Saturday, November 17, 2012

koluvamare gadA


















rAgam : tODi
tALam : Adi
ArTisT : Sri.Malladi brothers
pallavi:
koluvamare gadA kOdaMDapANi

anupallavi :
naluvaku palukula celiyaku rukmiNiki
lalitaku sItaku lakShmaNuni karudaina

caraNam :
vEkuvajAmuna velayucu taMbura
cEkoni guNamula celuvoMda bADucu
SrIkaruni kASrita ciMtAmaNuniki
Akali dIra pAlAragiMpanu cEsE

caraNam :
vinavayya saripodduvELa nAthuniki
canuvuna pannITa snAnamu kAviMci
Ganuniki  divyaBOjanamunu beTTi
kammani viDe mosagucu maravaka sEviMcE

caraNam :
BAgavatulu bAguga Gananaya
rAgamulacE dIpArAdhana monariMci
vEgame SrIhari virulapai bavaLiMci
jOkoTTi tyAgarAja sumuKuni lEpE


రాగం : తోడి
తాళం : ఆది

పల్లవి:
కొలువమరె గదా కోదండపాణి

అనుపల్లవి :
నలువకు పలుకుల చెలియకు రుక్మిణికి
లలితకు సీతకు లక్ష్మణుని కరుదైన

చరణం :
వేకువజామున వెలయుచు తంబుర
చేకొని గుణముల చెలువొంద బాడుచు
శ్రీకరుని కాశ్రిత చింతామణునికి
ఆకలి దీర పాలారగింపను చేసే

చరణం :
వినవయ్య సరిపొద్దువేళ నాథునికి
చనువున పన్నీట స్నానము కావించి
ఘనునికి  దివ్యభోజనమును బెట్టి
కమ్మని విడె మొసగుచు మరవక సేవించే

చరణం :
భాగవతులు బాగుగ ఘననయ
రాగములచే దీపారాధన మొనరించి
వేగమె శ్రీహరి విరులపై బవళించి
జోకొట్టి త్యాగరాజ సుముఖుని లేపే


No comments:

Post a Comment