Friday, February 24, 2012

UrakE




















rAgam : sahana
ArTisT : Sri. MahArAjapuram SantAnam
pallavi:
UrakE galgunA rAmuni bhakti

anupallavi:
sAreku samsAramuna jocci sAramani encuvAri manasuna

caraNam 1:
Alusutulu cuTTAlu  varasadanAlu gAya phalAlu kanaka
dhanAlugala vibhavAla gani asthirAlanE bhAgyaSAlulaku gala

caraNam 2:
maMcivArini poDagAMci saMtatamu sEviMci yA manavAlakiMci yAdari
sAdhiMci sarvamu hariyaMcu telisi bhAviMci madini pUjiMcuvAriki gAka

caraNam 3:
rAjasaguNa yuktapUjala nonariMcaka aja sannuta tyAgarAjuni jihvapai
rAjillu varamaMtra rAjamunanu sadA japiMcE mahArAjulaku gAka


రాగం : సహన
పల్లవి:
ఊరకే గల్గునా రాముని భక్తి

అనుపల్లవి:
సారెకు సంసారమున జొచ్చి సారమని ఎంచువారి మనసున

చరణం 1:
ఆలుసుతులు చుట్టాలు  వరసదనాలు గాయ ఫలాలు కనక
ధనాలుగల విభవాల గని అస్థిరాలనే భాగ్యశాలులకు గల

చరణం 2:
మంచివారిని పొడగాంచి సంతతము సేవించి యా మనవాలకించి యాదరి
సాధించి సర్వము హరియంచు తెలిసి భావించి మదిని పూజించువారికి గాక


చరణం 3:
రాజసగుణ యుక్తపూజల నొనరించక అజ సన్నుత త్యాగరాజుని జిహ్వపై
రాజిల్లు వరమంత్ర రాజమునను సదా జపించే మహారాజులకు గాక

No comments:

Post a Comment