Saturday, October 13, 2012

muccaTa brahmAdulaku















rAgam : madhyamAvati
tALam :  Adi
ArTisT : Smt. R. Vedavalli

pallavi :
muccaTa brahmAdulaku dorakunA
muditalAra cUtAmurArE

anupallavi:
paccani dEhini parama pAvanini
pArvatini talacucunu haruDEgeDu

caraNam :
callare vElpula rIti virula kara|pallavamulanu taLukkanucu birudu
lella meraya nijaBaktulu pogaDada |ullamu raMjilla
tellani mEnuna niMDu sommulatO|mallehAramulu ma~ri SOBillaga
callanivELa sakala navaratnapu|pallakilO vEMcEsi vaccu

caraNam :
hitamaina sakalanai vEdyaMbulu sammatamuga aDugaDugu kAragiMpucu
mitamu lEni yupacAramulatO |sati saMtOshamuna satatamu
japatapamula nonariMcu|natajanula kaBIShTamu lavvAriga
vetaki yosagudu nanucu baMcanadI | pati veDali  sogasu mIranga vaccu

caraNam :
BAgavatulu harinAmakIrtanamu | bAguga susvaramulatO viMta
rAgamulanu yAlapanamucEyu vaiBOgamulanu cUci
nAgaBUShaNuDu karuNAnidhiyai|vEganu sakala sujana rakShaNamuna
jAgarUkuDai kOrkela nosagu |tyAgarAju tAnanucunu vaccu

రాగం : మధ్యమావతి
తాళం :  ఆది

పల్లవి :
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార చూతామురారే

అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు

చరణం :
చల్లరె వేల్పుల రీతి విరుల కర|పల్లవములను తళుక్కనుచు బిరుదు
లెల్ల మెరయ నిజభక్తులు పొగడద |ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో|మల్లెహారములు మఱి శోభిల్లగ
చల్లనివేళ సకల నవరత్నపు|పల్లకిలో వేంచేసి వచ్చు

చరణం :
హితమైన సకలనై వేద్యంబులు సమ్మతముగ అడుగడుగు కారగింపుచు
మితము లేని యుపచారములతో |సతి సంతోషమున సతతము
జపతపముల నొనరించు|నతజనుల కభీష్టము లవ్వారిగ
వెతకి యొసగుదు ననుచు బంచనదీ | పతి వెడలి  సొగసు మీరంగ వచ్చు

చరణం :
భాగవతులు హరినామకీర్తనము | బాగుగ సుస్వరములతో వింత
రాగములను యాలపనముచేయు వైభోగములను చూచి
నాగభూషణుడు కరుణానిధియై|వేగను సకల సుజన రక్షణమున
జాగరూకుడై కోర్కెల నొసగు |త్యాగరాజు తాననుచును వచ్చు




Friday, September 28, 2012

vinavE O manasA















rAgam : vivardhini
tALam : rUpakam
ArTisT : Sri.Dr K Jayaraman

pallavi:
vinavE O manasA vivaraMbuga nEdelpeda

anupallavi:
manaseraMga kumArgamuna mari poralucu ceDavalade

caraNam:
yInaDatalu panikirAdu ISvara kRpakalugabOdu
dhyAna Bajana sEyave vara tyAgarAja manavi

రాగం : వివర్ధిని
తాళం : రూపకం 

పల్లవి:
వినవే ఓ మనసా వివరంబుగ నేదెల్పెద

అనుపల్లవి:
మనసెరంగ కుమార్గమున మరి పొరలుచు చెడవలదె

చరణం:
యీనడతలు పనికిరాదు ఈశ్వర కృపకలుగబోదు
ధ్యాన భజన సేయవె వర త్యాగరాజ మనవి 

Sunday, September 2, 2012

ma~racEvADanA

















rAgam : kEdAram
tALam :Adi
ArTisT: Sri. Balamurali Krishna gAru

pallavi:

ma~racEvADanA rAma ninu madana janakA

anupallavi:

ma~rakatAnga nIyokka madinenca valadu

caraNam :

kAni mAnavulu karuNalEka nApai
lEni nEramu lencina gAni
SrI nijamuga nAcenta jErina gAni
rAni nI daya tyAgarAjanuta

రాగం :కేదారం

రాగం : కేదారం
తాళం :ఆది

పల్లవి:

మఱచేవాడనా రామ నిను మదన జనకా

అనుపల్లవి:

మఱకతాంగ నీయొక్క మదినెంచ వలదు

చరణం :

కాని మానవులు కరుణలేక నాపై
లేని నేరము లెంచిన గాని
శ్రీ నిజముగ నాచెంత జేరిన గాని
రాని నీ దయ త్యాగరాజనుత


Monday, July 30, 2012

nI dayacE rAma


















rAgam : yadukulakAmbhOji
tAlam : Adi
pallavi:
nI dayacE rAma nityAnanduDaiti

anupallavi:
nAda brahmAnanda rasAkRti gala

caraNam:
varamRdu bhAsha susvaramaya bhUsha
vara tyAgarAja vAgcElAvRta


రాగం : యదుకులకాంభోజి
పల్లవి:
నీ దయచే రామ నిత్యానందుడైతి

అనుపల్లవి:
నాద బ్రహ్మానంద రసాకృతి గల

చరణం:
వరమృదు భాష సుస్వరమయ భూష
వర త్యాగరాజ వాగ్చేలావృత



paramAtmuDu


rAgam : vAgadhISvari
ArTisT : Sri. Balamurali krishna garu

pallavi:
paramAtmuDu veligE muccaTa
bAga telusukOrE

anupallavi:
hariyaTa haruDaTa surulaTa narulaTa
akhilAMDa kOTulaTayandarilO

caraNam :
gaganAnila tEjO jala bhUmayamagu
mRga khaga naga taru kOTulalO
saguNamulO viguNamulO satatamu
sAdhu tyAgarAjAdiyASritulilalO



రాగం : వాగధీశ్వరి

పల్లవి:
పరమాత్ముడు వెలిగే ముచ్చట
బాగ తెలుసుకోరే

అనుపల్లవి:
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో

చరణం :
గగనానిల తేజో జల భూమయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులిలలో

Sunday, July 29, 2012

daya jUcuTakidi


















rAgam : gAnavAridhi
ArTisT : Sri. SR. Janakiraman

pallavi:
daya jUcuTakidi vELara dASarathI

anupallavi:
bhavavAraNa mRgESa  jalajOdbhavArti
hara manjuLAkAra nanu

caraNam:
munu nIvAnaticcina
panulAsa koni nE
manasAraga nidAnamuga
salpinAnu vara tyAgarAjApta nanu

రాగం : గానవారిధి

పల్లవి:
దయ జూచుటకిది వేళర దాశరథీ

అనుపల్లవి:
భవవారణ మృగేశ  జలజోద్భవార్తి
హర మంజుళాకార నను

చరణం:
మును నీవానతిచ్చిన
పనులాస కొని నే
మనసారగ నిదానముగ
సల్పినాను వర త్యాగరాజాప్త నను

Tuesday, July 10, 2012

rAma pAhi mEGaSyAma


















rAgam : kApi
tAlam : cApu
ArTisT: Sri.Balamurali krishna gAru & Smt.P.Suseela gAru
pallavi:
rAma pAhi mEGaSyAmapAhi guNadhAma mAMpAhi O rAma

caraNam:
mUDu lOkamulalO IDulEdani ninnu vEDukomTini nEnu O rAma

caraNam:
lOkula neranmmukOka nE nIkE lOkuvanE naitini O rAma

caraNam:
E vEla nApAli dEvAdi dEvDu nIvE yanukoMtini O rAma

caraNam:
anni kallalani ninnE nijamanukonnavADanaitini O rAma

caraNam:
talacinaMtanE mEnu pulakariMcaga nIpai valaci nIvADanaitini O rAma

caraNam :
durjana gaNamula varNiMcuTaku  nAma garjanE gati yaMtini O rAma

caraNam:
manasuna nityanUtanamaina cakkani tanamunu kanugoMtini O rAma

caraNam:
avani sutAdhava Bavamuna evvarikevaru lEdanukoMTini O rAma

caraNam:
maMci kRtyamulu nIkaMcu icciti nApaMca BUtasAkShigA O rAma

caraNam:
vanajanayana nA vacanamulella satyamanucu yAlakiMcumI O rAma

caraNam:
ikanaina SaMkarasaKa brahmAnaMdasuKasAgara brOvumi O rAma

caraNam:
AjAnubAhu sarOjAnana tyAgarAja sannuta carita O rAma




రాగం : కాపి
తాళం : చాపు
పల్లవి:
రామ పాహి మేఘశ్యామపాహి గుణధామ మాంపాహి ఓ రామ

చరణం:
మూడు లోకములలో ఈడులేదని నిన్ను వేడుకొంటిని నేను ఓ రామ

చరణం:
లోకుల నెరన్మ్ముకోక నే నీకే లోకువనే నైతిని ఓ రామ

చరణం:
ఏ వేల నాపాలి దేవాది దేవ్డు నీవే యనుకొంతిని ఓ రామ

చరణం:
అన్ని కల్లలని నిన్నే నిజమనుకొన్నవాడనైతిని ఓ రామ

చరణం:
తలచినంతనే మేను పులకరించగ నీపై వలచి నీవాడనైతిని ఓ రామ

చరణం :
దుర్జన గణముల వర్ణించుటకు  నామ గర్జనే గతి యంతిని ఓ రామ

చరణం:
మనసున నిత్యనూతనమైన చక్కని తనమును కనుగొంతిని ఓ రామ

చరణం:
అవని సుతాధవ భవమున ఎవ్వరికెవరు లేదనుకొంటిని ఓ రామ

చరణం:
మంచి కృత్యములు నీకంచు ఇచ్చితి నాపంచ భూతసాక్షిగా ఓ రామ

చరణం:
వనజనయన నా వచనములెల్ల సత్యమనుచు యాలకించుమీ ఓ రామ

చరణం:
ఇకనైన శంకరసఖ బ్రహ్మానందసుఖసాగర బ్రోవుమి ఓ రామ

చరణం:
ఆజానుబాహు సరోజానన త్యాగరాజ సన్నుత చరిత ఓ రామ