rAgam : yamunAkalyANi
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi :
nArAyaNa hari nArAyaNa hari
nArAyaNa hari nArAyaNa hari
caraNam :
naSvaramaina dhanASvamulanu nEviSvasiMca BUtESvara hari hari
caraNam :
kOTISulagani sATilEni palkubOTi nosagi mummATiki vEDanu
ASApiSAcAvESamu kalugu dhanESula gAcE dEsamu nEludu
caraNam :
nAlO nEnIcElO jikkiti nIlOBamu viDavElO teliyanu
caraNam :
BUlOkamulO mElOrvaru vidhivrAlO nIkaucAlO teliyanu
caraNam :
dUrE panulaku dUrEru kaDa tErE panulaku tErE manasunu
caraNam :
toli tAjEsina PalamE kaladani ila neMcani martyula celimeMduku
caraNam :
dUShaNahara paradUShaNa janagaNa BIShaNa suguNa viBIShaNa sannuta
caraNam :
nOreppuDu nI pErE balkanI vErE evarunnArE rAGava
caraNam :
mitrakulESa carita rasika jana mitramu kOrudu vRtrAri vinuta
caraNam :
vIna vimAna kavIna hRdAlaya dInajanAvana dAnava hara SrI
caraNam :
nA jUpulu mI nAjUku tanamu nEjUDanI tyAgarAjulla malaru
రాగం : యమునాకళ్యాణి
తాళం : ఆది
పల్లవి :
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నారాయణ హరి
చరణం :
నశ్వరమైన ధనాశ్వములను నేవిశ్వసించ భూతేశ్వర హరి హరి
చరణం :
కోటీశులగని సాటిలేని పల్కుబోటి నొసగి ముమ్మాటికి వేడను
ఆశాపిశాచావేశము కలుగు ధనేశుల గాచే దేసము నేలుదు
చరణం :
నాలో నేనీచేలో జిక్కితి నీలోభము విడవేలో తెలియను
చరణం :
భూలోకములో మేలోర్వరు విధివ్రాలో నీకౌచాలో తెలియను
చరణం :
దూరే పనులకు దూరేరు కడ తేరే పనులకు తేరే మనసును
చరణం :
తొలి తాజేసిన ఫలమే కలదని ఇల నెంచని మర్త్యుల చెలిమెందుకు
చరణం :
దూషణహర పరదూషణ జనగణ భీషణ సుగుణ విభీషణ సన్నుత
చరణం :
నోరెప్పుడు నీ పేరే బల్కనీ వేరే ఎవరున్నారే రాఘవ
చరణం :
మిత్రకులేశ చరిత రసిక జన మిత్రము కోరుదు వృత్రారి వినుత
చరణం :
వీన విమాన కవీన హృదాలయ దీనజనావన దానవ హర శ్రీ
చరణం :
నా జూపులు మీ నాజూకు తనము నేజూడనీ త్యాగరాజుల్ల మలరు