rAgam : madhyamAvati
tALam : Adi
ArTisT : Smt. R. Vedavalli
pallavi :
muccaTa brahmAdulaku dorakunA
muditalAra cUtAmurArE
anupallavi:
paccani dEhini parama pAvanini
pArvatini talacucunu haruDEgeDu
caraNam :
callare vElpula rIti virula kara|pallavamulanu taLukkanucu birudu
lella meraya nijaBaktulu pogaDada |ullamu raMjilla
tellani mEnuna niMDu sommulatO|mallehAramulu ma~ri SOBillaga
callanivELa sakala navaratnapu|pallakilO vEMcEsi vaccu
caraNam :
hitamaina sakalanai vEdyaMbulu sammatamuga aDugaDugu kAragiMpucu
mitamu lEni yupacAramulatO |sati saMtOshamuna satatamu
japatapamula nonariMcu|natajanula kaBIShTamu lavvAriga
vetaki yosagudu nanucu baMcanadI | pati veDali sogasu mIranga vaccu
caraNam :
BAgavatulu harinAmakIrtanamu | bAguga susvaramulatO viMta
rAgamulanu yAlapanamucEyu vaiBOgamulanu cUci
nAgaBUShaNuDu karuNAnidhiyai|vEganu sakala sujana rakShaNamuna
jAgarUkuDai kOrkela nosagu |tyAgarAju tAnanucunu vaccu
రాగం : మధ్యమావతి
తాళం : ఆది
పల్లవి :
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా
ముదితలార చూతామురారే
అనుపల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని తలచుచును హరుడేగెడు
చరణం :
చల్లరె వేల్పుల రీతి విరుల కర|పల్లవములను తళుక్కనుచు బిరుదు
లెల్ల మెరయ నిజభక్తులు పొగడద |ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో|మల్లెహారములు మఱి శోభిల్లగ
చల్లనివేళ సకల నవరత్నపు|పల్లకిలో వేంచేసి వచ్చు
చరణం :
హితమైన సకలనై వేద్యంబులు సమ్మతముగ అడుగడుగు కారగింపుచు
మితము లేని యుపచారములతో |సతి సంతోషమున సతతము
జపతపముల నొనరించు|నతజనుల కభీష్టము లవ్వారిగ
వెతకి యొసగుదు ననుచు బంచనదీ | పతి వెడలి సొగసు మీరంగ వచ్చు
చరణం :
భాగవతులు హరినామకీర్తనము | బాగుగ సుస్వరములతో వింత
రాగములను యాలపనముచేయు వైభోగములను చూచి
నాగభూషణుడు కరుణానిధియై|వేగను సకల సుజన రక్షణమున
జాగరూకుడై కోర్కెల నొసగు |త్యాగరాజు తాననుచును వచ్చు