rAgam : dESikatODi
tALam : Adi
pallavi:
rAju veDale cUtAmu rAre kastUri raMga
anupallavi:
tEjinekki sAmaMta rAju lUDigamu sEya
tEjarillu navaratnapu divyaBUShaNamuliDi raMga
caraNam :
kAvEri tIramunanu pAvanamagu raMgapurini
SrIvelayu citravidhi lOvEDkagarAga
sEvanugani suralu virulacE prEmanu pUjiMcaga
BAviMci tyAgarAju pADaga vaiBOgaraMga
రాగం : దేశికతోడి
తాళం : ఆది
పల్లవి:
రాజు వెడలె చూతాము రారె కస్తూరి రంగ
అనుపల్లవి:
తేజినెక్కి సామంత రాజు లూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్యభూషణములిడి రంగ
చరణం :
కావేరి తీరమునను పావనమగు రంగపురిని
శ్రీవెలయు చిత్రవిధి లోవేడ్కగరాగ
సేవనుగని సురలు విరులచే ప్రేమను పూజించగ
భావించి త్యాగరాజు పాడగ వైభోగరంగ
No comments:
Post a Comment