Wednesday, November 16, 2011

manasA



rAgam: malayamArutaM
pallavi:
manasA eTulOrtunE nA manavini cEkonavE O

anupallavi:
dinakara kula BUshaNuni dInuDavai Bajana jEsi
dinamu gaDupumanina nIvu vinavadEla guNavihIna

caraNam:
kalilO rAjasa tAmasa guNamulu galavAri celimi
kalisi melisi ti~rugucu ma~ri kAlamu gaDapakanE
sulaBamugA gaDatEranu sUcanalanu deliyajEyu
ilanu tyAgarAju mATa vinavadEla guNavihIna


రాగం: మలయమారుతం
పల్లవి:
మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే ఓ

అనుపల్లవి:
దినకర కుల భూషణుని దీనుడవై భజన జేసి
దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవిహీన

చరణం:
కలిలో రాజస తామస గుణములు గలవారి చెలిమి
కలిసి మెలిసి తిఱుగుచు మఱి కాలము గడపకనే
సులభముగా గడతేరను సూచనలను దెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన

No comments:

Post a Comment