Friday, March 27, 2015

nAda sudhA

























rAgam : Arabhi
tALam : rUpakam
Artist : Smt. Radha Jayalakshmi

pallavi :
nAda sudhA rasambilanu
narAkRtiyAyE manasA

anupallavi:
vEda purANAgama
SAstrAdulakAdhAramau nAda

caraNam :
svaramulArunokaTi ghanTalu
vara rAgamu kOdandamu
dura naya dESyamu triguNamu  
nirata gati SaramurA
sarasa sangati sandarbhamu gala giramulurA
dhara bhajana bhAgyamurA
tyAgarAju sEvincu


రాగం : ఆరభి
తాళం : రూపకం

పల్లవి :
నాద సుధా రసంబిలను
నరాకృతియాయే మనసా

అనుపల్లవి:
వేద పురాణాగమ
శాస్త్రాదులకాధారమౌ నాద

చరణం :
స్వరములారునొకటి ఘంటలు
వర రాగము కోదందము
దుర నయ దేశ్యము త్రిగుణము  
నిరత గతి శరమురా
సరస సంగతి సందర్భము గల గిరములురా
ధర భజన భాగ్యమురా
త్యాగరాజు సేవించు  

Wednesday, February 4, 2015

nI bhajana gAna



















rAgam : nAyaki
tALam : Adi
ArtisT : SrI.bombay jayaSrI 

pallavi:
nI bhajana gAna rasikula nE nendu gAnarA rAmA
anupallavi:
SrI bhava sarOjAsanAdi SacI manO ramaNa vandya  ilalO
caraNam:
saguNa nirguNapu nija dabbara lanu
shaNmatamula marma mashTasiddhula
vagalu chUpa santa silli kanTini
varAnana tyAgarAja vinuta



రాగం : నాయకి
తాళం : ఆది

పల్లవి:
నీ భజన గాన రసికుల నే నెందు గానరా రామా
అనుపల్లవి:
శ్రీ భవ సరోజాసనాది శచీ మనో రమణ వంద్య  ఇలలో
చరణం:
సగుణ నిర్గుణపు నిజ దబ్బర లను
షణ్మతముల మర్మ మష్టసిద్ధుల
వగలు చూప సంత సిల్లి కంటిని
వరానన త్యాగరాజ వినుత

Thursday, April 18, 2013

marugElarA
















rAgam : jayaMtaSrI
tALam : Adi
ArTisTs : Smt.Priya Sisters
pallavi:
marugElarA O rAGavA

anupallavi:
marugEla carAcara rUpa
parAtpara sUrya sudhAkara lOcanA

caraNam :
anni nIvanucu naMtaraMgamuna
tinnagA vedaki telusukoMTi nayya
ninne gAni madini enna jAla norula
nannu brOva vayya tyAgarAja nuta

రాగం : జయంతశ్రీ
తాళం : ఆది  

పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి:
మరుగేల చరాచర రూప 
పరాత్పర సూర్య సుధాకర లోచనా 

చరణం :
అన్ని నీవనుచు నంతరంగమున 
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య 
నిన్నె గాని మదిని ఎన్న జాల నొరుల 
నన్ను బ్రోవ వయ్య త్యాగరాజ నుత  

tanavAri tanamulEdA






















rAgam : bEgaDa
tALam : dEshAdi
ArTisT : Sri.TN.Seshagopalan garu
pallavi:
tanavAri tanamulEdA tArakAdhi pAvana vAdA

anupallavi:
inavaMSa rAjula kIguNamu
lennaDaina galadA nAdupai

caraNam :
alanADu annamAragiMcuvELa
baluvAnarula paMktinuMca lEdA

caraNam :
pErapEra bilaci hAramulu prEma
mIra mIrosaga lEdA nAdupai

caraNam :
rAmarAmarAma raccasEyakavE
tAmasaMbuyEla tyAgarAjanuta


రాగం : బేగడ
తాళం : దేషాది

పల్లవి:
తనవారి తనములేదా తారకాధి పావన వాదా

అనుపల్లవి:
ఇనవంశ రాజుల కీగుణము
లెన్నడైన గలదా నాదుపై

చరణం :
అలనాడు అన్నమారగించువేళ
బలువానరుల పంక్తినుంచ లేదా

చరణం :
పేరపేర బిలచి హారములు ప్రేమ
మీర మీరొసగ లేదా నాదుపై

చరణం :
రామరామరామ రచ్చసేయకవే
తామసంబుయేల త్యాగరాజనుత


jAnakI ramaNa


















rAgam : SuddhasImaMtini
tALam : Adi
ArTisT : Smt.Priya sisters
pallavi:
jAnakI ramaNa BaktapArijAta pAhi sakalalOka SaraNa

anupallavi:
gAnalOla Gana samAnanIla karuNAlavAla suguNaSIla

caraNam :
rakta naLinadaLanayana nRpAla
ramaNIyAnana mukura kapOla
BaktihIna jana madagaja jAla
paMcavadana tyAgarAja pAla

రాగం : శుద్ధసీమంతిని
తాళం : ఆది

పల్లవి:
జానకీ రమణ భక్తపారిజాత పాహి సకలలోక శరణ

అనుపల్లవి:
గానలోల ఘన సమాననీల కరుణాలవాల సుగుణశీల

చరణం :
రక్త నళినదళనయన నృపాల
రమణీయానన ముకుర కపోల
భక్తిహీన జన మదగజ జాల
పంచవదన త్యాగరాజ పాల

Saturday, March 16, 2013

nArAyaNa hari























rAgam : yamunAkalyANi
tALam : Adi
ArTisT : Smt.Priya Sisters

pallavi :
nArAyaNa hari nArAyaNa hari
nArAyaNa hari nArAyaNa hari

caraNam :
naSvaramaina dhanASvamulanu nEviSvasiMca BUtESvara hari hari

caraNam :
kOTISulagani sATilEni palkubOTi nosagi mummATiki vEDanu
ASApiSAcAvESamu kalugu dhanESula gAcE dEsamu nEludu

caraNam :
nAlO nEnIcElO jikkiti nIlOBamu viDavElO teliyanu

caraNam :
BUlOkamulO mElOrvaru vidhivrAlO nIkaucAlO teliyanu

caraNam :
dUrE panulaku  dUrEru kaDa tErE panulaku  tErE manasunu

caraNam :
toli tAjEsina PalamE kaladani ila neMcani martyula celimeMduku

caraNam :
dUShaNahara paradUShaNa janagaNa BIShaNa suguNa viBIShaNa sannuta

caraNam :
nOreppuDu nI pErE balkanI vErE evarunnArE rAGava

caraNam :
mitrakulESa carita rasika jana mitramu kOrudu vRtrAri vinuta

caraNam :
vIna vimAna kavIna  hRdAlaya dInajanAvana dAnava hara SrI

caraNam :
nA jUpulu mI nAjUku tanamu nEjUDanI tyAgarAjulla malaru


రాగం : యమునాకళ్యాణి
తాళం : ఆది

పల్లవి :
నారాయణ హరి నారాయణ హరి
నారాయణ హరి నారాయణ హరి

చరణం :
నశ్వరమైన ధనాశ్వములను నేవిశ్వసించ భూతేశ్వర హరి హరి

చరణం :
కోటీశులగని సాటిలేని పల్కుబోటి నొసగి ముమ్మాటికి వేడను
ఆశాపిశాచావేశము కలుగు ధనేశుల గాచే దేసము నేలుదు

చరణం :
నాలో నేనీచేలో జిక్కితి నీలోభము విడవేలో తెలియను

చరణం :
భూలోకములో మేలోర్వరు విధివ్రాలో నీకౌచాలో తెలియను

చరణం :
దూరే పనులకు  దూరేరు కడ తేరే పనులకు  తేరే మనసును

చరణం :
తొలి తాజేసిన ఫలమే కలదని ఇల నెంచని మర్త్యుల చెలిమెందుకు

చరణం :
దూషణహర పరదూషణ జనగణ భీషణ సుగుణ విభీషణ సన్నుత

చరణం :
నోరెప్పుడు నీ పేరే బల్కనీ వేరే ఎవరున్నారే రాఘవ

చరణం :
మిత్రకులేశ చరిత రసిక జన మిత్రము కోరుదు వృత్రారి వినుత

చరణం :
వీన విమాన కవీన  హృదాలయ దీనజనావన దానవ హర శ్రీ

చరణం :
నా జూపులు మీ నాజూకు తనము నేజూడనీ త్యాగరాజుల్ల మలరు

Saturday, March 2, 2013

eMta rAnI



















rAgam : harikAMBOji
tALam : dEshAdi
ArTisT : Smt.Priya Sisters

pallavi :
eMta rAnI tanakeMta pOnI nI ciMta viDuvajAla SrIrAma

anupallavi :
aMtakAri nIceMtajEri hanumaMtuDai koluvalEda

caraNam :
SEShuDu Sivuniki BUShuDu lakShmaNavEShiyai velayalEdA

caraNam :
SiShTuDu maunivariShTuDu goppa vasiShTuDu  hituDu gAlEdA

caraNam :
naravara nIkai suragaNamunu vAnarulai koluvalEdA

caraNam :
AgamAttamagu nI guNamulu SrI tyAgarAja bADagalEdA


రాగం : హరికాంభోజి
తాళం : దేషాది

పల్లవి :
ఎంత రానీ తనకెంత పోనీ నీ చింత విడువజాల శ్రీరామ

అనుపల్లవి :
అంతకారి నీచెంతజేరి హనుమంతుడై కొలువలేద

చరణం :
శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషియై వెలయలేదా

చరణం :
శిష్టుడు మౌనివరిష్టుడు గొప్ప వసిష్టుడు  హితుడు గాలేదా

చరణం :
నరవర నీకై సురగణమును వానరులై కొలువలేదా

చరణం :
ఆగమాత్తమగు నీ గుణములు శ్రీ త్యాగరాజ బాడగలేదా