Saturday, November 17, 2012

ISa pAhimAM























rAgam : kaLyANi
tALam : Adi

pallavi:
ISa pAhimAM jagadI

anupallavi :
ASaragaNa madaharaNa bilESayaBUSha saptaRShI

caraNam :
SrInAtha karArcita dorakEnAlpula kIdarSana
mEnATi tapaHPalamO nAmamu dorake  
SrI nAradagAnapriya dInArtinivAraNa para
mAnaMdArNava dEva yanApajanaka saptaRShI

caraNam :
vyAsArcita pAlita nijadAsa BUlOka
kailAsaMbanu palkulu nijamE sAreku gaMTi
nIsATi yevvarayyA nI sAkShAtkAramuna
vEsaTa lella dolagu nEDE janmamu sAPalyamu

caraNam :
sAmAdi nigama saMcAra sOmAgni taraNilOcana
kAmAdi KaMDana  sutrAmArcita pAda
hEmAcalacApa ninu vinA marevaru munimanO
dhAma tyAgarAja prEmAvatAra jagadI

రాగం : కళ్యాణి
తాళం : ఆది

పల్లవి:
ఈశ పాహిమాం జగదీ

అనుపల్లవి :
ఆశరగణ మదహరణ బిలేశయభూష సప్తఋషీ

చరణం :
శ్రీనాథ కరార్చిత దొరకేనాల్పుల కీదర్శన
మేనాటి తపహ్ఫలమో నామము దొరకె  
శ్రీ నారదగానప్రియ దీనార్తినివారణ పర
మానందార్ణవ దేవ యనాపజనక సప్తఋషీ

చరణం :
వ్యాసార్చిత పాలిత నిజదాస భూలోక
కైలాసంబను పల్కులు నిజమే సారెకు గంటి
నీసాటి యెవ్వరయ్యా నీ సాక్షాత్కారమున
వేసట లెల్ల దొలగు నేడే జన్మము సాఫల్యము

చరణం :
సామాది నిగమ సంచార సోమాగ్ని తరణిలోచన
కామాది ఖండన  సుత్రామార్చిత పాద
హేమాచలచాప నిను వినా మరెవరు మునిమనో
ధామ త్యాగరాజ ప్రేమావతార జగదీ



No comments:

Post a Comment