Monday, July 30, 2012

paramAtmuDu


rAgam : vAgadhISvari
ArTisT : Sri. Balamurali krishna garu

pallavi:
paramAtmuDu veligE muccaTa
bAga telusukOrE

anupallavi:
hariyaTa haruDaTa surulaTa narulaTa
akhilAMDa kOTulaTayandarilO

caraNam :
gaganAnila tEjO jala bhUmayamagu
mRga khaga naga taru kOTulalO
saguNamulO viguNamulO satatamu
sAdhu tyAgarAjAdiyASritulilalO



రాగం : వాగధీశ్వరి

పల్లవి:
పరమాత్ముడు వెలిగే ముచ్చట
బాగ తెలుసుకోరే

అనుపల్లవి:
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో

చరణం :
గగనానిల తేజో జల భూమయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులిలలో

Sunday, July 29, 2012

daya jUcuTakidi


















rAgam : gAnavAridhi
ArTisT : Sri. SR. Janakiraman

pallavi:
daya jUcuTakidi vELara dASarathI

anupallavi:
bhavavAraNa mRgESa  jalajOdbhavArti
hara manjuLAkAra nanu

caraNam:
munu nIvAnaticcina
panulAsa koni nE
manasAraga nidAnamuga
salpinAnu vara tyAgarAjApta nanu

రాగం : గానవారిధి

పల్లవి:
దయ జూచుటకిది వేళర దాశరథీ

అనుపల్లవి:
భవవారణ మృగేశ  జలజోద్భవార్తి
హర మంజుళాకార నను

చరణం:
మును నీవానతిచ్చిన
పనులాస కొని నే
మనసారగ నిదానముగ
సల్పినాను వర త్యాగరాజాప్త నను

Tuesday, July 10, 2012

rAma pAhi mEGaSyAma


















rAgam : kApi
tAlam : cApu
ArTisT: Sri.Balamurali krishna gAru & Smt.P.Suseela gAru
pallavi:
rAma pAhi mEGaSyAmapAhi guNadhAma mAMpAhi O rAma

caraNam:
mUDu lOkamulalO IDulEdani ninnu vEDukomTini nEnu O rAma

caraNam:
lOkula neranmmukOka nE nIkE lOkuvanE naitini O rAma

caraNam:
E vEla nApAli dEvAdi dEvDu nIvE yanukoMtini O rAma

caraNam:
anni kallalani ninnE nijamanukonnavADanaitini O rAma

caraNam:
talacinaMtanE mEnu pulakariMcaga nIpai valaci nIvADanaitini O rAma

caraNam :
durjana gaNamula varNiMcuTaku  nAma garjanE gati yaMtini O rAma

caraNam:
manasuna nityanUtanamaina cakkani tanamunu kanugoMtini O rAma

caraNam:
avani sutAdhava Bavamuna evvarikevaru lEdanukoMTini O rAma

caraNam:
maMci kRtyamulu nIkaMcu icciti nApaMca BUtasAkShigA O rAma

caraNam:
vanajanayana nA vacanamulella satyamanucu yAlakiMcumI O rAma

caraNam:
ikanaina SaMkarasaKa brahmAnaMdasuKasAgara brOvumi O rAma

caraNam:
AjAnubAhu sarOjAnana tyAgarAja sannuta carita O rAma




రాగం : కాపి
తాళం : చాపు
పల్లవి:
రామ పాహి మేఘశ్యామపాహి గుణధామ మాంపాహి ఓ రామ

చరణం:
మూడు లోకములలో ఈడులేదని నిన్ను వేడుకొంటిని నేను ఓ రామ

చరణం:
లోకుల నెరన్మ్ముకోక నే నీకే లోకువనే నైతిని ఓ రామ

చరణం:
ఏ వేల నాపాలి దేవాది దేవ్డు నీవే యనుకొంతిని ఓ రామ

చరణం:
అన్ని కల్లలని నిన్నే నిజమనుకొన్నవాడనైతిని ఓ రామ

చరణం:
తలచినంతనే మేను పులకరించగ నీపై వలచి నీవాడనైతిని ఓ రామ

చరణం :
దుర్జన గణముల వర్ణించుటకు  నామ గర్జనే గతి యంతిని ఓ రామ

చరణం:
మనసున నిత్యనూతనమైన చక్కని తనమును కనుగొంతిని ఓ రామ

చరణం:
అవని సుతాధవ భవమున ఎవ్వరికెవరు లేదనుకొంటిని ఓ రామ

చరణం:
మంచి కృత్యములు నీకంచు ఇచ్చితి నాపంచ భూతసాక్షిగా ఓ రామ

చరణం:
వనజనయన నా వచనములెల్ల సత్యమనుచు యాలకించుమీ ఓ రామ

చరణం:
ఇకనైన శంకరసఖ బ్రహ్మానందసుఖసాగర బ్రోవుమి ఓ రామ

చరణం:
ఆజానుబాహు సరోజానన త్యాగరాజ సన్నుత చరిత ఓ రామ

Sunday, June 17, 2012

aTla palukuduvu














rAgam: aTHANa
ArTisT: Smt Mambalam sisters
pallavi:
aTla palukuduvu iTla palukuduvu
anduEmi sEtu rAmA nIvaTla

anupallavi:
toTlanarbhakula nUtuvu mari tOcinaTlu gilluduvu SrI rAma nIvaTla

caraNam:
jIvula Sikshimcaga nErtuvu ciranjIvuluga jEya
nErtuvurA bhAvamerigi  brOtuvu sadbhakta
bhAgadhEya SrI tyAgarAja vinuta (aTla)

రాగం: అఠాణ 

పల్లవి:
అట్ల పలుకుదువు ఇట్ల పలుకుదువు  
అందుఏమి సేతు రామా నీవట్ల 

అనుపల్లవి:
తొట్లనర్భకుల నూతువు మరి తోచినట్లు గిల్లుదువు శ్రీ రామ నీవట్ల 

చరణం:  
జీవుల శిక్షించగ నేర్తువు చిరంజీవులుగ జేయ 
నేర్తువురా భావమెరిగి  బ్రోతువు సద్భక్త   
భాగధేయ శ్రీ త్యాగరాజ వినుత (అట్ల) 

Sunday, June 10, 2012

dInajanAvana



















rAgam : BUpAlam
tALam : cApu
pallavi:
dInajanAvana SrIrAma dAnavaharaNa SrIrAma

anupallavi:
vInavimAna SrIrAma mInaSarIra SrIrAma

caraNam:
nirmalahRdaya SrIrAma kArmukabANa SrIrAma

caraNam :
SarmaPalaprada SrIrAma kUrmAvatAra SrIrAma

caraNam:
SrIkarasuguNa SrIrAma SrIkaralAlita SrIrAma

caraNam :
SrIkaruNArNava SrIrAma sUkararUpa SrIrAma

caraNam:
sarasijanayana SrIrAma surapativinuta SrIrAma

caraNam:
naravaravESha SrIrAma naraharirUpa SrIrAma

caraNam:
kAmitaPalada SrIrAma pAmaradUra SrIrAma

caraNam:
sAmajavarada SrIrAma vAmanarUpa SrIrAma

caraNam:
aGa timirAditya SrIrAma vigaLitamOha SrIrAma

caraNam:
raGukulatilaka SrIrAma  BRgusutarUpa SrIrAma

caraNam:
kuSalavajanaka SrIrAma kuSaladacatura SrIrAma

caraNam :
daSamuKamardhana SrIrAma daSarathanaMdana SrIrAma

caraNam:
kalimalaharaNa SrIrAma jalajaBavArcita SrIrAma

caraNam:
salalitavacana SrIrAma haladhararUpa SrIrAma

caraNam:
siddhajanapriya SrIrAma prasiddhacaritra SrIrAma


రాగం : భూపాలం
తాళం : చాపు
పల్లవి:
దీనజనావన శ్రీరామ దానవహరణ శ్రీరామ

అనుపల్లవి:
వీనవిమాన శ్రీరామ మీనశరీర శ్రీరామ

చరణం:
నిర్మలహృదయ శ్రీరామ కార్ముకబాణ శ్రీరామ

చరణం :
శర్మఫలప్రద శ్రీరామ కూర్మావతార శ్రీరామ

చరణం:
శ్రీకరసుగుణ శ్రీరామ శ్రీకరలాలిత శ్రీరామ

చరణం :
శ్రీకరుణార్ణవ శ్రీరామ సూకరరూప శ్రీరామ

చరణం:
సరసిజనయన శ్రీరామ సురపతివినుత శ్రీరామ

చరణం:
నరవరవేష శ్రీరామ నరహరిరూప శ్రీరామ

చరణం:
కామితఫలద శ్రీరామ పామరదూర శ్రీరామ

చరణం:
సామజవరద శ్రీరామ వామనరూప శ్రీరామ

చరణం:
అఘ తిమిరాదిత్య శ్రీరామ విగళితమోహ శ్రీరామ

చరణం:
రఘుకులతిలక శ్రీరామ  భృగుసుతరూప శ్రీరామ

చరణం:
కుశలవజనక శ్రీరామ కుశలదచతుర శ్రీరామ

చరణం :
దశముఖమర్ధన శ్రీరామ దశరథనందన శ్రీరామ

చరణం:
కలిమలహరణ శ్రీరామ జలజభవార్చిత శ్రీరామ

చరణం:
సలలితవచన శ్రీరామ హలధరరూప శ్రీరామ

చరణం:
సిద్ధజనప్రియ శ్రీరామ ప్రసిద్ధచరిత్ర శ్రీరామ

SrI nArasiMha



















rAgam: Phalaranjani
tALam : Adi
ArTisT : Sri.Balamurali kRshNa
pallavi:
SrI nArasiMha mAm pAhi
kshIrAbdhi kanyaka ramaNa

anupallavi:
dInArti nivAraNa bhavya guNa
diti tanaya timira sUrya trinEtra (SrI)

caraNam:
prahlAda parASara nArada
hRtpankEruha nIraja bandhO
AhlAda kara aSubha rOga
saMhAra varada tyAgarAjAdi vinuta (SrI)

రాగం: ఫలరంజని
తాళం : ఆది

పల్లవి:
శ్రీ నారసింహ మాం పాహి
క్షీరాబ్ధి కన్యక రమణ

అనుపల్లవి:
దీనార్తి నివారణ భవ్య గుణ
దితి తనయ తిమిర సూర్య త్రినేత్ర (శ్రీ)

చరణం:
ప్రహ్లాద పరాశర నారద
హృత్పంకేరుహ నీరజ బంధో
ఆహ్లాద కర అశుభ రోగ
సంహార వరద త్యాగరాజాది వినుత (శ్రీ)

Saturday, June 9, 2012

vaddanEvAru




















rAgam : shaNmuKhapriya
tALam : Adi
ArTisT: SrI Balamurali kRshNa gAru
pallavi:
vaddanEvAru lEru

anupallavi:
addaMpu mOmunu jUDanE nanaya maMgalArcitE jUci

caraNam :
kOrika lilalO divilO koMcamaina lEni nAmanasu
dAri teliyu daivamu nIvu sumI
tyAgarAja hRdBUShaNa ninu vinA

రాగం : షణ్ముఖప్రియ
తాళం : ఆది

పల్లవి:
వద్దనేవారు లేరు

అనుపల్లవి:
అద్దంపు మోమును జూడనే ననయ మంగలార్చితే జూచి

చరణం :
కోరిక లిలలో దివిలో కొంచమైన లేని నామనసు
దారి తెలియు దైవము నీవు సుమీ
త్యాగరాజ హృద్భూషణ నిను వినా