Sunday, June 17, 2012

aTla palukuduvu














rAgam: aTHANa
ArTisT: Smt Mambalam sisters
pallavi:
aTla palukuduvu iTla palukuduvu
anduEmi sEtu rAmA nIvaTla

anupallavi:
toTlanarbhakula nUtuvu mari tOcinaTlu gilluduvu SrI rAma nIvaTla

caraNam:
jIvula Sikshimcaga nErtuvu ciranjIvuluga jEya
nErtuvurA bhAvamerigi  brOtuvu sadbhakta
bhAgadhEya SrI tyAgarAja vinuta (aTla)

రాగం: అఠాణ 

పల్లవి:
అట్ల పలుకుదువు ఇట్ల పలుకుదువు  
అందుఏమి సేతు రామా నీవట్ల 

అనుపల్లవి:
తొట్లనర్భకుల నూతువు మరి తోచినట్లు గిల్లుదువు శ్రీ రామ నీవట్ల 

చరణం:  
జీవుల శిక్షించగ నేర్తువు చిరంజీవులుగ జేయ 
నేర్తువురా భావమెరిగి  బ్రోతువు సద్భక్త   
భాగధేయ శ్రీ త్యాగరాజ వినుత (అట్ల) 

Sunday, June 10, 2012

dInajanAvana



















rAgam : BUpAlam
tALam : cApu
pallavi:
dInajanAvana SrIrAma dAnavaharaNa SrIrAma

anupallavi:
vInavimAna SrIrAma mInaSarIra SrIrAma

caraNam:
nirmalahRdaya SrIrAma kArmukabANa SrIrAma

caraNam :
SarmaPalaprada SrIrAma kUrmAvatAra SrIrAma

caraNam:
SrIkarasuguNa SrIrAma SrIkaralAlita SrIrAma

caraNam :
SrIkaruNArNava SrIrAma sUkararUpa SrIrAma

caraNam:
sarasijanayana SrIrAma surapativinuta SrIrAma

caraNam:
naravaravESha SrIrAma naraharirUpa SrIrAma

caraNam:
kAmitaPalada SrIrAma pAmaradUra SrIrAma

caraNam:
sAmajavarada SrIrAma vAmanarUpa SrIrAma

caraNam:
aGa timirAditya SrIrAma vigaLitamOha SrIrAma

caraNam:
raGukulatilaka SrIrAma  BRgusutarUpa SrIrAma

caraNam:
kuSalavajanaka SrIrAma kuSaladacatura SrIrAma

caraNam :
daSamuKamardhana SrIrAma daSarathanaMdana SrIrAma

caraNam:
kalimalaharaNa SrIrAma jalajaBavArcita SrIrAma

caraNam:
salalitavacana SrIrAma haladhararUpa SrIrAma

caraNam:
siddhajanapriya SrIrAma prasiddhacaritra SrIrAma


రాగం : భూపాలం
తాళం : చాపు
పల్లవి:
దీనజనావన శ్రీరామ దానవహరణ శ్రీరామ

అనుపల్లవి:
వీనవిమాన శ్రీరామ మీనశరీర శ్రీరామ

చరణం:
నిర్మలహృదయ శ్రీరామ కార్ముకబాణ శ్రీరామ

చరణం :
శర్మఫలప్రద శ్రీరామ కూర్మావతార శ్రీరామ

చరణం:
శ్రీకరసుగుణ శ్రీరామ శ్రీకరలాలిత శ్రీరామ

చరణం :
శ్రీకరుణార్ణవ శ్రీరామ సూకరరూప శ్రీరామ

చరణం:
సరసిజనయన శ్రీరామ సురపతివినుత శ్రీరామ

చరణం:
నరవరవేష శ్రీరామ నరహరిరూప శ్రీరామ

చరణం:
కామితఫలద శ్రీరామ పామరదూర శ్రీరామ

చరణం:
సామజవరద శ్రీరామ వామనరూప శ్రీరామ

చరణం:
అఘ తిమిరాదిత్య శ్రీరామ విగళితమోహ శ్రీరామ

చరణం:
రఘుకులతిలక శ్రీరామ  భృగుసుతరూప శ్రీరామ

చరణం:
కుశలవజనక శ్రీరామ కుశలదచతుర శ్రీరామ

చరణం :
దశముఖమర్ధన శ్రీరామ దశరథనందన శ్రీరామ

చరణం:
కలిమలహరణ శ్రీరామ జలజభవార్చిత శ్రీరామ

చరణం:
సలలితవచన శ్రీరామ హలధరరూప శ్రీరామ

చరణం:
సిద్ధజనప్రియ శ్రీరామ ప్రసిద్ధచరిత్ర శ్రీరామ

SrI nArasiMha



















rAgam: Phalaranjani
tALam : Adi
ArTisT : Sri.Balamurali kRshNa
pallavi:
SrI nArasiMha mAm pAhi
kshIrAbdhi kanyaka ramaNa

anupallavi:
dInArti nivAraNa bhavya guNa
diti tanaya timira sUrya trinEtra (SrI)

caraNam:
prahlAda parASara nArada
hRtpankEruha nIraja bandhO
AhlAda kara aSubha rOga
saMhAra varada tyAgarAjAdi vinuta (SrI)

రాగం: ఫలరంజని
తాళం : ఆది

పల్లవి:
శ్రీ నారసింహ మాం పాహి
క్షీరాబ్ధి కన్యక రమణ

అనుపల్లవి:
దీనార్తి నివారణ భవ్య గుణ
దితి తనయ తిమిర సూర్య త్రినేత్ర (శ్రీ)

చరణం:
ప్రహ్లాద పరాశర నారద
హృత్పంకేరుహ నీరజ బంధో
ఆహ్లాద కర అశుభ రోగ
సంహార వరద త్యాగరాజాది వినుత (శ్రీ)

Saturday, June 9, 2012

vaddanEvAru




















rAgam : shaNmuKhapriya
tALam : Adi
ArTisT: SrI Balamurali kRshNa gAru
pallavi:
vaddanEvAru lEru

anupallavi:
addaMpu mOmunu jUDanE nanaya maMgalArcitE jUci

caraNam :
kOrika lilalO divilO koMcamaina lEni nAmanasu
dAri teliyu daivamu nIvu sumI
tyAgarAja hRdBUShaNa ninu vinA

రాగం : షణ్ముఖప్రియ
తాళం : ఆది

పల్లవి:
వద్దనేవారు లేరు

అనుపల్లవి:
అద్దంపు మోమును జూడనే ననయ మంగలార్చితే జూచి

చరణం :
కోరిక లిలలో దివిలో కొంచమైన లేని నామనసు
దారి తెలియు దైవము నీవు సుమీ
త్యాగరాజ హృద్భూషణ నిను వినా

varadarAja



















rAgam : svaraBUShaNi
tALam : rUpakam
ArTisT : Smt.Vijayalakshmi subramaNyam


pallavi:
varadarAja ninnugOri vacciti mrokkErA  

anupallavi:
suralu munulu BUsurulu cuTTi cuTTi sEviMcE

caraNam :
varagiri vaikuMThamaTa varNiMpa daramu gAdaTa
nirjarulanu tArakamulalO caMdruDai merayuduvaTa
vara tyAgarAjanuta garuDasEva jUDa

రాగం : స్వరభూషణి  
తాళం : రూపకం 

పల్లవి:
వరదరాజ నిన్నుగోరి వచ్చితి మ్రొక్కేరా    

అనుపల్లవి:
సురలు మునులు భూసురులు చుట్టి చుట్టి సేవించే 

చరణం :
వరగిరి వైకుంఠమట వర్ణింప దరము గాదట 
నిర్జరులను తారకములలో చంద్రుడై మెరయుదువట 
వర త్యాగరాజనుత గరుడసేవ జూడ 

varanArada















rAgam : vijayaSrI
tALam : Adi
ArTisT :Smt Ranjani & Gayatri

pallavi:
varanArada nArAyaNa smaraNAnaMdAnuBavamukala

anupallavi:
SaradiMduniBApaGanAnaGa sAramugAnu brOvumika

caraNam :
sakala lOkamulaku sadguru vanucu sadA nEnataDanucu hariyu
prakaTaMbuga kIrtinosaMgenE BAvuka tyAgarAjanuta


రాగం : విజయశ్రీ
తాళం : ఆది

పల్లవి:
వరనారద నారాయణ స్మరణానందానుభవముకల

అనుపల్లవి:
శరదిందునిభాపఘనానఘ సారముగాను బ్రోవుమిక

చరణం :
సకల లోకములకు సద్గురు వనుచు సదా నేనతడనుచు హరియు
ప్రకటంబుగ కీర్తినొసంగెనే భావుక త్యాగరాజనుత

narasiMha


















rAgam: bilahari
tALam : tripuTa
ArTisT : Sri Krishnan
pallavi:
narasiMha nannu brOvavE SrIlakSHmI  (narasiMha)

anupallavi:
kora mAlina narula koni yADanu nEnu
parama pAvana nApAli SrIlakSHmI (narasiMha)

caraNam:
nIdu bhaktAgrEsaruDu prahlAduDapuDoka kanaka kaSipu
vAdulOrvaka ninnu SaraNaniyAdukOmana gAcinAvu (narasiMha)

caraNam2:
endukani sairiMtu nI manasandu teliyanidEdi  lOkula
niMdakOrvaka ninnugOrinaMdu keMtani karuNa jUtuvO (narasiMha)

caraNam3:
nI japamu nI smaraNa nI padapUja nI vAri celimi yosaga
rAjigAdayasEyu  tyAgarAja sannuta taramugAdu (narasiMha)

రాగం: బిలహరి 
తాళం : త్రిపుట 

పల్లవి:
నరసింహ నన్ను బ్రోవవే శ్రీలక్ష్మీ  (నరసింహ)
అనుపల్లవి:
కొర మాలిన నరుల కొని యాడను నేను
పరమ పావన నాపాలి శ్రీలక్ష్మీ (నరసింహ)
చరణం:
నీదు భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడపుడొక కనక కశిపు
వాదులోర్వక నిన్ను శరణనియాదుకోమన గాచినావు (నరసింహ)

చరణం2:
ఎందుకని సైరింతు నీ మనసందు తెలియనిదేది  లోకుల 
నిందకోర్వక నిన్నుగోరినందు కెంతని కరుణ జూతువో (నరసింహ)

చరణం3:
నీ జపము నీ స్మరణ నీ పదపూజ నీ వారి చెలిమి యొసగ 
రాజిగాదయసేయు  త్యాగరాజ సన్నుత తరముగాదు (నరసింహ)

Friday, June 8, 2012

dayalEni












rAgam :nAyaki
tALam :JaMpe
pallavi:
dayalEni bratukEmi dASarathI rAma

anupallavi:
vayasu nUraina  vasudha nElinagAni

caraNam :
rAjAdhirAja ratilAvaNya pUja japamulavELa poMduga neduTa
rAjilli lOkAMtaraMga marmamu delipi
rAjisEyani tyAgarAjAdi vinuta
Kriti by Guru Sri.Semmangudi srinivasa Iyer

Kriti by Sri Ambikapuram Sivaraman



రాగం :నాయకి
తాళం :ఝంపె
పల్లవి:
దయలేని బ్రతుకేమి దాశరథీ రామ

అనుపల్లవి:
వయసు నూరైన  వసుధ నేలినగాని

చరణం :
రాజాధిరాజ రతిలావణ్య పూజ జపములవేళ పొందుగ నెదుట
రాజిల్లి లోకాంతరంగ మర్మము దెలిపి
రాజిసేయని త్యాగరాజాది వినుత


toli janmamuna



















rAgam :bilahari
tALam :JaMpe
ArTisT : Smt.DK.PaTTammAL
pallavi:
toli janmamuna sEyu duDuku telisenu rAma

anupallavi:
nI mahimaPalamEmO aracEti puMTi kaddamuvale

caraNam :
rAgipairula ceMta ramyamauvari molaka rAjilla nErcunaTarA
nAgaSayana tyAgarAju pApamutOnu  nAmapuNyamu celagunA nEnu


రాగం :బిలహరి 
తాళం :ఝంపె 

పల్లవి:
తొలి జన్మమున సేయు దుడుకు తెలిసెను రామ

అనుపల్లవి:
నీ మహిమఫలమేమో అరచేతి పుంటి కద్దమువలె 

చరణం :
రాగిపైరుల చెంత రమ్యమౌవరి మొలక రాజిల్ల నేర్చునటరా 
నాగశయన త్యాగరాజు పాపముతోను  నామపుణ్యము చెలగునా నేను 

pAhimAM


















rAgam : saurAShTram
tALam : rUpakam
ArTisT: Sri.Balamurali kRshNa garu &Smt.Suseela garu
pallavi:
pAhimAM harE mahAnuBAva rAGava

caraNam:
pAhimAM yanucu rEyipagalu vEDiti
pAhirAma nIvanu saMpadanu valaciti

caraNam :
pAhi rAma yanucu bAripArikOriti
pAhirAma nAmamutO PalamulEriti

caraNam :
pAhirAma yanucu Buvini bAgabuTTiti
pAhirAma yanucu gaTTi paTTu paTTiti

caraNam :
pAhirAma yanucu nIdu padamu nammiti
pAhirAma yanucu manasu bAgugrammiti

caraNam:
pAhirAma yanucu nIdu padamu bADiti
pAhirAma yanucu paramapadamu vEDiti

caraNam :
pAhirAma yanucu dhyAnaparuDanaitini
pAhi tyAgarAjavinuta BaktuDaitini


రాగం : సౌరాష్ట్రం
తాళం : రూపకం

పల్లవి:
పాహిమాం హరే మహానుభావ రాఘవ

చరణం:
పాహిమాం యనుచు రేయిపగలు వేడితి
పాహిరామ నీవను సంపదను వలచితి

చరణం :
పాహి రామ యనుచు బారిపారికోరితి
పాహిరామ నామముతో ఫలములేరితి

చరణం :
పాహిరామ యనుచు భువిని బాగబుట్టితి
పాహిరామ యనుచు గట్టి పట్టు పట్టితి

చరణం :
పాహిరామ యనుచు నీదు పదము నమ్మితి
పాహిరామ యనుచు మనసు బాగుగ్రమ్మితి

చరణం:
పాహిరామ యనుచు నీదు పదము బాడితి
పాహిరామ యనుచు పరమపదము వేడితి

చరణం :
పాహిరామ యనుచు ధ్యానపరుడనైతిని
పాహి త్యాగరాజవినుత భక్తుడైతిని





vEdavAkyamani



















rAgam : mOhanam
tALam : cApu
ArTisT : SrI.Balamurali kRshNa gAru
pallavi:
vEdavAkyamani enciri I veladulella sammatimciri

caraNam :
cIralanniyu vadalinciri entO siggu cEta nandu nuMciri

caraNam2:
aMduna niluvagapOyenu mEnu laMdariki taDavanAyenu

caraNam 3:
kanugoMdurOyani saraguna pAliMDlakaramula mUya marugunA

caraNam 4:
mAnamulanu musukondurO tama prANamulanu gAcu kondurO

caraNam 5:
celula nOreMDanAyenu nIru cilucilumani ekkuvAyenu

caraNam 6:
valuvalu gAnakapOyenu satula vadanamu laTu srukkanAyenu

caraNam 7:
karigi karigi angalArciri celulu kamalAKSu nuramuna jErciri

caraNam 8:
kanula kATuka nIrukAraga jUci kAntuDentO muddu kAraga

caraNam 9:
ramaNula madamella jarigenu tyAgarAja nutuni madi karagenu


రాగం : మోహనం
తాళం : చాపు
పల్లవి:
వేదవాక్యమని ఎంచిరి ఈ వెలదులెల్ల సమ్మతించిరి

చరణం :
చీరలన్నియు వదలించిరి ఎంతో సిగ్గు చేత నందు నుంచిరి

చరణం2:
అందున నిలువగపోయెను మేను లందరికి తడవనాయెను

చరణం 3:
కనుగొందురోయని సరగున పాలిండ్లకరముల మూయ మరుగునా

చరణం 4:
మానములను ముసుకొందురో తమ ప్రాణములను గాచు కొందురో

చరణం 5:
చెలుల నోరెండనాయెను నీరు చిలుచిలుమని ఎక్కువాయెను

చరణం 6:
వలువలు గానకపోయెను సతుల వదనము లటు స్రుక్కనాయెను

చరణం 7:
కరిగి కరిగి అంగలార్చిరి చెలులు కమలాఖ్శు నురమున జేర్చిరి

చరణం 8:
కనుల కాటుక నీరుకారగ జూచి కాంతుడెంతో ముద్దు కారగ

చరణం 9:
రమణుల మదమెల్ల జరిగెను త్యాగరాజ నుతుని మది కరగెను