Monday, December 26, 2011

Baktuni cAritramu



















rAgam : bEgaDa
tALam : Adi
pallavi:
Baktuni cAritramu vinavE sItArAmA
anupallavi:
AsaktilEka tAgOrucu jIvanmuktuDai AnaMdamunoMdu
caraNam1:
japatapamulu tAjEsiti nanarAdu adigAka mari | kapaTAtmuDu manamai balkarAdu
upama tanaku lEka yuMDavalenani | Ura yUra tirugagarAdu
capalacittuDai Alu sutulapai | sAreku Brama kArAdanE hari ||
caraNam2:
BavaviBavamu nijamani yeMcagarAdu adigAka mari |
Siva mAdhava BEdamu jEyagarAdu |
BuvanamaMdu tAnE yOgyuDanani | bomki poTTasAkagarAdu
pavanAtmaja dhRtamau sItApati | pAdamulanu yEmararAdanu hari ||
caraNam3:
rAjasa tAmasa guNamulu gArAdu adigAkanu avyAjamunanu rAlEdanaga rAdu
rAjayOgamArgamu nI cittamu | rAjUcuTa viDuvagarAdu rAjaSiKAmaNiyaina
tyAgarAja saKuni maruvarAdanE hari ||


రాగం : బేగడ
తాళం : ఆది
పల్లవి:
భక్తుని చారిత్రము వినవే సీతారామా
అనుపల్లవి:
ఆసక్తిలేక తాగోరుచు జీవన్ముక్తుడై ఆనందమునొందు
చరణం1:
జపతపములు తాజేసితి ననరాదు అదిగాక మరి | కపటాత్ముడు మనమై బల్కరాదు
ఉపమ తనకు లేక యుండవలెనని | ఊర యూర తిరుగగరాదు
చపలచిత్తుడై ఆలు సుతులపై | సారెకు భ్రమ కారాదనే హరి ||
చరణం2:
భవవిభవము నిజమని యెంచగరాదు అదిగాక మరి |
శివ మాధవ భేదము జేయగరాదు |
భువనమందు తానే యోగ్యుడనని | బొంకి పొట్టసాకగరాదు
పవనాత్మజ ధృతమౌ సీతాపతి | పాదములను యేమరరాదను హరి ||
చరణం3:
రాజస తామస గుణములు గారాదు అదిగాకను అవ్యాజమునను రాలేదనగ రాదు
రాజయోగమార్గము నీ చిత్తము | రాజూచుట విడువగరాదు రాజశిఖామణియైన
త్యాగరాజ సఖుని మరువరాదనే హరి ||

No comments:

Post a Comment