Friday, March 9, 2012

endukO nI manasu


















rAgam: kaLyANi
tALam : Adi
ArTisT : Smt.Priya sisters
pallavi:
endukO nI manasu karugadu Emi nEramO teliya

anupallavi:
eMdu cUcinagAni daSaratha naMdanuga BAviMcina nApai

caraNam 1:
sumuKulaina yI lOkulu nannasUyalacE jUcedaru
vimuKulai eMtaTivADani bahuvidhamula dUredaru
samuKunaku yOgyuDugADani marxi  jUDaga neMcedaru
gamakamunanu rakShiMceDivAralu gArani ninnE kOrina nApai

caraNam 2:
dhana tanaya kaLatrAdulu tamadani Bramasedaru
venukamuMdu teliyani yA dhanikula veMbaDi tirigedaru
inakula jaladhisOma rAma nanniTula sEyaka nI veyyAru
manavulaDugu nApaini karuNatO manniMci kApADanu rAma

caraNam3:
rAgarahita SrIrAma iMta parAku cEyaka Sara-
NAgata vatsala nammiti tArakanAma parAtpara
tyAgarAja hRdaya sadanuDani yatyaMtamu vEDitirA nivE
gatiyanucu rEyipagalu veyivEla moralabeTTina nApai


రాగం: కళ్యాణి
తాళం : ఆది

పల్లవి:
ఎందుకో నీ మనసు కరుగదు ఏమి నేరమో తెలియ

అనుపల్లవి:
ఎందు చూచినగాని దశరథ నందనుగ భావించిన నాపై

చరణం 1:
సుముఖులైన యీ లోకులు నన్నసూయలచే జూచెదరు
విముఖులై ఎంతటివాడని బహువిధముల దూరెదరు
సముఖునకు యోగ్యుడుగాడని మర్కి  జూడగ నెంచెదరు
గమకమునను రక్షించెడివారలు గారని నిన్నే కోరిన నాపై

చరణం 2:
ధన తనయ కళత్రాదులు తమదని భ్రమసెదరు
వెనుకముందు తెలియని యా ధనికుల వెంబడి తిరిగెదరు
ఇనకుల జలధిసోమ రామ నన్నిటుల సేయక నీ వెయ్యారు
మనవులడుగు నాపైని కరుణతో మన్నించి కాపాడను రామ

చరణం3:
రాగరహిత శ్రీరామ ఇంత పరాకు చేయక శర-
ణాగత వత్సల నమ్మితి తారకనామ పరాత్పర
త్యాగరాజ హృదయ సదనుడని యత్యంతము వేడితిరా నివే
గతియనుచు రేయిపగలు వెయివేల మొరలబెట్టిన నాపై

No comments:

Post a Comment