rAgam : bauLi
tALam : Jampa
ArTisT : Smt.Soumya
pallavi:
mElukOvayya mammElukO rAmA
mElaina sItA samEta nA bhAgyamA
caraNam 1:
nArAdAdulu ninnu gOri nI mahimala
vArigA bADucunnAripudu tella
vAragA vachinadi SrIrAma navanIta
kshIramulu bAguga nAragimpanu vEga
caraNam 2:
PaNiSayana yanimiSharamaNu lUDigamu sEya
aNakuvaga niMDAru praNuti jEsedaru
maNImayABaraNulau yaNimAduruliDudIpa
maNulu telupAyenu taraNivaMSavaratilaka
caraNam 3:
rAjarAjESvara BarAjamuKasAkEta rAja sadguNa tyAgarAjanuta caraNa
rAjanya vibudhagaNa rAjAdulella ninu
pUjiMpagAcinArI jagamu pAliMpa
రాగం : బౌళి
తాళం : ఝంప
పల్లవి:
మేలుకోవయ్య మమ్మేలుకో రామా
మేలైన సీతా సమేత నా భాగ్యమా
చరణం 1:
నారాదాదులు నిన్ను గోరి నీ మహిమల
వారిగా బాడుచున్నారిపుదు తెల్ల
వారగా వచినది శ్రీరామ నవనీత
క్షీరములు బాగుగ నారగింపను వేగ
చరణం 2:
ఫణిశయన యనిమిషరమణు లూడిగము సేయ
అణకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణీమయాభరణులౌ యణిమాదురులిడుదీప
మణులు తెలుపాయెను తరణివంశవరతిలక
చరణం 3:
రాజరాజేశ్వర భరాజముఖసాకేత రాజ సద్గుణ త్యాగరాజనుత చరణ
రాజన్య విబుధగణ రాజాదులెల్ల నిను
పూజింపగాచినారీ జగము పాలింప