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ
సమూహముల మరచి సోహం ఐనదే చాలు

చరణం3:
నీ జపముల వేళ నీ జగములు నీవై
రాజిల్లునయ్య త్యాగరాజ నుత చరిత