rAgam: bilahari
tALam : tripuTa
ArTisT : Sri Krishnan
pallavi:
narasiMha nannu brOvavE SrIlakSHmI (narasiMha)
anupallavi:
kora mAlina narula koni yADanu nEnu
parama pAvana nApAli SrIlakSHmI (narasiMha)
caraNam:
nIdu bhaktAgrEsaruDu prahlAduDapuDoka kanaka kaSipu
vAdulOrvaka ninnu SaraNaniyAdukOmana gAcinAvu (narasiMha)
caraNam2:
endukani sairiMtu nI manasandu teliyanidEdi lOkula
niMdakOrvaka ninnugOrinaMdu keMtani karuNa jUtuvO (narasiMha)
caraNam3:
nI japamu nI smaraNa nI padapUja nI vAri celimi yosaga
rAjigAdayasEyu tyAgarAja sannuta taramugAdu (narasiMha)
రాగం: బిలహరి
తాళం : త్రిపుట
పల్లవి:
నరసింహ నన్ను బ్రోవవే శ్రీలక్ష్మీ (నరసింహ)
అనుపల్లవి:
కొర మాలిన నరుల కొని యాడను నేను
పరమ పావన నాపాలి శ్రీలక్ష్మీ (నరసింహ)
చరణం:
నీదు భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడపుడొక కనక కశిపు
వాదులోర్వక నిన్ను శరణనియాదుకోమన గాచినావు (నరసింహ)
చరణం2:
ఎందుకని సైరింతు నీ మనసందు తెలియనిదేది లోకుల
నిందకోర్వక నిన్నుగోరినందు కెంతని కరుణ జూతువో (నరసింహ)
చరణం3:
నీ జపము నీ స్మరణ నీ పదపూజ నీ వారి చెలిమి యొసగ
రాజిగాదయసేయు త్యాగరాజ సన్నుత తరముగాదు (నరసింహ)
No comments:
Post a Comment