Thursday, March 29, 2012

kshINamai



















rAgam : muKAri
tALam :  Adi
pallavi:
kshINamai tiruga janmincE
siddhi mAnurA O manasA

caraNam :

gIrvANa nATakAlaMkAra vEdapu-
rANa yaj~na japatapAdula phalamu

caraNam:
Edi jEsina jagannAthuDu Siramuna |hRdayamuna vahiMci
padilamaina satpadamu nosaMgE bATa | tyAgarAjavinutuni BajanarA

kriti sung by Guru Sri nEdunUri kRshNamurthy gAru

రాగం : ముఖారి
తాళం :  ఆది
పల్లవి:
క్షీణమై తిరుగ జన్మించే
సిద్ధి మానురా ఓ మనసా

చరణం :

గీర్వాణ నాటకాలంకార వేదపు-
రాణ యజ్ఞ జపతపాదుల ఫలము

చరణం:
ఏది జేసిన జగన్నాథుడు శిరమున |హృదయమున వహించి
పదిలమైన సత్పదము నొసంగే బాట | త్యాగరాజవినుతుని భజనరా

Sunday, March 18, 2012

paralOka



















rAgam: mamdAri/nAmanArAyaNi
tALam :  dESAdi
ArTisT : Sri.Hyderabad brothers

pallavi:
paralOka BayamulEka BavapASa baddhulayyEru

caraNam:
karivAji SRmgAra rAma Sibi
kAdu lella manake kalgenani

caraNam :
konna kAMtalanu kanna biDDalanu
vanne cIralanu vAna guDiselanu
tinnagA ganE dEvalOkamani(daivalOkamani)
tannukOLLalO tyAgarAjanuta



రాగం: మందారి/నామనారాయణి  
తాళం :  దేశాది  

పల్లవి:
పరలోక భయములేక భవపాశ బద్ధులయ్యేరు  

చరణం:
కరివాజి శృంగార రామ శిబి
కాదు లెల్ల మనకె కల్గెనని

చరణం :
కొన్న కాంతలను కన్న బిడ్డలను
వన్నె చీరలను వాన గుడిసెలను
తిన్నగా గనే దేవలోకమని(దైవలోకమని)
తన్నుకోళ్ళలో త్యాగరాజనుత

toli nE jEsina



















rAgam: SuddhabaMgALa
tALam :  Adi
ArTist : SrI.nEdunUri kRshNamUrti gAru

pallavi:
toli nE jEsina pUjA phalamu
telisenu nA pAli daivamA

anupallavi:
palu vidhamula nE talaci karagagA
palukaka nIvaTu nEniTu gAka

caraNam :
sari vAralalO jauka cEsi
udara pOShakulanu poruguna jEsi
haridAsa rahita puramuna vEsi
dari jUpakuMDaga tyAgarAjArcita


రాగం: శుద్ధబంగాళ
తాళం :  ఆది

పల్లవి:
తొలి నే జేసిన పూజా ఫలము
తెలిసెను నా పాలి దైవమా

అనుపల్లవి:
పలు విధముల నే తలచి కరగగా
పలుకక నీవటు నేనిటు గాక

చరణం :
సరి వారలలో జౌక చేసి
ఉదర పోషకులను పొరుగున జేసి
హరిదాస రహిత పురమున వేసి
దరి జూపకుండగ త్యాగరాజార్చిత

vallagAdanaka



















rAgam: harikAmbhOji
tALam :  Adi
ArTisT : SrI.nEdunUri kRshNamUrti gAru

pallavi:
vallagAdanaka sIta vallaBa brOvu nA

caraNam:
nI valla nATi Bakta caritamella vrAyanElarA

caraNam :
staMBamunanu taru marugunanu DiMBuDai yasOdayoDini
daMBuDaina mucukuMduni DAsi marugucu
saMBaviMci yuga yugamuna sarasa tyAgarAja vinuta
kuMBaka rEcaka vidulanu kOri brOcinAvu nA


రాగం: హరికాంభోజి 
తాళం :  ఆది  
పల్లవి:
వల్లగాదనక సీత వల్లభ బ్రోవు నా 

చరణం:
నీ వల్ల నాటి భక్త చరితమెల్ల వ్రాయనేలరా

చరణం : 
స్తంభమునను తరు మరుగునను డింభుడై యసోదయొడిని
దంభుడైన ముచుకుందుని డాసి మరుగుచు 
సంభవించి యుగ యుగమున సరస త్యాగరాజ వినుత 
కుంభక రేచక విదులను కోరి బ్రోచినావు నా 

vinarAdanA

















rAgam: dEvagAmdhAri
tALam : dESAdi
ArTist : Sri nEdunUri krishNamUrti gAru

pallavi:
vinarAdanA manavi

caraNam:
kanakAMga kAvETi raMga SrIkAmta
kAmtalella kAmimci pilacitE

caraNam :
tEjinekki bAga teravuna rAga
rAjasatulu cUci rammani pilacitE

caraNam :
BAgadhEya vaiBOga raMga SrI
tyAgarAjanuta taruNulu pilacitE



రాగం: దేవగాంధారి
తాళం : దేశాది

పల్లవి:
వినరాదనా మనవి

చరణం:
కనకాంగ కావేటి రంగ శ్రీకాంత
కాంతలెల్ల కామించి పిలచితే

చరణం :
తేజినెక్కి బాగ తెరవున రాగ
రాజసతులు చూచి రమ్మని పిలచితే

చరణం :
భాగధేయ వైభోగ రంగ శ్రీ
త్యాగరాజనుత తరుణులు పిలచితే


PaNipatiSAyi
























rAgam: JaMkAradhvani
tALam : Adi
ArTist : SrI nEdunUri kRshNamUrti gAru

pallavi:
PaNipatiSAyi mAMpAhi pAlitAbdhipAyi

caraNam:
maNi maya makuTa virAjamAnO
manmadhakOTi samAnaH

caraNam :
gajavaragamana kamanIyananaH
sujana guNavana suMdara radanaH
gajamuKa vinutaH karuNAkaraH nI
rajanayanaH tyAgarAja hRtsadanaH


రాగం: ఝంకారధ్వని 
తాళం : ఆది 
పల్లవి:
ఫణిపతిశాయి మాంపాహి పాలితాబ్ధిపాయి

చరణం:
మణి మయ మకుట విరాజమానో 
మన్మధకోటి సమానహ్
చరణం : 
గజవరగమన కమనీయననహ్ 
సుజన గుణవన సుందర రదనహ్ 
గజముఖ వినుతహ్ కరుణాకరహ్ నీ 
రజనయనహ్ త్యాగరాజ హృత్సదనహ్ 

prANanAtha




















rAgam: SUlini
tALam : dEshAdi
ArTist : Sri.KJ.Yesudas
pallavi:
prANanAtha birAna brOvavE

caraNam:
vEnugAnamucE padiyAru vEla
gOpikala pAliMci yElE

caraNam :
vennamIgaDala vEDka mIraganu
kanna pinnavAMDla kaDupuniMci
tinnagA velayu divyarUpamA
cinni kRshNa dayacEsi tyAgarAja


రాగం: శూలిని
తాళం : దేషాది 

పల్లవి:
ప్రాణనాథ బిరాన బ్రోవవే 

చరణం:
వేణుగానముచే పదియారు వేల 
గోపికల పాలించి యేలే
చరణం : 
వెన్నమీగడల వేడ్క మీరగను 
కన్న పిన్నవాండ్ల కడుపునించి 
తిన్నగా వెలయు దివ్యరూపమా 
చిన్ని కృష్ణ దయచేసి త్యాగరాజ