Tuesday, May 22, 2012

ninnADa nEla



rAgam : kAnaDa

pallavi:
ninnADa nEla nIrajAksha

anupallavi:
kannavAri paini kAka sEyanEla

caraNam1:
karmamunaku taginaTlu kAryamulu naDucunu
dharmamunaku taginaTlu daivamu brOcunu

caraNam2:
cittamunaku taginaTlu siddhiyu kalgunu
vittamunaku taginaTlu vEDuka naDucunu

caraNam3:
satya rUpa ninnu sannuti jEsi
tatvamu telisina tyAgarAjuniki


రాగం : కానడ

పల్లవి:
నిన్నాడ నేల నీరజాక్ష

అనుపల్లవి:
కన్నవారి పైని కాక సేయనేల 

చరణం1:
కర్మమునకు తగినట్లు కార్యములు నడుచును 
ధర్మమునకు తగినట్లు దైవము బ్రోచును 

చరణం2:
చిత్తమునకు తగినట్లు సిద్ధియు కల్గును 
విత్తమునకు తగినట్లు వేడుక నడుచును 

చరణం3:
సత్య రూప నిన్ను సన్నుతి జేసి
తత్వము తెలిసిన త్యాగరాజునికి 

No comments:

Post a Comment