caraNam:
hari harulaku dikpAlakula SaSi sUryulaku
mari vidyAdharulaku brahmAMDamuna velayu vara vIrAdulaku
taramu gAka ninnu jata gUDi SaraNanagA vini sairiMcaka
parama drOhiyaina SUra padmAsuruni kIrtigAnu garvamaNacina
caraNam:
mAra kOTulaMdu galgina SRMgAramella yiMdu muKa nI kona
gOrunu bOlunE yaTuvaMTi SuBAkAramu saMtatamu
sAreku nA madini nilipina kumAra dayA para nIraja lOcana
tArakAdhipa kaLA dharuDagu SrI tyAgarAja sannutASrita hita
అనుపల్లవి:
భావించి చూడ తరము గాని బ్రహ్మ పురి నిలయ గిరిజా తనయ
చరణం:
సరి బాలురతో కైలాస గిరిని శుభాకృతితో నాడగను
వెరపు లేక ప్రణవార్థము తానను విధిని కోపగించి
సరగున నవ వీరులందొక కింకరుణి గని ముమ్మారు సెలవిచ్చి
సురులు ముర పురారులు విని మెచ్చగ వరుసగాను సృష్టి శక్తి మొసగిన
చరణం:
హరి హరులకు దిక్పాలకుల శశి సూర్యులకు
మరి విద్యాధరులకు బ్రహ్మాండమున వెలయు వర వీరాదులకు
తరము గాక నిన్ను జత గూడి శరణనగా విని సైరించక
పరమ ద్రోహియైన శూర పద్మాసురుని కీర్తిగాను గర్వమణచిన
చరణం:
మార కోటులందు గల్గిన శృంగారమెల్ల యిందు ముఖ నీ కొన
గోరును బోలునే యటువంటి శుభాకారము సంతతము
సారెకు నా మదిని నిలిపిన కుమార దయా పర నీరజ లోచన
తారకాధిప కళా ధరుడగు శ్రీ త్యాగరాజ సన్నుతాశ్రిత హిత