Showing posts with label tyagarajakritis-m. Show all posts
Showing posts with label tyagarajakritis-m. Show all posts

Thursday, April 18, 2013

marugElarA
















rAgam : jayaMtaSrI
tALam : Adi
ArTisTs : Smt.Priya Sisters
pallavi:
marugElarA O rAGavA

anupallavi:
marugEla carAcara rUpa
parAtpara sUrya sudhAkara lOcanA

caraNam :
anni nIvanucu naMtaraMgamuna
tinnagA vedaki telusukoMTi nayya
ninne gAni madini enna jAla norula
nannu brOva vayya tyAgarAja nuta

రాగం : జయంతశ్రీ
తాళం : ఆది  

పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి:
మరుగేల చరాచర రూప 
పరాత్పర సూర్య సుధాకర లోచనా 

చరణం :
అన్ని నీవనుచు నంతరంగమున 
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య 
నిన్నె గాని మదిని ఎన్న జాల నొరుల 
నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ నుత  

Saturday, February 23, 2013

muMdu venaka


















rAgam : darbAru
tALam : Adi
ArTisT : Smt.Radha Jayalakshmi
pallavi :
muMdu venaka iru prakkala tODai
murahara vEga rArA rArA

caraNam :
eMdugAna nIyaMdamuvale raGu-
naMdana vEgamE rArA rArA
aMDa golucu saumiti sahituDai
amita parAkrama rArA rAma nA-

caraNam :
O jagadrakShaka O rAja kumArA
OmkAra sadana rArA rArA

caraNam :
BAgavata priya bAga brOvavayya
tyAgarAjanuta rArA rAma


రాగం : దర్బారు
తాళం : ఆది 

పల్లవి : 
ముందు వెనక ఇరు ప్రక్కల తోడై 
మురహర వేగ రారా రారా 

చరణం : 
ఎందుగాన నీయందమువలె రఘు-
నందన వేగమే రారా రారా 
అండ గొలుచు సౌమితి సహితుడై
అమిత పరాక్రమ రారా రామ నా- 

చరణం :
ఓ జగద్రక్షక ఓ రాజ కుమారా 
ఓంకార సదన రారా రారా

చరణం : 
భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య 
త్యాగరాజనుత రారా రామ 



mAmava satataM


















rAgam : jaganmOhini
tALaM : Adi
ArTisT : Smt.R.Vedavalli
pallavi:
mAmava satataM raGunAtha

caraNam :
SrImadinAnvaya sAgara caMdra
Srita jana SuBaPalada suguNasAMdra

caraNam :
Baktirahita SAstravirati dUra
paMkajadaLanayana nRpakumAra
Saktitanaya hRdayAlaya raGuvIra SAMtanirvikAra
yuktavacana kanakAcala dhIra
uragaSayana munijana parivAra
tyakta kAma mOha mada vikAra
tyAgarAja ripu jalada samIra


రాగం : జగన్మోహిని
తాళం : ఆది

పల్లవి:
మామవ సతతం రఘునాథ

చరణం :
శ్రీమదినాన్వయ సాగర చంద్ర
శ్రిత జన శుభఫలద సుగుణసాంద్ర

చరణం :
భక్తిరహిత శాస్త్రవిరతి దూర
పంకజదళనయన నృపకుమార
శక్తితనయ హృదయాలయ రఘువీర శాంతనిర్వికార
యుక్తవచన కనకాచల ధీర
ఉరగశయన మునిజన పరివార
త్యక్త కామ మోహ మద వికార
త్యాగరాజ రిపు జలద సమీర

Thursday, November 15, 2012

mAru balkakunnA


















rAgam : SrIraMjani
tALam :Adi
ArTisT : Sri.Sankaran Namboodri
pallavi:
mAru balkakunnA vEmirA mA manOramaNa

anupallavi:
jAracOra BajanacEsitinA sAkEta sadana

caraNam :
dUraBAramaMdu nA hRdayAraviMdamaMdu nelakonu
dAri nerigi saMtasillinaTTi tyAgarAjanuta

రాగం : శ్రీరంజని 
తాళం :ఆది 
పల్లవి:
మారు బల్కకున్నా వేమిరా మా మనోరమణ 

అనుపల్లవి:
జారచోర భజనచేసితినా సాకేత సదన 

చరణం :
దూరభారమందు నా హృదయారవిందమందు నెలకొను
దారి నెరిగి సంతసిల్లినట్టి త్యాగరాజనుత 


Saturday, October 13, 2012

muccaTa brahmAdulaku















rAgam : madhyamAvati
tALam :  Adi
ArTisT : Smt. R. Vedavalli

pallavi :
muccaTa brahmAdulaku dorakunA
muditalAra cUtAmurArE

anupallavi:
paccani dEhini parama pAvanini
pArvatini talacucunu haruDEgeDu

caraNam :
callare vElpula rIti virula kara|pallavamulanu taLukkanucu birudu
lella meraya nijaBaktulu pogaDada |ullamu raMjilla
tellani mEnuna niMDu sommulatO|mallehAramulu ma~ri SOBillaga
callanivELa sakala navaratnapu|pallakilO vEMcEsi vaccu

caraNam :
hitamaina sakalanai vEdyaMbulu sammatamuga aDugaDugu kAragiMpucu
mitamu lEni yupacAramulatO |sati saMtOshamuna satatamu
japatapamula nonariMcu|natajanula kaBIShTamu lavvAriga
vetaki yosagudu nanucu baMcanadI | pati veDali  sogasu mIranga vaccu

caraNam :
BAgavatulu harinAmakIrtanamu | bAguga susvaramulatO viMta
rAgamulanu yAlapanamucEyu vaiBOgamulanu cUci
nAgaBUShaNuDu karuNAnidhiyai|vEganu sakala sujana rakShaNamuna
jAgarUkuDai kOrkela nosagu |tyAgarAju tAnanucunu vaccu

రాగం : మధ్యమావతి
తాళం :  ఆది

పల్లవి :
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార చూతామురారే

అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు

చరణం :
చల్లరె వేల్పుల రీతి విరుల కర|పల్లవములను తళుక్కనుచు బిరుదు
లెల్ల మెరయ నిజభక్తులు పొగడద |ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో|మల్లెహారములు మఱి శోభిల్లగ
చల్లనివేళ సకల నవరత్నపు|పల్లకిలో వేంచేసి వచ్చు

చరణం :
హితమైన సకలనై వేద్యంబులు సమ్మతముగ అడుగడుగు కారగింపుచు
మితము లేని యుపచారములతో |సతి సంతోషమున సతతము
జపతపముల నొనరించు|నతజనుల కభీష్టము లవ్వారిగ
వెతకి యొసగుదు ననుచు బంచనదీ | పతి వెడలి  సొగసు మీరంగ వచ్చు

చరణం :
భాగవతులు హరినామకీర్తనము | బాగుగ సుస్వరములతో వింత
రాగములను యాలపనముచేయు వైభోగములను చూచి
నాగభూషణుడు కరుణానిధియై|వేగను సకల సుజన రక్షణమున
జాగరూకుడై కోర్కెల నొసగు |త్యాగరాజు తాననుచును వచ్చు




Sunday, September 2, 2012

ma~racEvADanA

















rAgam : kEdAram
tALam :Adi
ArTisT: Sri. Balamurali Krishna gAru

pallavi:

ma~racEvADanA rAma ninu madana janakA

anupallavi:

ma~rakatAnga nIyokka madinenca valadu

caraNam :

kAni mAnavulu karuNalEka nApai
lEni nEramu lencina gAni
SrI nijamuga nAcenta jErina gAni
rAni nI daya tyAgarAjanuta

రాగం :కేదారం

రాగం : కేదారం
తాళం :ఆది

పల్లవి:

మఱచేవాడనా రామ నిను మదన జనకా

అనుపల్లవి:

మఱకతాంగ నీయొక్క మదినెంచ వలదు

చరణం :

కాని మానవులు కరుణలేక నాపై
లేని నేరము లెంచిన గాని
శ్రీ నిజముగ నాచెంత జేరిన గాని
రాని నీ దయ త్యాగరాజనుత


Tuesday, May 22, 2012

mIvallaguNa















rAgam : kApi
ArTisT : Smt.MS.subbalakhsmi gAru

pallavi:
mI valla guNa dOshamEmi SrI rAma

anupallavi:
nAvallanE kAni naLina daLa nayana

caraNam1:
bangAru bAguga padivanne gAkumTE
angalArcucu battunADukOnEla

caraNam2:
tana tanaya prasava vEdanakOrva lEkumTE
anayayallunipai ahankAra paDanEla

caraNam3:
E janmamuna pAtramerigi dAnambika
pUjimcina maraci vElpulanADukOnEla

caraNam4:
nA manasu nA prEma nannalaya jEsina
rAjillu SrI tyAgarAja nuta caraNa


రాగం : కాపి

పల్లవి:
మీ వల్ల గుణ దోషమేమి శ్రీ రామ

అనుపల్లవి:
నావల్లనే కాని నళిన దళ నయన

చరణం1:
బంగారు బాగుగ పదివన్నె గాకుంటే
అంగలార్చుచు బత్తునాడుకోనేల

చరణం2:
తన తనయ ప్రసవ వేదనకోర్వ లేకుంటే
అనయయల్లునిపై అహంకార పడనేల

చరణం3:
ఏ జన్మమున పాత్రమెరిగి దానంబిక
పూజించిన మరచి వేల్పులనాడుకోనేల

చరణం4:
నా మనసు నా ప్రేమ నన్నలయ జేసిన
రాజిల్లు శ్రీ త్యాగరాజ నుత చరణ

mitri bhAgyamE














rAgam : kharahArapriya

ArTisT : SrI rAghavAchAri gAru & SEshAchAri gAru

pallavi:
mitri bhAgyamE bhAgyamu manasA saumitri

anupallavi:
citra ratnamaya SEsha talpamandu
sItA patini uniciyUcu saumitri

caraNam1:
bAguga vinta rAgamulanAlApamu
sEyaga mEnu pulakarincaga
tyAgarAja nutuDagu SrI rAmuni
tatvArthamunu pogaDi jUcu saumitri


రాగం : ఖరహారప్రియ

ఆర్టిస్ట్ : శ్రీ రాఘవాచారి గారు  & శేషాచారి గారు

పల్లవి:
మిత్రి భాగ్యమే భాగ్యము మనసా సౌమిత్రి

అనుపల్లవి:
చిత్ర రత్నమయ శేష తల్పమందు
సీతా పతిని ఉనిచియూచు సౌమిత్రి

చరణం1:
బాగుగ వింత రాగములనాలాపము
సేయగ మేను పులకరించగ
త్యాగరాజ నుతుడగు శ్రీ రాముని
తత్వార్థమును పొగడి జూచు సౌమిత్రి

Thursday, April 26, 2012

mElukOvayya















rAgam : bauLi
tALam : Jampa
ArTisT : Smt.Soumya

pallavi:
mElukOvayya mammElukO rAmA
mElaina sItA samEta nA bhAgyamA

caraNam 1:
nArAdAdulu ninnu gOri nI mahimala
vArigA bADucunnAripudu tella
vAragA vachinadi SrIrAma navanIta
kshIramulu bAguga nAragimpanu vEga

caraNam 2:
PaNiSayana yanimiSharamaNu lUDigamu sEya
aNakuvaga niMDAru praNuti jEsedaru
maNImayABaraNulau yaNimAduruliDudIpa
maNulu telupAyenu taraNivaMSavaratilaka

caraNam 3:
rAjarAjESvara BarAjamuKasAkEta rAja sadguNa tyAgarAjanuta caraNa
rAjanya vibudhagaNa rAjAdulella ninu
pUjiMpagAcinArI jagamu pAliMpa


రాగం : బౌళి
తాళం : ఝంప

పల్లవి:
మేలుకోవయ్య మమ్మేలుకో రామా
మేలైన సీతా సమేత నా భాగ్యమా

చరణం 1:
నారాదాదులు నిన్ను గోరి నీ మహిమల
వారిగా బాడుచున్నారిపుదు తెల్ల
వారగా వచినది శ్రీరామ నవనీత
క్షీరములు బాగుగ నారగింపను వేగ

చరణం 2:
ఫణిశయన యనిమిషరమణు లూడిగము సేయ
అణకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణీమయాభరణులౌ యణిమాదురులిడుదీప
మణులు తెలుపాయెను తరణివంశవరతిలక

చరణం 3:
రాజరాజేశ్వర భరాజముఖసాకేత రాజ సద్గుణ త్యాగరాజనుత చరణ
రాజన్య విబుధగణ రాజాదులెల్ల నిను
పూజింపగాచినారీ జగము పాలింప

Sunday, February 26, 2012

mAravairi














rAgam: nAsikabhUshaNi
ArTisT : Smt.Bombay jayaSri
pallavi:
mAra vairi ramaNi manju bhAshiNi

anupallavi:
krUra dAnavEbha vAraNAri gaurI mAra

caraNam:
kAma bandha vAraNa nishkAma citta varadE
dharma saMvardhini sadA vadana hAsE
tyAgarAja Subha phaladE mAra



రాగం: నాసికభూషణి
పల్లవి:
మార వైరి రమణి మంజు భాషిణి

అనుపల్లవి:
క్రూర దానవేభ వారణారి గౌరీ మార

చరణం:
కామ బంధ వారణ నిష్కామ చిత్త వరదే
ధర్మ సంవర్ధిని సదా వదన హాసే
త్యాగరాజ శుభ ఫలదే మార

Friday, February 24, 2012

manasu





















rAgam : SankarAbharaNam
tALam : rUpakam
ArTisT : Sri.bAlamuraLi kRshNa gAru

pallavi:
manasu svAdhInamaina yA Ganuniki
mari mantra tantramulEla

caraNam 1:
tanuvu tAnu gAdani yeMcuvAniki
tapasu cEyanEla daSaratha bAla

caraNam 2:
anni nIvanucu yeMcunavAniki  yASrama BEdamulEla
kannugaTTu mAyalani yemcuvAniki kAMtala BramalEla daSaratha bAla

caraNam 3:
Ajanmamu durvishaya rahituniki
gatAgata mika yEla
rAjarAjESa niraMjana nirupama
rAjasadana tyAgarAja vinuta


రాగం : శంకరాభరణం
తాళం : రూపకం

పల్లవి:
మనసు స్వాధీనమైన యా ఘనునికి
మరి మంత్ర తంత్రములేల

చరణం 1:
తనువు తాను గాదని యెంచువానికి
తపసు చేయనేల దశరథ బాల

చరణం 2:
అన్ని నీవనుచు యెంచునవానికి  యాశ్రమ భేదములేల
కన్నుగట్టు మాయలని యెంచువానికి కాంతల భ్రమలేల దశరథ బాల

చరణం 3:
ఆజన్మము దుర్విషయ రహితునికి
గతాగత మిక యేల
రాజరాజేశ నిరంజన నిరుపమ
రాజసదన త్యాగరాజ వినుత



Wednesday, November 16, 2011

manasA



rAgam: malayamArutaM
pallavi:
manasA eTulOrtunE nA manavini cEkonavE O

anupallavi:
dinakara kula BUshaNuni dInuDavai Bajana jEsi
dinamu gaDupumanina nIvu vinavadEla guNavihIna

caraNam:
kalilO rAjasa tAmasa guNamulu galavAri celimi
kalisi melisi ti~rugucu ma~ri kAlamu gaDapakanE
sulaBamugA gaDatEranu sUcanalanu deliyajEyu
ilanu tyAgarAju mATa vinavadEla guNavihIna


రాగం: మలయమారుతం
పల్లవి:
మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ

అనుపల్లవి:
దినకర కుల భూషణుని దీనుడవై భజన జేసి
దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవిహీన

చరణం:
కలిలో రాజస తామస గుణములు గలవారి చెలిమి
కలిసి మెలిసి తిఱుగుచు మఱి కాలము గడపకనే
సులభముగా గడతేరను సూచనలను దెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన

Monday, November 7, 2011

mApAlavelasi



rAgam : asAvEri
ArTisT : Smt.rAjigOpAlakrishnan

pallavi :
mA pAlavelasi  ika  mammu brOvaga rAdA SrIrAmacandra

anupallavi :
nI pAdamula bhakti niMDAra gAniMci  
kApADu Sakti nI karamuna nuMDaga

caraNam1:

pApa saMhAra nA paritApamulanu tunuma nEpATirA
karuNa payOnidhivaina SrIpati vidhRta  cApa bANa I
pApamati narulApadalanu nEnE pani jUtunu
ApadbAndhava kApADa nIkI parAkEla mA

caraNam2:
dIna rakshaka bhaktAdIna sAkEta nagarISa nAmadi
padarina sujana mAnAbhimAna pAlana samAna rahita
rOsana nIdu dAsAnu dAsuDanu dAnavAntaka
mudAna nArada sugANa lOla darikAna santatamu 

caraNam 3:
nAgAdhipa vinuta nAgAri ratha ninu vinA gati ne~ruga
nAgarAja hRt-sAgarAbja bhava sAgarAntaka
surAgha hara  kanakAga dhIra sura nAga gamana
SaraNAgatApta SrI tyAgarAjanuta  mA

రాగం : అసావేరి 
పల్లవి :
మా పాలవెలసి  ఇక  మమ్ము బ్రోవగ రాదా శ్రీరామచంద్ర

అనుపల్లవి :
నీ పాదముల భక్తి నిండార గానించి   
కాపాడు శక్తి నీ కరమున నుండగ 

చరణం1:

పాప సంహార నా పరితాపములను తునుమ నేపాటిరా
కరుణ పయోనిధివైన శ్రీపతి విధృత  చాప బాణ ఈ
పాపమతి నరులాపదలను నేనే పని జూతును 
ఆపద్బాంధవ కాపాడ నీకీ పరాకేల మా

చరణం2:
దీన రక్షక భక్తాదీన సాకేత నగరీశ నామది
పదరిన సుజన మానాభిమాన పాలన సమాన రహిత
రోసన నీదు దాసాను దాసుడను దానవాంతక
ముదాన నారద సుగాణ లోల దరికాన సంతతము  

చరణం 3:
నాగాధిప వినుత నాగారి రథ నిను వినా గతి నెఱుగ
నాగరాజ హృత్-సాగరాబ్జ భవ సాగరాంతక
సురాఘ హర  కనకాగ ధీర సుర నాగ గమన
శరణాగతాప్త శ్రీ త్యాగరాజనుత  మా