rAgam: SankarAbharaNaM/navarOju
tALam : Adi
ArTisT : Smt.Sowmya
pallavi:
nA pAli SrIrAma BUpAlaka stOma
kApADu samayamu nI pAdamulIra
caraNam1:
Bali Bali Baktula pUjaPalamu nIvanukoMTi
naLinalOcana nIku nalugu beTTErA
caraNam2:
kOTi manmadhulaina sATigA nI sogasu
nATi yunnadi madini mETi SrIrAma
caraNam3:
toli pUja PalamEmo kalige nI padasEva
naluvakainanu ninnu deliyaga taramA
caraNam4:
patita pAvana nIvu pAliMcakuMTEnu
gati mAkevaru mammugrakkuna brOvu
caraNam5:
kOri nI padasEva sAreku sEyanu dalaci
mAramaNa nAlOnE marulu konnAnu
caraNam6:
nirupEdakabbina nidhirIti dorikitivi
vara tyAgarAjuniki varada mrokkEra
రాగం: శంకరాభరణం/నవరోజు
తాళం : ఆది
పల్లవి:
నా పాలి శ్రీరామ భూపాలక స్తోమ
కాపాడు సమయము నీ పాదములీర
చరణం1:
భలి భలి భక్తుల పూజఫలము నీవనుకొంటి
నళినలోచన నీకు నలుగు బెట్టేరా
చరణం2:
కోటి మన్మధులైన సాటిగా నీ సొగసు
నాటి యున్నది మదిని మేటి శ్రీరామ
చరణం3:
తొలి పూజ ఫలమేమొ కలిగె నీ పదసేవ
నలువకైనను నిన్ను దెలియగ తరమా
చరణం4:
పతిత పావన నీవు పాలించకుంటేను
గతి మాకెవరు మమ్ముగ్రక్కున బ్రోవు
చరణం5:
కోరి నీ పదసేవ సారెకు సేయను దలచి
మారమణ నాలోనే మరులు కొన్నాను
చరణం6:
నిరుపేదకబ్బిన నిధిరీతి దొరికితివి
వర త్యాగరాజునికి వరద మ్రొక్కేర
No comments:
Post a Comment