Sunday, March 18, 2012

prArabdha miTluMDaga



















rAgam: svaravaLi
tALam : Jampe

pallavi:
prArabdha miTluMDaga orula  nana panilEdu nIvuMDaga

caraNam:
bAlaguNaSIla janapAla varada kRpala
bAla kAlAtIta SUladhara vinuta nA

caraNam :
upakAri nEnaite apakArulayyEru
kRpajUcitE migula nepamu leMcErayya
capala cittulu BaktavEShulai nanu jUci
SatRlayyEru SrI tyAgarAjApta nA


రాగం: స్వరవళి
తాళం : ఝంపె

పల్లవి:
ప్రారబ్ధ మిట్లుండగ ఒరుల  నన పనిలేదు నీవుండగ

చరణం:
బాలగుణశీల జనపాల వరద కృపల
బాల కాలాతీత శూలధర వినుత నా

చరణం :
ఉపకారి నేనైతె అపకారులయ్యేరు
కృపజూచితే మిగుల నెపము లెంచేరయ్య
చపల చిత్తులు భక్తవేషులై నను జూచి
శతృలయ్యేరు శ్రీ త్యాగరాజాప్త నా

Friday, March 9, 2012

paritApamu ganiyADina


















rAgam : manOhari
tALam : rUpakam
pallavi:
paritApamu ganiyADina palukula maracitivO A palukula maracitivO

anupallavi:
sarilEni sItatO sarayU madhyaMbunanA

caraNam:
varamagu baMgAruvADanu me~rayucu badipUTalapai
karuNiMceda nanucu krIganula tyAgarAjuni


రాగం : మనోహరి
తాళం : రూపకం 
పల్లవి:
పరితాపము గనియాడిన పలుకుల మరచితివో ఆ పలుకుల మరచితివో 

అనుపల్లవి:
సరిలేని సీతతో సరయూ మధ్యంబుననా

చరణం:
వరమగు బంగారువాడను మెఱయుచు బదిపూటలపై
కరుణించెద ననుచు క్రీగనుల త్యాగరాజుని  

endukO nI manasu


















rAgam: kaLyANi
tALam : Adi
ArTisT : Smt.Priya sisters
pallavi:
endukO nI manasu karugadu Emi nEramO teliya

anupallavi:
eMdu cUcinagAni daSaratha naMdanuga BAviMcina nApai

caraNam 1:
sumuKulaina yI lOkulu nannasUyalacE jUcedaru
vimuKulai eMtaTivADani bahuvidhamula dUredaru
samuKunaku yOgyuDugADani marxi  jUDaga neMcedaru
gamakamunanu rakShiMceDivAralu gArani ninnE kOrina nApai

caraNam 2:
dhana tanaya kaLatrAdulu tamadani Bramasedaru
venukamuMdu teliyani yA dhanikula veMbaDi tirigedaru
inakula jaladhisOma rAma nanniTula sEyaka nI veyyAru
manavulaDugu nApaini karuNatO manniMci kApADanu rAma

caraNam3:
rAgarahita SrIrAma iMta parAku cEyaka Sara-
NAgata vatsala nammiti tArakanAma parAtpara
tyAgarAja hRdaya sadanuDani yatyaMtamu vEDitirA nivE
gatiyanucu rEyipagalu veyivEla moralabeTTina nApai


రాగం: కళ్యాణి
తాళం : ఆది

పల్లవి:
ఎందుకో నీ మనసు కరుగదు ఏమి నేరమో తెలియ

అనుపల్లవి:
ఎందు చూచినగాని దశరథ నందనుగ భావించిన నాపై

చరణం 1:
సుముఖులైన యీ లోకులు నన్నసూయలచే జూచెదరు
విముఖులై ఎంతటివాడని బహువిధముల దూరెదరు
సముఖునకు యోగ్యుడుగాడని మర్కి  జూడగ నెంచెదరు
గమకమునను రక్షించెడివారలు గారని నిన్నే కోరిన నాపై

చరణం 2:
ధన తనయ కళత్రాదులు తమదని భ్రమసెదరు
వెనుకముందు తెలియని యా ధనికుల వెంబడి తిరిగెదరు
ఇనకుల జలధిసోమ రామ నన్నిటుల సేయక నీ వెయ్యారు
మనవులడుగు నాపైని కరుణతో మన్నించి కాపాడను రామ

చరణం3:
రాగరహిత శ్రీరామ ఇంత పరాకు చేయక శర-
ణాగత వత్సల నమ్మితి తారకనామ పరాత్పర
త్యాగరాజ హృదయ సదనుడని యత్యంతము వేడితిరా నివే
గతియనుచు రేయిపగలు వెయివేల మొరలబెట్టిన నాపై

nAdOpAsanacEsE















rAgam : bEgaDa
tALam : dEshAdi
pallavi:
nAdOpAsanacE SaMkara nArAyaNa
vidhulu velasiri O manasA
anupallavi:
vEdOddharulu vEdAtItulu
viSvamella niMDiyuDeDivAralu
caraNam:
maMtrAtmulu yaMtrAtaMtrAtmulu mari
maMtramulanniyu kalavAralu
taMtrInilaya svara rAgavilOluru
tyAgarAja vaMdyulu svataMtrulu


రాగం : బేగడ
తాళం : దేషాది
పల్లవి:
నాదోపాసనచే శంకర నారాయణ
విధులు వెలసిరి ఓ మనసా
అనుపల్లవి:
వేదోద్ధరులు వేదాతీతులు
విశ్వమెల్ల నిండియుడెడివారలు
చరణం:
మంత్రాత్ములు యంత్రాతంత్రాత్ములు మరి
మంత్రములన్నియు కలవారలు
తంత్రీనిలయ స్వర రాగవిలోలురు
త్యాగరాజ వంద్యులు స్వతంత్రులు

nAmakusumamulacE



















rAgam : SrI
tALam : dEshAdi
pallavi:
nAmakusumamulacE bUjiMcE
narajanmamE janmamu manasA
anupallavi:
SrImanmAnasa kanaka pIThamuna
celagajEsikoni varaSiva rAma
caraNam:
nAdasvarAmanE navaratnapu vEdikapai sakala lIlA
vinOduni paramAtmuni SrIrAmuni
pAdamulanu tyAgarAja hRdBUShaNuni


రాగం : శ్రీ
తాళం : దేషాది
పల్లవి:
నామకుసుమములచే బూజించే
నరజన్మమే జన్మము మనసా
అనుపల్లవి:
శ్రీమన్మానస కనక పీఠమున
చెలగజేసికొని వరశివ రామ
చరణం:
నాదస్వరామనే నవరత్నపు వేదికపై సకల లీలా
వినోదుని పరమాత్ముని శ్రీరాముని
పాదములను త్యాగరాజ హృద్భూషణుని

Wednesday, March 7, 2012

nIkEteliyakapOthE
















rAgam : Anandabhairavi
tALam : rUpaka tALam
ArTisT : Sri.Hyderabad brothers
pallavi:
nIkE teliyakapOtE nEnEmi sEyudurA

anupallavi:
lOkAdhAruDavai nAlOni prajvaliMcE jAli

caraNam:
eMdeMdu jUcina eMdeMdu balikina
eMdeMdu sEviMcina eMdeMdu bUjiMcina
aMdaMdu nIvani tOcETaMduku nI pAdAraviMdamunu
dhyAniMcina deMdukani tyAgarAja sannuta


రాగం : ఆనందభైరవి
తాళం : రూపక తాళం
పల్లవి:
నీకే తెలియకపోతే నేనేమి సేయుదురా

అనుపల్లవి:
లోకాధారుడవై నాలోని ప్రజ్వలించే జాలి

చరణం:
ఎందెందు జూచిన ఎందెందు బలికిన
ఎందెందు సేవించిన ఎందెందు బూజించిన
అందందు నీవని తోచేటందుకు నీ పాదారవిందమును
ధ్యానించిన దెందుకని త్యాగరాజ సన్నుత

nIvADanE gAna

























rAgam : sAraMga
tALam : JaMpa tALam
ArTist : SrI.MaharAjapuram Santanam  

pallavi:
nIvADanE gAna niKila lOka nidhAna
nimiSha mOrvaga galanA

anupallavi:
dEvAdhidEva BUdEva varapakSha
rAjIvAkSha sAdhujana jIvana sanAtana

caraNam:
satyaMbu nityaMbu samaramuna SauryaMbu
atyaMta rUpambu amita balamu
nityOtsavaMbu gala nIku nija dAsuDani
tathyaMbu balku SrI tyAgarAjArcita


రాగం : సారంగ
తాళం : ఝంప తాళం

పల్లవి:
నీవాడనే గాన నిఖిల లోక నిధాన
నిమిష మోర్వగ గలనా

అనుపల్లవి:
దేవాధిదేవ భూదేవ వరపక్ష
రాజీవాక్ష సాధుజన జీవన సనాతన

చరణం:
సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు
అత్యంత రూపంబు అమిత బలము
నిత్యోత్సవంబు గల నీకు నిజ దాసుడని
తథ్యంబు బల్కు శ్రీ త్యాగరాజార్చిత