Thursday, April 18, 2013

marugElarA
















rAgam : jayaMtaSrI
tALam : Adi
ArTisTs : Smt.Priya Sisters
pallavi:
marugElarA O rAGavA

anupallavi:
marugEla carAcara rUpa
parAtpara sUrya sudhAkara lOcanA

caraNam :
anni nIvanucu naMtaraMgamuna
tinnagA vedaki telusukoMTi nayya
ninne gAni madini enna jAla norula
nannu brOva vayya tyAgarAja nuta

రాగం : జయంతశ్రీ
తాళం : ఆది  

పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి:
మరుగేల చరాచర రూప 
పరాత్పర సూర్య సుధాకర లోచనా 

చరణం :
అన్ని నీవనుచు నంతరంగమున 
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య 
నిన్నె గాని మదిని ఎన్న జాల నొరుల 
నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ నుత  

tanavAri tanamulEdA






















rAgam : bEgaDa
tALam : dEshAdi
ArTisT : Sri.TN.Seshagopalan garu
pallavi:
tanavAri tanamulEdA tArakAdhi pAvana vAdA

anupallavi:
inavaMSa rAjula kIguNamu
lennaDaina galadA nAdupai

caraNam :
alanADu annamAragiMcuvELa
baluvAnarula paMktinuMca lEdA

caraNam :
pErapEra bilaci hAramulu prEma
mIra mIrosaga lEdA nAdupai

caraNam :
rAmarAmarAma raccasEyakavE
tAmasaMbuyEla tyAgarAjanuta


రాగం : బేగడ
తాళం : దేషాది

పల్లవి:
తనవారి తనములేదా తారకాధి పావన వాదా

అనుపల్లవి:
ఇనవంశ రాజుల కీగుణము
లెన్నడైన గలదా నాదుపై

చరణం :
అలనాడు అన్నమారగించువేళ
బలువానరుల పంక్తినుంచ లేదా

చరణం :
పేరపేర బిలచి హారములు ప్రేమ
మీర మీరొసగ లేదా నాదుపై

చరణం :
రామరామరామ రచ్చసేయకవే
తామసంబుయేల త్యాగరాజనుత


jAnakI ramaNa


















rAgam : SuddhasImaMtini
tALam : Adi
ArTisT : Smt.Priya sisters
pallavi:
jAnakI ramaNa BaktapArijAta pAhi sakalalOka SaraNa

anupallavi:
gAnalOla Gana samAnanIla karuNAlavAla suguNaSIla

caraNam :
rakta naLinadaLanayana nRpAla
ramaNIyAnana mukura kapOla
BaktihIna jana madagaja jAla
paMcavadana tyAgarAja pAla

రాగం : శుద్ధసీమంతిని
తాళం : ఆది

పల్లవి:
జానకీ రమణ భక్తపారిజాత పాహి సకలలోక శరణ

అనుపల్లవి:
గానలోల ఘన సమాననీల కరుణాలవాల సుగుణశీల

చరణం :
రక్త నళినదళనయన నృపాల
రమణీయానన ముకుర కపోల
భక్తిహీన జన మదగజ జాల
పంచవదన త్యాగరాజ పాల