rAgam:varALi
pallavi:
karuNa ElAgaMTE nI vidhamE kaLyANa suMdararAma
anupallavi :
paramAtmuDu jIvAtmuDu yokaDai
paragucuMDu Bakta parAdhInuni
caraNam :
anRtaM bADaDu alpula vEDaDu
sunRpula goluvaDu sUryuni maruvaDu
caraNam :
mAMsamu muTTaDu madhuvunu trAgaDu
parahiMsala jEyaDu yerukanu maravaDu
caraNam :
vaMcana sEyaDu varulatO boMkaDu
caMcala cituDai sauKyamu viDuvaDu
caraNam:
sAkShiyani delasi yaMdu lakshyamu viDuvaDu
kaMjAkshuni tyAgarAja rakshakuDainavAni
రాగం:వరాళి
పల్లవి:
కరుణ ఏలాగంటే నీ విధమే కళ్యాణ సుందరరామ
అనుపల్లవి :
పరమాత్ముడు జీవాత్ముడు యొకడై
పరగుచుండు భక్త పరాధీనుని
చరణం :
అనృతం బాడడు అల్పుల వేడడు
సునృపుల గొలువడు సూర్యుని మరువడు
చరణం :
మాంసము ముట్టడు మధువును త్రాగడు
పరహింసల జేయడు యెరుకను మరవడు
చరణం :
వంచన సేయడు వరులతో బొంకడు
చంచల చితుడై సౌఖ్యము విడువడు
చరణం:
సాక్షియని దెలసి యందు లక్ష్యము విడువడు
కంజాక్షుని త్యాగరాజ రక్షకుడైనవాని
మంచి కీర్తన.
ReplyDeleteఆడియో క్వాలిటికూడా బాగుంది.