Saturday, March 2, 2013

darini telusukoMTi























rAgam : SuddhasAvEri
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi :
darini telusukoMTi tripurasuMdari ninnE SaraNaMTi

anupallavi :
marunijanakuDaina mAdaSaratha kumAruni sOdari dayApari mOkSha

caraNam :
aMbatrijagadISvarI muKajita vidhu
biMba yAdipuramuna nelakonna kana
kAmbari namminavArini kaBIShTa varaMbulosagu dInarakShaki
aMbujaBava puruhUta sanaMdana tuMburu nAradAdulaMdaru nIdu pa
daMbunukOri sadAnityAnaMdaM budhilO nOlalADucuMDE

caraNam :
mahadaiSvaryamosagi toli karma gahanamunu goTTi brOcu talli
guhagaja muKajanani yaruNapaMkE ruhanayana yOgi hRtsadana
tuhinAcala tanaya nI cakkani mahimAtiSayammula cEtanu yI
mahimalO munigaNamulu prakRti virahitulai nityAnaMdulaina

caraNam :
rAjitamaNigaNa  BUShaNi madagaja  rAjagamana lOkaSaMkari danuja
rAjaguruni vAsarasEva tanakE janmaPalamO kanugoMTini
A janmamu peddalu sadAmadilO nI japamE muktimArgamanukona
rAja SEKaruDagu SrI tyAgarAja manOhari gauri parAtpari


రాగం : శుద్ధసావేరి
తాళం : ఆది

పల్లవి :
దరిని తెలుసుకొంటి త్రిపురసుందరి నిన్నే శరణంటి

అనుపల్లవి :
మరునిజనకుడైన మాదశరథ కుమారుని సోదరి దయాపరి మోక్ష

చరణం :
అంబత్రిజగదీశ్వరీ ముఖజిత విధు
బింబ యాదిపురమున నెలకొన్న కన
కాంబరి నమ్మినవారిని కభీష్ట వరంబులొసగు దీనరక్షకి
అంబుజభవ పురుహూత సనందన తుంబురు నారదాదులందరు నీదు ప
దంబునుకోరి సదానిత్యానందం బుధిలో నోలలాడుచుండే

చరణం :
మహదైశ్వర్యమొసగి తొలి కర్మ గహనమును గొట్టి బ్రోచు తల్లి
గుహగజ ముఖజనని యరుణపంకే రుహనయన యోగి హృత్సదన
తుహినాచల తనయ నీ చక్కని మహిమాతిశయమ్ముల చేతను యీ
మహిమలో మునిగణములు ప్రకృతి విరహితులై నిత్యానందులైన

చరణం :
రాజితమణిగణ  భూషణి మదగజ  రాజగమన లోకశంకరి దనుజ
రాజగురుని వాసరసేవ తనకే జన్మఫలమో కనుగొంటిని
ఆ జన్మము పెద్దలు సదామదిలో నీ జపమే ముక్తిమార్గమనుకొన
రాజ శేఖరుడగు శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి పరాత్పరి




Monday, February 25, 2013

cEsinadella
















rAgam : tODi
tALam :  Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi :
cEsinadella maracitivO  O rAmarAma

anupallavi:
AsakonnaTTi nannala yiMcuTaku munnu

caraNam :
Alu  nIkaina BakturAlO yanucu nADu
prAlumAlaka ravibAluni celimiyu

caraNam :
BASha tappakanu viBIShaNuni korakAdi
tammuDagu tammuni pOShiMcamani rAju

caraNam :
rAma SrI tyAgarAja prEmAvatAra sItA
BAma mATalu telpu BImAMjanEyu brahma


రాగం : తోడి
తాళం :  ఆది
పల్లవి :
చేసినదెల్ల మరచితివో  ఓ రామరామ

అనుపల్లవి:
ఆసకొన్నట్టి నన్నల యించుటకు మున్ను

చరణం :
ఆలు  నీకైన భక్తురాలో యనుచు నాడు
ప్రాలుమాలక రవిబాలుని చెలిమియు

చరణం :
భాష తప్పకను విభీషణుని కొరకాది
తమ్ముడగు తమ్ముని పోషించమని రాజు

చరణం :
రామ శ్రీ త్యాగరాజ ప్రేమావతార సీతా
భామ మాటలు తెల్పు భీమాంజనేయు బ్రహ్మ

Sunday, February 24, 2013

koluvaiyunnADE


















rAgam : dEvagAMdhAri
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
koluvaiyunnADE kOdaMDapANi

anupallavi :
salalitamatulai sAreku SIlulai
valacucu kOri vacci sEviMpaga

caraNam :
janakaja BaratAdulatO maMci naivEdyaMbula
canuvuna vEDuka nAragiMci merapukOTlagEru
kanaka paTamu sommulanu dhariMci vEdOktamulaina
sanaka vacanamulacE tOShiMci Sritula pOShiMci

caraNam :
varavagu vAsanalu parimaLiMpa sannidhilO velugucu
suravArasatulu bAga naTiMpa adigAka parA
SaranArada munulella nutiMpa eMteMtO nenaruna
surapati vAgISulu sEviMpa mEnu pulakariMpa

caraNam :
uDurAjamuKuDu SEShaSayyapaini celaMgaga gani
puDami kumAri suguMdhamu pUya namminavAralakE
kaDagaMTini kOrina varamIya  tyAgarAju nenaruga
aDugaDuguku maDupula naMdIya SrIrAmayya


రాగం : దేవగాంధారి
తాళం : ఆది

పల్లవి:
కొలువైయున్నాడే కోదండపాణి

అనుపల్లవి :
సలలితమతులై సారెకు శీలులై
వలచుచు కోరి వచ్చి సేవింపగ

చరణం :
జనకజ భరతాదులతో మంచి నైవేద్యంబుల
చనువున వేడుక నారగించి మెరపుకోట్లగేరు
కనక పటము సొమ్ములను ధరించి వేదోక్తములైన
సనక వచనములచే తోషించి శ్రితుల పోషించి

చరణం :
వరవగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు
సురవారసతులు బాగ నటింప అదిగాక పరా
శరనారద మునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున
సురపతి వాగీశులు సేవింప మేను పులకరింప

చరణం :
ఉడురాజముఖుడు శేషశయ్యపైని చెలంగగ గని
పుడమి కుమారి సుగుంధము పూయ నమ్మినవారలకే
కడగంటిని కోరిన వరమీయ  త్యాగరాజు నెనరుగ
అడుగడుగుకు మడుపుల నందీయ శ్రీరామయ్య

eMta rAnI


















rAgam : harikAMBOji
tALam : dEshAdi
ArTisT : Smt.Priya Sisters

pallavi:
eMta rAnI tanakeMta pOnI nI
ciMta viDuvajAla SrI rAma

anupallavi:
aMtakAri nIceMtajEri hanumaMtuDai koluvalEda

caraNam :
SEShuDu Sivuniki BUShuDu lakShmaNavEShiyai velayalEdA

caraNam :
SiShTuDu maunivariShTuDu goppa vasiShTuDu hituDu  gAlEdA

caraNam :
naravara  nIkai suragaNamunu vAnarulai koluvalEdA

caraNam :
AgamAttamagu nI guNamulu SrI tyAgarAja bADagalEdA


రాగం : హరికాంభోజి 
తాళం : దేషాది 

పల్లవి:
ఎంత రానీ తనకెంత పోనీ నీ 
చింత విడువజాల శ్రీ రామ 

అనుపల్లవి:
అంతకారి నీచెంతజేరి హనుమంతుడై కొలువలేద

చరణం : 
శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషియై వెలయలేదా 

చరణం :
శిష్టుడు మౌనివరిష్టుడు గొప్ప వసిష్టుడు హితుడు  గాలేదా 

చరణం :
నరవర  నీకై సురగణమును వానరులై కొలువలేదా 

చరణం :
ఆగమాత్తమగు నీ గుణములు శ్రీ త్యాగరాజ బాడగలేదా  

E nATi nOmu














rAgam : Bairavi
tALam : Adi
ArTisT :Smt.MS.Subbalakshmi
pallavi:
E nATi nOmu Palamo E dAnabalamo

anupallavi :
SrInAtha brahmakainanu nIdu sEva dorakunA tanaku galuguTa

caraNam :
nEnu kOrina kOrke lellanu nEDu tanaku neravErenu
BAnuvaMSatilaka nA pAli BAgyamA sajjana yOgyamA tana

caraNam :
nIdu dApu nIdu prApu dorikenu
nijamugA nE nI sommaitini
AdidEva prANanAtha nA
daMkamaMdu nuMci pUjiMpa

caraNam :
suMdarESa suguNa bRMda daSaratha
naMdanAraviMdanayana pAvana
aMdagADa  tyAgarAjanuta suKa
manuBaviMpa dorike gAna danakika


రాగం : భైరవి
తాళం : ఆది
పల్లవి:
ఏ నాటి నోము ఫలమొ ఏ దానబలమొ

అనుపల్లవి :
శ్రీనాథ బ్రహ్మకైనను నీదు సేవ దొరకునా తనకు గలుగుట

చరణం :
నేను కోరిన కోర్కె లెల్లను నేడు తనకు నెరవేరెను
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా తన

చరణం :
నీదు దాపు నీదు ప్రాపు దొరికెను
నిజముగా నే నీ సొమ్మైతిని
ఆదిదేవ ప్రాణనాథ నా
దంకమందు నుంచి పూజింప

చరణం :
సుందరేశ సుగుణ బృంద దశరథ
నందనారవిందనయన పావన
అందగాడ  త్యాగరాజనుత సుఖ
మనుభవింప దొరికె గాన దనకిక

sogasu jUDa



















rAgam : kannaDagauLa
tALam : rUpakam
ArTisT : Smt.Bombay Jayasri
pallavi:
sogasu jUDa taramA nI

anupallavi :
niganigamanucu kapOla  yugamucE me~rayu mOmu

caraNam :
amarArcita padayugamO aBayapradakara yugamO
kamanIya tanuniMdita  kAma kAmaripunuta nI

caraNam :
varabiMba samAdharamO vakuLa sumaMbula yuramO
karadhRta Sara kOdaMDa marakatAMga varamaina

caraNam :
ci~runavvO muMgurulO ma~ri kannula tETO
vara tyAgarAjArcita vaMdanIya iTuvaMTi


రాగం : కన్నడగౌళ
తాళం : రూపకం
పల్లవి:
సొగసు జూడ తరమా నీ

అనుపల్లవి :
నిగనిగమనుచు కపోల  యుగముచే మెఱయు మోము

చరణం :
అమరార్చిత పదయుగమో అభయప్రదకర యుగమో
కమనీయ తనునిందిత  కామ కామరిపునుత నీ

చరణం :
వరబింబ సమాధరమో వకుళ సుమంబుల యురమో
కరధృత శర కోదండ మరకతాంగ వరమైన

చరణం :
చిఱునవ్వో ముంగురులో మఱి కన్నుల తేటో
వర త్యాగరాజార్చిత వందనీయ ఇటువంటి


rArA mA



















rAgam : asAvEri
tALam : dEshAdi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
rArA mA iMTidAkAraGu vIrA
sukumArA mrokkErA

anupallavi :
rArA daSarathakumArA nannElu
kOrA tALalErA

caraNam :
kOrina kOrkelu konasAgakayE
nIrajanayana nIdArini gani vE
sAritigAni sAdhujanAvana sAriveDali sAminEDaina

caraNam :
proddunalEci  puNyamutOTi buddhulu ceppi brOtuvugAni
muddugAnu nImOmumunu jUcucu vadda nilici vAramu pUjiMcEnu

caraNam :
dikkunIvanucu delasinannubrOva grakkunarAvu karuNanu nIcE
jikkiyunna della maraturA ika SrI tyAgarAjuni BAgyamA


రాగం : అసావేరి
తాళం : దేషాది

పల్లవి:
రారా మా ఇంటిదాకారఘు వీరా
సుకుమారా మ్రొక్కేరా

అనుపల్లవి :
రారా దశరథకుమారా నన్నేలు
కోరా తాళలేరా

చరణం :
కోరిన కోర్కెలు కొనసాగకయే
నీరజనయన నీదారిని గని వే
సారితిగాని సాధుజనావన సారివెడలి సామినేడైన

చరణం :
ప్రొద్దునలేచి  పుణ్యముతోటి బుద్ధులు చెప్పి బ్రోతువుగాని
ముద్దుగాను నీమోముమును జూచుచు వద్ద నిలిచి వారము పూజించేను

చరణం :
దిక్కునీవనుచు దెలసినన్నుబ్రోవ గ్రక్కునరావు కరుణను నీచే
జిక్కియున్న దెల్ల మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా