Saturday, November 17, 2012

cEsinadella






















rAgam : tODi
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
cEsinadella maracitivO O rAmarAma

anupallavi:
AsakonnaTTi nannala yiMcuTaku munnu

caraNam :
Alu nIkaina BakturAlO yanucu nADu
prAlumAlaka ravibAluni celimiyu

caraNam :
BASha tappakanu viBIShaNuni korakAdi
tammuDagu tammuni pOShiMcamani rAju

caraNam :
rAma SrI tyAgarAja prEmAvatAra sItA
BAma mATalu telpu BImAMjanEyu brahma


రాగం : తోడి
తాళం : ఆది

పల్లవి:
చేసినదెల్ల మరచితివో ఓ రామరామ

అనుపల్లవి:
ఆసకొన్నట్టి నన్నల యించుటకు మున్ను

చరణం :
ఆలు నీకైన భక్తురాలో యనుచు నాడు
ప్రాలుమాలక రవిబాలుని చెలిమియు

చరణం :
భాష తప్పకను విభీషణుని కొరకాది
తమ్ముడగు తమ్ముని పోషించమని రాజు

చరణం :
రామ శ్రీ త్యాగరాజ ప్రేమావతార సీతా
భామ మాటలు తెల్పు భీమాంజనేయు బ్రహ్మ

anyAyamu


















rAgam : kApi
tALam : Adi

pallavi:
anyAyamu sEyakurA rAma
anyunigA cUDakurA nAyeDa

anupallavi:
ennO tappulugalavArini rA
janya nIvu brOcinAvu ganukanu

caraNam :
jaDa BaratuDu jiMka SiSuvu netti baDalaka dIrcagalEdA
kaDalini munigina noka kUrmamu kApADagalEDA

caraNam :
puDamini pAMDava drOhini dharmaputruDu brOvagalEdA
naDimi prAyamuna tyAgarAjanuta
nApUrvaju bAdha dIrpalEnani

రాగం : కాపి
తాళం : ఆది

పల్లవి:
అన్యాయము సేయకురా రామ
అన్యునిగా చూడకురా నాయెడ

అనుపల్లవి:
ఎన్నో తప్పులుగలవారిని రా
జన్య నీవు బ్రోచినావు గనుకను

చరణం :
జడ భరతుడు జింక శిశువు నెత్తి బడలక దీర్చగలేదా
కడలిని మునిగిన నొక కూర్మము కాపాడగలేడా

చరణం :
పుడమిని పాండవ ద్రోహిని ధర్మపుత్రుడు బ్రోవగలేదా
నడిమి ప్రాయమున త్యాగరాజనుత
నాపూర్వజు బాధ దీర్పలేనని



Friday, November 16, 2012

upacAramu


















rAgamu : Bairavi
tALam : rUpakam
ArTisT : Smt.Priya Sisters
pallavi :
upacAramu cEsEvArunnArani maracitivO

anupallavi:
kRpa kAvalenani nE nI kIrtini balkucu nuMDaga

caraNam :
vAkiTanE padailaMbuga vAtAtmaju DunnADani
SrIkarulagu nI tammulu cEriyunnArani
EkAMtamunanu jAnaki ErpaDiyunnadani
SrIkAMta parulElani SrI tyAgarAjanuta

రాగము : భైరవి
తాళం : రూపకం

పల్లవి :
ఉపచారము చేసేవారున్నారని మరచితివో

అనుపల్లవి:
కృప కావలెనని నే నీ కీర్తిని బల్కుచు నుండగ

చరణం :
వాకిటనే పదైలంబుగ వాతాత్మజు డున్నాడని
శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని
శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజనుత

Thursday, November 15, 2012

rAmABi




















rAgam :darbAru
tALam :Adi
ArTisT : Smt.Chinmaya Sisters
pallavi:
rAmABi rAma ramaNIyanAma
sAmajaripuBIma sAkEtadhAma

caraNam :
vanajalOcana nIvu valasi yalasiti nI
manasuna dayalEdu mallADi PalamEmi

caraNam :
manasanu celi nIkE marulukonnadigAni
canavuna ceyibaTTi saMrakshiMcavu

caraNam :
kamaniya magu pAnpu gAviMciti naMdu
rami yiMpakane nannu raccajEsevu

caraNam:
kOrikOri ninnu  goluvaga nIku
dAri vErEyani dhAta vrAtEmO

caraNam :
dikku nIvani nEnu dinadianmunu namma
ekku takkuvalaMdu enase guNamEmo

caraNam :
nIkE daya buTTi nIvu brOvavale
rAkEmdumuKa SrItyAgarAjarakshaka

రాగం :దర్బారు 
తాళం :ఆది 

పల్లవి:
రామాభి రామ రమణీయనామ 
సామజరిపుభీమ సాకేతధామ 

చరణం :
వనజలోచన నీవు వలసి యలసితి నీ 
మనసున దయలేదు మల్లాడి ఫలమేమి 

చరణం :
మనసను చెలి నీకే మరులుకొన్నదిగాని 
చనవున చెయిబట్టి సంరక్షించవు 

చరణం :
కమనియ మగు పాంపు గావించితి నందు 
రమి యింపకనె నన్ను రచ్చజేసెవు 

చరణం:
కోరికోరి నిన్ను  గొలువగ నీకు 
దారి వేరేయని ధాత వ్రాతేమో

చరణం :
దిక్కు నీవని నేను దినదీన్మును నమ్మ 
ఎక్కు తక్కువలందు ఎనసె గుణమేమొ

చరణం :
నీకే దయ బుట్టి నీవు బ్రోవవలె 
రాకేందుముఖ శ్రీత్యాగరాజరక్షక  


mAru balkakunnA


















rAgam : SrIraMjani
tALam :Adi
ArTisT : Sri.Sankaran Namboodri
pallavi:
mAru balkakunnA vEmirA mA manOramaNa

anupallavi:
jAracOra BajanacEsitinA sAkEta sadana

caraNam :
dUraBAramaMdu nA hRdayAraviMdamaMdu nelakonu
dAri nerigi saMtasillinaTTi tyAgarAjanuta

రాగం : శ్రీరంజని 
తాళం :ఆది 
పల్లవి:
మారు బల్కకున్నా వేమిరా మా మనోరమణ 

అనుపల్లవి:
జారచోర భజనచేసితినా సాకేత సదన 

చరణం :
దూరభారమందు నా హృదయారవిందమందు నెలకొను
దారి నెరిగి సంతసిల్లినట్టి త్యాగరాజనుత 


Saturday, November 3, 2012

EtAvuna nErcitivO


















rAgam : yadukulakAmbhOji
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters
pallavi:
EtAvuna nErcitivO rAma eMdukiMtagAsi

anupallavi:
sitAlakShmaNa Barata ripuGna
vAtAtma jAdulatO nADEnATaka mE

caraNam
Alu vajrAla sommulaDigirO
anujulu tallidaMDrulanna maDigirO
SIlulaina varaBaktulu pilacirO
cirakAlamu tyAgarAjanuta nIvE

రాగం : యదుకులకాంభోజి
తాళం : ఆది

పల్లవి:
ఏతావున నేర్చితివో రామ ఎందుకింతగాసి

అనుపల్లవి:
సితాలక్ష్మణ భరత రిపుఘ్న
వాతాత్మ జాదులతో నాడేనాటక మే

చరణం
ఆలు వజ్రాల సొమ్ములడిగిరో
అనుజులు తల్లిదండ్రులన్న మడిగిరో
శీలులైన వరభక్తులు పిలచిరో
చిరకాలము త్యాగరాజనుత నీవే


Saturday, October 13, 2012

muccaTa brahmAdulaku















rAgam : madhyamAvati
tALam :  Adi
ArTisT : Smt. R. Vedavalli

pallavi :
muccaTa brahmAdulaku dorakunA
muditalAra cUtAmurArE

anupallavi:
paccani dEhini parama pAvanini
pArvatini talacucunu haruDEgeDu

caraNam :
callare vElpula rIti virula kara|pallavamulanu taLukkanucu birudu
lella meraya nijaBaktulu pogaDada |ullamu raMjilla
tellani mEnuna niMDu sommulatO|mallehAramulu ma~ri SOBillaga
callanivELa sakala navaratnapu|pallakilO vEMcEsi vaccu

caraNam :
hitamaina sakalanai vEdyaMbulu sammatamuga aDugaDugu kAragiMpucu
mitamu lEni yupacAramulatO |sati saMtOshamuna satatamu
japatapamula nonariMcu|natajanula kaBIShTamu lavvAriga
vetaki yosagudu nanucu baMcanadI | pati veDali  sogasu mIranga vaccu

caraNam :
BAgavatulu harinAmakIrtanamu | bAguga susvaramulatO viMta
rAgamulanu yAlapanamucEyu vaiBOgamulanu cUci
nAgaBUShaNuDu karuNAnidhiyai|vEganu sakala sujana rakShaNamuna
jAgarUkuDai kOrkela nosagu |tyAgarAju tAnanucunu vaccu

రాగం : మధ్యమావతి
తాళం :  ఆది

పల్లవి :
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార చూతామురారే

అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు

చరణం :
చల్లరె వేల్పుల రీతి విరుల కర|పల్లవములను తళుక్కనుచు బిరుదు
లెల్ల మెరయ నిజభక్తులు పొగడద |ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో|మల్లెహారములు మఱి శోభిల్లగ
చల్లనివేళ సకల నవరత్నపు|పల్లకిలో వేంచేసి వచ్చు

చరణం :
హితమైన సకలనై వేద్యంబులు సమ్మతముగ అడుగడుగు కారగింపుచు
మితము లేని యుపచారములతో |సతి సంతోషమున సతతము
జపతపముల నొనరించు|నతజనుల కభీష్టము లవ్వారిగ
వెతకి యొసగుదు ననుచు బంచనదీ | పతి వెడలి  సొగసు మీరంగ వచ్చు

చరణం :
భాగవతులు హరినామకీర్తనము | బాగుగ సుస్వరములతో వింత
రాగములను యాలపనముచేయు వైభోగములను చూచి
నాగభూషణుడు కరుణానిధియై|వేగను సకల సుజన రక్షణమున
జాగరూకుడై కోర్కెల నొసగు |త్యాగరాజు తాననుచును వచ్చు