Friday, December 23, 2011

nAdupai















rAgam : madhyamAvati
tALam : Jampe
ArTisT : Smt.ML.Vasantha kumari

pallavi:
nAdupai balikEru narulu

anupallavi:
vEdasannuta Bavamu vE~ru jEsiti nanucu

caraNam1:
paMcaSarajanaka prapaMcamuna gala Sukhamu maMcuvale nanucu madi neMcitinigAni
paMcukoni dhanamu lArjiMcukoni sariyevvaraMcu ma~ri gatiyu lEdaMcu balkitinA

caraNam2:
dinamu nityOtsavammuna kAsa jeMditinA manasuna nillu yokaTani yuMTigAni
anudinamu yorula mElunu jUci tAlalEkanu reMDu sEyavale nanucu balkitinA

caraNam3:
prANamEpATi yani maunamE mElaMTi gAni SrIrAma paramAnaMda jaladhE
SrInAtha kulamulO lEnidArini baTTi jAne Dudaramu niMpa norula bogaDitinA

caraNam4:
AjAnubAhuyuga SrIjAnakIpati payOjAksha SrItyAgarAjanuta caraNa
I jagatilO ninnu bUjiMcuvAri nAvyajamuna brOcE surAja nIvADaina



రాగం : మధ్యమావతి
తాళం : ఝంపె

పల్లవి:
నాదుపై బలికేరు నరులు

అనుపల్లవి:
వేదసన్నుత భవము వేఱు జేసితి ననుచు

చరణం1:
పంచశరజనక ప్రపంచమున గల శుఖము మంచువలె ననుచు మది నెంచితినిగాని
పంచుకొని ధనము లార్జించుకొని సరియెవ్వరంచు మఱి గతియు లేదంచు బల్కితినా

చరణం2:
దినము నిత్యోత్సవమ్మున కాస జెందితినా మనసున నిల్లు యొకటని యుంటిగాని
అనుదినము యొరుల మేలును జూచి తాలలేకను రెండు సేయవలె ననుచు బల్కితినా

చరణం3:
ప్రాణమేపాటి యని మౌనమే మేలంటి గాని శ్రీరామ పరమానంద జలధే
శ్రీనాథ కులములో లేనిదారిని బట్టి జానె డుదరము నింప నొరుల బొగడితినా

చరణం4:
ఆజానుబాహుయుగ శ్రీజానకీపతి పయోజాక్ష శ్రీత్యాగరాజనుత చరణ
ఈ జగతిలో నిన్ను బూజించువారి నావ్యజమున బ్రోచే సురాజ నీవాడైన

No comments:

Post a Comment