rAgam : nIlAmbari
tALam: Adi
ArTisT: Sri.Hyderabad brothers
pallavi:
ennaga manasuku rAni pannaga SAyi nI sogasu
pannuga ganugonani kannu lElE kanTi minna lElE
anupallavi:
mOhamutO nIla vAri vAha kAntini gErina
SrIharini gaTTukonani dEha mElE ee dEha mElE
caraNam:
sarasija malle tulasI virujAji pArijAtapu
virulacE pUjincina karamu lElE ee kApuramu lElE
caraNam :
mAlimitO tyAgarAju nElina rAmamUrtini
lAlinchi pogaDani nAlikElE nalikElE sUtra mAlikEle
రాగం : నీలాంబరి
తాళం : ఆది
పల్లవి:
ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి నీ సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే కంటి మిన్న లేలే
మోహముతో నీల వారి వాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహ మేలే ఈ దేహ మేలే
చరణం:
సరసిజ మల్లె తులసీ విరుజాజి పారిజాతపు
విరులచే పూజించిన కరము లేలే ఈ కాపురము లేలే
చరణం :
మాలిమితో త్యాగరాజు నేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే నలికేలే సూత్ర మాలికేలె