rAgam : mOhanam
tALam : cApu
ArTisT : SrI.Balamurali kRshNa gAru
pallavi:
vEdavAkyamani enciri I veladulella sammatimciri
caraNam :
cIralanniyu vadalinciri entO siggu cEta nandu nuMciri
caraNam2:
aMduna niluvagapOyenu mEnu laMdariki taDavanAyenu
caraNam 3:
kanugoMdurOyani saraguna pAliMDlakaramula mUya marugunA
caraNam 4:
mAnamulanu musukondurO tama prANamulanu gAcu kondurO
caraNam 5:
celula nOreMDanAyenu nIru cilucilumani ekkuvAyenu
caraNam 6:
valuvalu gAnakapOyenu satula vadanamu laTu srukkanAyenu
caraNam 7:
karigi karigi angalArciri celulu kamalAKSu nuramuna jErciri
caraNam 8:
kanula kATuka nIrukAraga jUci kAntuDentO muddu kAraga
caraNam 9:
ramaNula madamella jarigenu tyAgarAja nutuni madi karagenu
రాగం : మోహనం
తాళం : చాపు
పల్లవి:
వేదవాక్యమని ఎంచిరి ఈ వెలదులెల్ల సమ్మతించిరి
చరణం :
చీరలన్నియు వదలించిరి ఎంతో సిగ్గు చేత నందు నుంచిరి
చరణం2:
అందున నిలువగపోయెను మేను లందరికి తడవనాయెను
చరణం 3:
కనుగొందురోయని సరగున పాలిండ్లకరముల మూయ మరుగునా
చరణం 4:
మానములను ముసుకొందురో తమ ప్రాణములను గాచు కొందురో
చరణం 5:
చెలుల నోరెండనాయెను నీరు చిలుచిలుమని ఎక్కువాయెను
చరణం 6:
వలువలు గానకపోయెను సతుల వదనము లటు స్రుక్కనాయెను
చరణం 7:
కరిగి కరిగి అంగలార్చిరి చెలులు కమలాఖ్శు నురమున జేర్చిరి
చరణం 8:
కనుల కాటుక నీరుకారగ జూచి కాంతుడెంతో ముద్దు కారగ
చరణం 9:
రమణుల మదమెల్ల జరిగెను త్యాగరాజ నుతుని మది కరగెను
No comments:
Post a Comment