rAgam : AraBi
tALam : Adi
ArTisT : Sri.Malladi Brothers
pallavi:
O rAjIvAkSha OrajUpulujUcE vEra nEnIku vEra
anupallavi :
nEraninApai nEramuleMcitE
kArAdanibalkEvAru lEninannu
caraNam :
makkuvatOninnu mrokkinajanulaku
dikku nIvai atigrakkuna brOtuvani
ekkuvajanulayokka mATaluvini
cakkani SrIrAmadakkitigadarA
caraNam :
mitimIralEni prakRtilOnadagilinE
matihInuDai sannutisEyanIraka
batimAli nIvEgatiyani nera
nammitigAni ninu maracitinAsaMtatamu
caraNam :
mAvara suguNa umAvarasannuta
dEvara dayacEsi brOvagarAdA
pAvanaBaktajanAvana mahAnu
BAva tyAgarAjaBAvita iMkanannu
రాగం : ఆరభి
తాళం : ఆది
పల్లవి:
ఓ రాజీవాక్ష ఓరజూపులుజూచే వేర నేనీకు వేర
అనుపల్లవి :
నేరనినాపై నేరములెంచితే
కారాదనిబల్కేవారు లేనినన్ను
చరణం :
మక్కువతోనిన్ను మ్రొక్కినజనులకు
దిక్కు నీవై అతిగ్రక్కున బ్రోతువని
ఎక్కువజనులయొక్క మాటలువిని
చక్కని శ్రీరామదక్కితిగదరా
చరణం :
మితిమీరలేని ప్రకృతిలోనదగిలినే
మతిహీనుడై సన్నుతిసేయనీరక
బతిమాలి నీవేగతియని నెర
నమ్మితిగాని నిను మరచితినాసంతతము
చరణం :
మావర సుగుణ ఉమావరసన్నుత
దేవర దయచేసి బ్రోవగరాదా
పావనభక్తజనావన మహాను
భావ త్యాగరాజభావిత ఇంకనన్ను
No comments:
Post a Comment