Tuesday, February 7, 2012

kAlaharaNamEla



rAgam: SuddhasAvEri  
tALam : rUpaka tALam 
ArTisT : Smt. Priya Sisters 

pallavi: 
kAlaharaNamElarA harE sItA rAma

anupallavi:

kAlaharaNa mEla suguNajAla karuNAlavAla

charaNam:
cuTTi cuTTi pakShulella ceTTu vedaku rIti Buvini 
puTTagAnE nI padamula baTTukonna nannu brOva

caraNam:
poDavuna eMtADukonna BUmini tyAgaMbu rIti 
kaDu vElpula minna nIvu gAka yevaru nannu brOva 

caraNam:
dina dinamunu tirigi tirigi dikku lEka SaraNu jocci 
tanuvu dhanamu nIde yaMTi tyAgarAja vinuta rAma

caraNam: 
iShTadaivamA manOBIShTa mIyalEka imta 
kaShTamA tyAgarAju kAmitArthaPala mosaMga



రాగం: శుద్ధసావేరి  
తాళం : రూపక తాళం 
పల్లవి: 
కాలహరణమేలరా హరే సీతా రామ

అనుపల్లవి:

కాలహరణ మేల సుగుణజాల కరుణాలవాల

చరణం:
చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని 
పుట్టగానే నీ పదముల బట్టుకొన్న నన్ను బ్రోవ

చరణం:
పొడవున ఎంతాడుకొన్న భూమిని త్యాగంబు రీతి 
కడు వేల్పుల మిన్న నీవు గాక యెవరు నన్ను బ్రోవ 

చరణం:
దిన దినమును తిరిగి తిరిగి దిక్కు లేక శరణు జొచ్చి 
తనువు ధనము నీదె యంటి త్యాగరాజ వినుత రామ

చరణం: 
ఇష్టదైవమా మనోభీష్ట మీయలేక ఇంత 
కష్టమా త్యాగరాజు కామితార్థఫల మొసంగ 


No comments:

Post a Comment